Bakasura Restaurant OTT:ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు థియేటర్లలో విడుదలైన నెలలోపే ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చి అభిమానులను ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ‘బకాసుర రెస్టారెంట్’ సినిమా కూడా ఓటీటీలోకి రాబోతోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వెల్లడించారు. అసలు విషయంలోకి వెళ్తే.. సన్ నెక్స్ట్ వేదికగా ఈనెల అనగా సెప్టెంబర్ 12 నుండి బకాసుర రెస్టారెంట్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ హాస్య నటులు ప్రవీణ్ (Praveen ), కేజిఎఫ్ ఫేమ్ గరుడ రామ్(Garuda Ram), వైవాహర్ష (Viva Harsha).ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రమిది. ఎస్. జే.శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 8వ తేదీన థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే.. అయితే ఇప్పుడు నాలుగు వారాలకే ఓటీటీలోకి రాబోతుండడంతో అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ఇటు ఓటీటీ వేదికగా ఓటీటీ లవర్స్ ను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.
ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. పరమేశ్వర్ (ప్రవీణ్) ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ ఉంటారు. అయితే అతడికి వ్యాపారం చేయాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. దాంతో రెస్టారెంట్ పెట్టాలన్న తన కోరికను రూమ్మేట్స్ తో పంచుకుంటారు. ప్రస్తుతానికి డబ్బులు సంపాదించడానికి యూట్యూబ్ ఛానల్ పెడదామని సలహా ఇస్తారు. ఇక అనుకున్నదే తడువుగా యూట్యూబ్ ఛానల్ పెట్టి దెయ్యంపై చేసిన తొలి వీడియో వైరల్ కావడంతో రెండో వీడియో షూటింగ్ కోసం ఒక పాత బంగ్లా కి వెళ్తారు. అక్కడ కనిపించిన పుస్తకంలో ఉన్నట్టుగానే క్షుద్ర పూజ చేస్తారు దీంతో బక్క సూరి (వైవా హర్ష) అనే 200 ఏళ్ల నాటి ఒక వ్యక్తి ఆత్మ బయటకు వస్తుంది.
also read:Jr.NTR: ఆకట్టుకుంటున్న ఎన్టీఆర్ పెన్సిల్ స్కెచ్.. ఏకంగా అన్ని లక్షలా?
ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
ఆత్మతో వీరు ఆటలాడే ప్రయత్నం చేయగా.. పరమేశ్వర్ స్నేహితుడు శరీరంలోకి ఆ ఆత్మ ప్రవేశిస్తుంది.. దాని ఆకలికి హద్దులు ఉండవు.. ఆత్మను బయటకు పంపేందుకు పరమేశ్వర్ గ్యాంగ్ ఎలాంటి ప్రయత్నాలు చేసింది? ఆ పాత బంగ్లాలో ఉన్న బక్క సూరి ఎవరు? ఆయన నేపథ్యం ఏమిటి? రెస్టారెంట్ పెట్టాలన్న పరమేశ్వర్ కల నెరవేరిందా? ఆ ఆత్మను తమ స్నేహితుడి శరీరం నుండి బయటకు పంపించే క్రమంలో వీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఇలా పలు విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.. మొత్తానికైతే అటు కామెడీతో ఇటు ఆద్యంతం ఆకట్టుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బకాసుర రెస్టారెంట్ ఓటీటీ లో ఎలాంటి సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.
ట్రైలర్ తోనే భారీ రికార్డు..
ఇకపోతే ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ విడుదల చేసినప్పుడు వన్ మిలియన్ కి పైగా వ్యూస్ సొంతం చేసుకుంది.. అటు ఆడియన్స్ ని కూడా ఈ ట్రైలర్ బాగా ఆకట్టుకుంది.హారర్ , థ్రిల్లర్ , మైథాలజీ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ఏకంగా 2.5 రేటింగును సొంతం చేసుకుంది. ఏది ఏమైనా ఈ సినిమా అటు సత్య, ఇటు ప్రవీణ్ వైవా హర్షాలకు మంచి గుర్తింపును అందించిందని చెప్పవచ్చు.
Five young souls. One dark force.#BakasuraRestaurant OTT RELEASE SEPTEMBER 12 #sunnxt
The nightmare begins on 12th September Watch It On SunNXT..!!#Bakasura #UnleashTheDarkness #WatchItOnSunNXT #SupernaturalThriller #StreamingFrom12thSeptemberOnSunNXT pic.twitter.com/8jMdnGJxLI— OTT TELUGU (@GuruNat90064034) September 5, 2025