E-Paper
Advertisement

Pay Later In IRCTC: డబ్బులు చెల్లించకుండానే రైల్ టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఇదిగో ఇలా!

Pay Later In IRCTC: డబ్బులు చెల్లించకుండానే రైల్ టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఇదిగో ఇలా!
Advertisement

Indian Railway Pay Later Scheme: ప్రయాణీకులకు రోజు రోజుకు మెరుగైన సేవలు అందించేందుక భారతీయ రైల్వే కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ముఖ్యంగా టికెట్లు బుక్ చేసుకునే విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే డబ్బులు లేకపోయినా టికెట్లు బుక్ చేసుకునేలా ఓ స్కీమ్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనికి ‘ఇప్పుడే బుక్ చేసుకోండి, తర్వాత చెల్లించండి’ పేరుతో ఈ పథకాన్ని పరిచయం చేసింది. టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత 14 రోజుల వరకు డబ్బులు చెల్లించే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర కూడా డబ్బులు లేని సమయంలో ఈ పథకాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇంతకీ ఈ పథకాన్ని ఎలా ఉపయోగించుకోవాలో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు తెలుసుకుందాం.

డబ్బులు చెల్లించకుండా కన్ఫార్మ్ టికెట్ పొందే అవకాశం

Advertisement

డబ్బులు లేని సమయంలో దీనిని ఉపయోగించుకోవచ్చు. ఈ ప్రక్రియ అంతా ఆన్ లైన్ ద్వారానే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పథకాన్ని యూజ్ చేసుకునేందుకు ఈ క్రింది స్టెప్పులను ఫాలో అయితే సరిపోతుంది.

⦿ ముందుగా మీ IRCTC అకౌంట్ లోకి లాగిన్ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత, ‘ఇప్పుడే బుక్ చేసుకోండి’ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.

Advertisement

⦿ మీరు ప్రయాణీకుల వివరాలను, క్యాప్చా కోడ్‌ ను టైప్ చేయాల్సిన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. దాన్ని ఫిల్ చేసి సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది.

⦿ చెల్లింపులకు సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది. మీరు క్రెడిట్, డెబిట్, BHIM యాప్ తో పాటు నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపులు చేసే అవకాశం ఉంటుంది.

⦿ మీరు ‘పే లేటర్‌’ అనే అవకాశాన్ని వినియోగించుకోవాలంటే.. www.epaylater.in లో ముందుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

⦿ www.epaylater.in లో నమోదు చేసుకున్న తర్వాత.. మీకు చెల్లింపులకు సంబంధించి ఆప్షన్ కనిపిస్తుంది. అప్పుడు ‘పే లేటర్‌’ అనే ఎంపికను సెలెక్ట్ చేసుకున్న తర్వాత, మీరు డబ్బులు లేకుండానే కన్ఫార్మ్ రైలు టికెట్ ను పొందే అవకాశం ఉంటుంది.

⦿ టికెట్ రిజర్వేషన్ తర్వాత 14 రోజుల్లోపు మీరు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం 3.5 శాతం సర్వీస్ ఛార్జ్, జీఎస్టీ చెల్లించాలి. నిర్ణీత కాలపరిమితిలోపు చెల్లింపు చేస్తే, ఎలాంటి అదనపు ఛార్జ్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆలస్యం అయితే  36% వరకు జరిమానా వడ్డీని కలిగి ఉండవచ్చు.

ఈ పథకాన్ని తత్కాల్ టికెట్ల కోసం ఉపయోగించుకోవచ్చా?

‘పే లేటర్‌’ పథకాన్ని తత్కాల టికెట్లకు కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది. కానీ, కొన్ని కారణాల వల్ల దీనిని ఉపయోగించుకునేందుకు ఎక్కువగా ఇష్టపడరు.  తత్కాల్ బుకింగ్స్ అనేవి నిమిషాల్లోనే అయిపోతాయి. కానీ, ఈ స్కీమ్ ఉపయోగించుకోవడానికి థర్డ్ పార్టీ సైట్ కు తీసుకెళ్తుంది. సమయం ఎక్కువగా పట్టే అవకాశం ఉంటుంది. బుకింగ్ ప్రక్రియను లేట్ చేస్తుంది. ఫలితంగా టికెట్లు అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఎక్కువ మంది UPI, డెబిట్/క్రెడిట్ కార్డ్‌లు, IRCTC iPay ద్వారా తత్కాల్ టికెట్లను బుక్ చేసుకుంటారు. ఒకవేళ మీ నెట్ స్పీడ్ గా ఉంటే, వేగంగా టికెట్ బుక్ చేసుకోగలం అనుకుంటే ట్రై చేయొచ్చు.

Read Also: రైలుకు అకస్మాత్తుగా బ్రేకులు ఫెయిల్ అయితే? రైల్వే ఏం చేస్తుందో తెలుసా?

Related News

భారత్ నుంచి లండన్‌కు బస్సు సర్వీస్.. అమ్మో.. అన్ని రోజుల ప్రయాణమా?

ఒక్క టికెట్ చాలు.. 56 రోజుల పాటు రైల్లో దేశమంతా చుట్టేయొచ్చు!

భారత్‌లో మరో అద్భుతం.. సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇండియా!

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

ఫ్యామిలీతో థీమ్ పార్క్ వెళ్లే మజానే వేరు.. ప్రపంచంలోని 8 బెస్ట్ థీమ్ పార్క్స్ ఇవే

‘మిర్చి’ సాంగ్ లోని ఈ ప్లేస్ గుర్తుందా? అది ఇప్పుడు ఘోస్ట్ టౌన్, జనాలంతా ఏమయ్యారు?

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

Big Stories

Advertisement
×