BigTV English

Kalyan Ram : 20 ఏళ్ల తర్వాత ఆ సెంటిమెంట్… మళ్లీ అలాంటి యూనిక్ హిట్ వస్తుందా..?

Kalyan Ram : 20 ఏళ్ల తర్వాత ఆ సెంటిమెంట్… మళ్లీ అలాంటి యూనిక్ హిట్ వస్తుందా..?

Kalyan Ram : నందమూరి హీరో కళ్యాణ్ రామ్, సాయి ముంత్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా అర్జున్ S/O వైజయంతి. చిలుకూరి ప్రదీప్  మొదటిసారిగా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అశోక్ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై అశోక్ వర్ధన్, సునీల్ బలుసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విజయశాంతి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈనెల 18 వ తేదీన థియేటర్లలో రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ప్రమోషన్స్ లో భాగంగా మూవీ టీం రీసెంట్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఆ ఈవెంట్ కు అయన తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ హాజరై, కథ గురించి చెప్పి సినిమాపై అంచనాలను పెంచేశారు. 20 సంవత్సరాల కళ్యాణ్ రామ్ నట ప్రస్థానం గురించి ఇప్పుడు అభిమానులు చర్చించుకుంటున్నారు.


అతనొక్కడే తో మొదలైన ప్రస్థానం ..

నందమూరి హరికృష్ణ వారసుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన హీరో నందమూరి కళ్యాణ్ రామ్. 2005లో అతనొక్కడే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఆ సినిమాలో సింధుతులాని హీరోయిన్ గా నటించారు వైజాగ్ బీచ్ ఆధారంగా జరిగిన ఒక హత్య ఇద్దరు జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకువచ్చింది అనే కోణంలో ఈ సినిమా రూపొందించారు. మొదటి సినిమా అయినా, హీరోగాకళ్యాణ్ రామ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా ఆయన సోదరుడు నందమూరి జానకిరామ్ నిర్మాతగా రూపొందించారు.


ఆ తర్వాత 2008లో హరే రామ్ సినిమాతో డ్యూయల్ రోల్ పోషించి మెప్పించారు. జయీభవ, కళ్యాణ్ రామ్ కత్తి, ఓంత్రీడీ ఈ సినిమాలు అనుకున్నంత స్థాయిలో కళ్యాణ్ రామ్ కి అనుకున్నంత స్థాయిలో హిట్ కాలేదు. ఆ తర్వాత 2015లో వచ్చిన పటాస్ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్నారు. 2016 లో ఇజం అంతా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఆయన తమ్ముడు ఎన్టీఆర్ సినిమాలకు నిర్మాతగా, సిమాలను నిర్మిస్తున్నారు.

2022లో బింబిసార సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్నారు. 2005లో మొదలైన నందమూరి కళ్యాణ్ రామ్ సినీ ప్రస్థానం అంచలంచలుగా ఎదుగుతూ ఈ రోజు తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోల స్థాయి కి ఆయన ఎదుగుతూ వచ్చారు. ఇందుకు కారణం ఆయన సింప్లిసిటీ ఎటువంటి రూమర్స్ లేకుండా వ్యక్తిగత జీవితాన్ని ముందుకు తీసుకువెళ్లడం .

అదే సెంటిమెంట్..

సినిమా విషయానికి వస్తే ఏప్రిల్ 18వ తేదీన అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా ఆయన కెరియర్ లో కీలకమైనది. ప్రధాన పాత్రలో విజయశాంతి నటిస్తున్నారు. సరిలేరు నీకెవరు సినిమాతో రీ ఎంట్రీ  ఇచ్చిన విజయశాంతి ఈ సినిమాలో హీరో కి తల్లి క్యారెక్టర్ లో నటిస్తున్నారు .తల్లి కొడుకుల సెంటిమెంట్ తో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి.అప్పుడు వచ్చిన అతనొక్కడే  సెంటిమెట్ హిట్ అయినట్టు  ఇప్పుడు ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని, 20 ఏళ్ల నట ప్రస్థానంలో కళ్యాణ్ రామ్, ఈ సినిమాతో మరో బ్లాక్ బాస్టర్ ను తన ఖాతాలో వేసుకోవాలని, ఇండస్ట్రీలో రికార్డ్స్ నెలకొల్పాలని నందమూరి అభిమానులతో పాటు మనము కోరుకుందాం .

Kesari Chapter 2 First Review : కేసరి చాప్టర్ 2పై రానా ఫస్ట్ రివ్యూ… హిస్టరీ క్రియేట్ అంటూ.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×