BigTV English

Coffee: మిషన్ కాఫీ తాగితే.. ఏం జరుగుతుందో తెలుసా?

Coffee: మిషన్ కాఫీ తాగితే.. ఏం జరుగుతుందో తెలుసా?

Coffee: ప్రస్తుత కాలంలో చాలా మంది రోజూ ఆఫీసులల్లో కానీ.. బయట ఎక్కడైనా సరే మిషన్ కాఫీ ఎక్కువగా తాగుతున్నారు. కొందరు ఆఫీసుల్లో ఉండే స్ట్రెస్ వల్ల కాఫీ తాగుతుంటారు. దీని వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. కాఫీల్లో ఉండే కెఫిన్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఇది శరీరానికి చాలా హాని కలిగిస్తుంది. దీంతో అనారోగ్య సమస్యలు భారిన ఎక్కువగా పడుతున్నారు.


జీర్ణ సమస్యలు:

మిషన్ కాఫీ తాగడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయంటున్నారు వైద్యుల. ఖాళీ కడుపుతో మిషన్ కాఫీ తాగడం వల్ల గ్యాస్ , మంట, అజీర్తి వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయంటున్నారు. ఆఫీసులకి వెళ్లే వారు మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు తాగుతూనే ఉంటారు.. ఇలా తాగడం వల్ల మీ ప్రాణానికే నష్టాన్ని కలిగిస్తుంది. దీనిలో ఉండే కెమికల్స్ మీ ఆహారం జీర్ణ కాకుండా చేస్తుంది. దీంతో జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తుంది. అలాగే కడుపు నొప్పి వంటి సమస్యలు కూడా వస్తాయని తెలిపారు.


గుండె సమస్యలు:

ఇప్పుడు ప్రతి ఆఫీసుల్లో కాఫీ మిషన్ ఉండటం సాధారణం. కాఫీ తాగడం వల్ల మనస్సుకు హాయిగా, ప్రశాంతంగా అనిపిస్తుంది. కాఫీ తాగిన వెంటనే శక్తి వచ్చినట్లు వచ్చినట్టు అనిపిస్తుంది. కానీ ఈ మిషన్ కాఫీ తాగడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని పెంచే హానికర రసాయనాలు ఉంటాయి. ఇది గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో తయారు చేసిన కాఫీ తాగడం వల్ల ఎలాంటి ప్రభావం లేదు కానీ మిషన్ కాఫీ తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరిగి గుండె ప్రమాదాన్ని పెంచుతుంది.

నిద్రలేమి:

మిషన్ కాఫీ తాగడం వల్ల నిద్ర లేమి సమస్యలు తలెత్తుతాయి. నిద్రకు ముందు కాఫీ తాగడం వల్ల నిద్ర పట్టదంటున్నారు. అలాగే ఆహారం తిన్న తర్వాత కాఫీ తాగడం వల్ల ఆహారం జీర్ణ కాకపోవడంతో చాలా సమస్యలు వస్తాయి. దీంతో తలనొప్పి, గ్యాస్, అజీర్ణం వంటి అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే మిషన్ కాఫీలను తాగడం తగ్గించండి.. అంతేకాకుండా విలైనంత వరకు టీ, కాఫీలను తగ్గించండి అని పరిశోధకులు వెల్లడించారు.

ఇతర ఆరోగ్య సమస్యలు:

ఆఫీసుల్లో ఉదయం పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు, మధ్యాహ్నం అలసటగా అనిపించినప్పుడు కాఫీ తాగాలనుకుంటారు.. ఆ సమయంలో మీ పక్కనే ఉన్న మిషన్ దగ్గరకు వెళ్లి కాఫీ తాగుతారు. కానీ ఇందులో ఉండే హానికర రసాయనాలు మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం అని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి. మిషన్ కాఫీ తాగడం వల్ల రక్తపోటు పెరుగటం, డయాబెటిస్ వంటి సమస్యలు వస్తాయంటున్నారు. అంతే కాకుండా బాడీ డిహైడ్రేషన్ అవుతుంది. అలాగే శరీరంలో ఐరన్ లోపం , రోగనిరోధక శక్తి తగ్గడం వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Also Read: పుచ్చకాయపై ఉప్పు చల్లుకుని తినాలా ? వద్దా ?

డ్రిప్: ఫిల్టర్ కాఫీ ఉపయోగాలు:

ఫిల్టర్ కాఫీ ఇంట్లో తయారు చేసుకొని తాగడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదం తక్కువగా ఉందని అంటున్నారు. దీనిలో హానికర రసాయనాలు తక్కువగా ఉంటాయని.. అలాగే మిషన్ కాఫీలో కన్నా ఫిల్టర్ కాఫీల కొలెస్ట్రాల్ స్థాయిలు తక్కువగా ఉంటాయి, గుండె సంబంధిత సమస్యలు వంటి వాటికి దూరంగా ఉంచుతుందని చెబుతున్నారు.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×