UPSC top rankers: ఐఏఎస్, ఐపీఎస్ లాంటి అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ -2024 ఫలితాలు కాసేపటి క్రితమే విడుదలైన విషయం తెలిసిందే. ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా సత్తా చాటారు.
ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ లాంటి పోస్టుల భర్తీ కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోయిన ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. జూన్ 16 న ప్రిలిమ్స్ పరీక్షలు జరిగాయి. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకు సెప్టెంబర్ 20 నుంచి 29వ తేది వరకు మెయిన్స్ పరీక్షలు జరిగాయి. మెయిన్స్ అర్హత సాధించిన అభ్యర్థులకు జనవరి 7 నుంచి ఏప్రిల్ 17 వరకు దశల వారీగా పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహించి తాజాగా తుది ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో మొత్తం 1009 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. ఇందులో జనరల్ కేటగిరీలో 335 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 109 మంది, ఓబీసీ నుంచి 318 మంది, ఎస్సీ కేటగరి నుంచి 160 మంది, ఎస్టీ కేటగిరి నుంచి 87 మంది అభ్యర్థుల చొప్పు సెలెక్ట్ అయ్యారు.
ఇదిగో.. టాప్ -10 ర్యాంకర్లు వీరే
⦿ శక్తి దూబే
⦿ హర్షిత గోయెల్
⦿ గోంగ్రే అర్చిత్ పరాగ్
⦿ షా మార్గి చిరాగ్
⦿ ఆకాశ్ గార్గ్
⦿ కోమల్ పూనియా
⦿ ఆయుషి బన్సల్
⦿ రాజ్ కృష్ణ ఝా
⦿ ఆదిత్య విక్రమ్ అగర్వాల్
⦿ మయాంక్ త్రిపాఠి
Also Read: Civil Services Results: సివిల్స్-2024 ఫలితాలు వచ్చేశాయ్.. మెరిసిన తెలుగు ఆణిముత్యాలు..
Also Read: CSIR-NEERI Recruitment: ఇంటర్ పాసైన వారికి బంపర్ ఆఫర్.. ఈ జాబ్ కొడితే నెలకు రూ.80,000 జీతం భయ్యా..