BigTV English

Google Pixel 10: గూగుల్ పిక్సెల్ 10 భారీ ఆఫర్స్‌తో భారత్‌లో లాంచ్. ధర ఎంతో తెలుసా?

Google Pixel 10: గూగుల్ పిక్సెల్ 10 భారీ ఆఫర్స్‌తో భారత్‌లో లాంచ్. ధర ఎంతో తెలుసా?

Google Pixel 10: స్మార్ట్‌ఫోన్‌లపై మనిషికి ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఒకప్పుడు ఫోన్ అంటే కేవలం మాట్లాడటానికే ఉపయోగించేవాళ్లం. కానీ ఇప్పుడు ఫోన్ అంటే చిన్న కంప్యూటర్ అన్నట్టే మారిపోయింది. ఇంటర్నెట్‌ నుంచి వినోదం వరకు, చదువు నుంచి వ్యాపారం వరకు ప్రతి ఒక్క పనికీ స్మార్ట్‌ఫోన్ తప్పనిసరి అయ్యింది. ప్రతి కొత్త మోడల్‌తో మరిన్ని సౌకర్యాలు వస్తుండటంతో, ప్రజలలో ఆకర్షణ పెరుగుతూనే ఉంది. కెమెరా, డిజైన్, కొత్త ఫీచర్లు ఇవన్నీ కలిసి స్మార్ట్‌ఫోన్‌ను కేవలం పరికరం కాకుండా జీవిత భాగస్వామిగా మార్చేశాయి. స్మార్ట్ ఫోన్ లేని జీవితం ఒక్క క్షణం కూడా ఊహించుకోవడమే కష్టంగా మారుతుంది. ఈ నేపథ్యంలో గూగుల్ పిక్సెల్ 10 స్మార్ట్ ఫోన్ ఇప్పుడు భారీ ఆఫర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ఆ ఫోన్ లో ఫ్యూచర్స్, ధర ఎంతో తెలుసుకుందాం.


రూ.7వేలు అదనపు డిస్కౌంట్- ఎక్స్‌చేంజ్ బోనస్ రూ.5వేలు

గూగుల్ పిక్సెల్ 10 స్మార్ట్ ఫోన్ రూ. 79,999 ధరతో ఇండియాలో లాంచ్ అయ్యింది. ఇది నాలుగు సరికొత్త రంగుల్లో (నీలి, తెలుపు, పచ్చ, నలుపు) కస్టమర్లకు ఆకట్టుకుంటోంది. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్, గూగుల్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు. లాంచ్ చేసిన ఆఫర్‌లో హెచ్‌డీ‌ఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ద్వారా కొనుగోలు చేసినవారికి రూ. 7,000 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అదనంగా ఎక్స్‌చేంజ్ బోనస్ ద్వారా రూ.5,000 తగ్గింపు కూడా ఉంటుంది. ఈ రెండు ఆఫర్స్‌తో ఫోన్ ధర కేవలం రూ. 67,999కి మాత్రమే రానుంది.


క్వాలిటీ పరంగా మొబైల్ పీస్ అదుర్స్

పిక్సెల్ 10 ఫోన్‌లో కెమెరా సెటప్ మరింత ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. వెనుక భాగంలో 48ఎంపీ క్వాడ్ పీడీ కెమెరాతో పాటు, 13ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, 10.8ఎంపీ డ్యూయల్ పీడీ టెలిఫోటో కెమెరా కలిపి మొత్తం మూడు కెమెరాలు అమర్చారు. ముందు భాగంలో 10.5ఎంపీ కెమెరా అమర్చడంతో మొబైల్ అందరిని అకట్టుకునేలా ఉంది. ఈ కెమెరాల ద్వారా 5ఎక్స్ ఆప్టికల్ జూమ్ చేయగలుగుతారు. అలాగే 60ఎఫ్‌పీఎస్ 4కే వీడియోలను రికార్డ్ చేయగల సదుపాయం ఉంది. అదనంగా, ఏఐ ఆధారిత కెమెరా ఫీచర్లు, ప్రత్యేక గూగుల్ కెమెరా ఫిల్టర్‌ను కూడా అందించారు. మొత్తం మీద పిక్సెల్ 10 కెమెరా సెటప్ ఫోటోలు, వీడియోలు తీసుకోవడంలో వినియోగదారులకు ప్రత్యేక అనుభవాన్ని ఇస్తుంది.

Also Read: BSNL New Plan: జస్ట్ రూ. 319కే 65 డేస్ వ్యాలిడిటీ.. అన్ లిమిటెడ్ కాల్స్, డేటా కూడా..

ఈ ఫోన్‌లో 6.3 అంగుళాల OLED ఆక్టువా డిస్‌ప్లేను అందించారు. క్వాడ్ హెచ్‌డీ రిజల్యూషన్‌తో పాటు 3000 స్క్రీన్ బ్రైట్‌నెస్, 120హెచ్‌జెడ్ అంటే స్క్రీన్ ఒక సెకనులో ఎన్ని సార్లు కొత్త ఇమేజ్‌ను రిఫ్రెష్ సదుపాయం అమర్చారు. రిఫ్రెష్ రేట్ ఫీచర్లను కలిపి మరింత నాణ్యమైన అనుభవాన్ని ఇస్తుంది.

ఇన్-స్క్రీన్ ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌

ఫోన్ భద్రత పరంగా చూసుకుంటే, ఇన్-స్క్రీన్ ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌ను కలిపారు. మొబైల్ ప్రాసెసింగ్‌ విషయంలో తాజా టెన్ సర్ జీ5 చిప్‌ సెట్, టైటాన్ ఎం2 సెక్యూరిటీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. అదనంగా 12జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉండటంతో ఫోన్ చాలా స్పీడ్‌గా పనిచేస్తుంది, దీనివల్ల ఫోన్‌లో ఎక్కువ స్టోరేజ్ ఉంటుంది. మొత్తంగా డిస్ ప్లే, భద్రత, పనితీరు పరంగా ఈ ఫోన్ వినియోగదారులకు ప్రీమియం అనుభూతిని అందిస్తుంది.

AI ఆధారంగా ప్రత్యేక ఫీచర్లు

ఈ ఫోన్‌లో AI ఆధారంగా ప్రత్యేక ఫీచర్లుగా జెమినీ నానో, జెమినీ లైవ్, సర్కిల్‌తో సెర్చ్ వంటి సౌకర్యాలను అందించారు. భద్రత కోసం ఈ ఫోన్‌లో ఎమర్జెన్సీ ఎస్ఓఎస్, భూకంపాలు లాంటి ముందస్తు హెచ్చరికలు, కార్ క్రాష్ గుర్తింపు అంటే వాహనంలో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగితే, ఫోన్‌లోని ప్రత్యేక సెన్సర్లు, దొంగతనం నివారణ వంటి ఆధునిక ఫీచర్లను అందించారు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే, 4970 ఎంఏహెచ్ సామర్థ్యంతో పాటు వేగవంతమైన ఛార్జింగ్, 15డబ్ల్యూ వైర్లెస్ ఛార్జింగ్ మద్దతు ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడిచే ఈ ఫోన్‌కు 7 సంవత్సరాల పాటు సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ అందుబాటులో ఉంటాయి. ఇది కస్టమర్లకు స్మార్ట్  ఫోన్ అనుభూతిని ఇవ్వనుంది. అంతే కాదు, మీ పాత ఫోన్‌కి గుడ్‌బై చెప్పి, ఈ కొత్త పిక్సెల్ 10ని ఇంటికి తీసుకెళ్లండి. మీకు కావాల్సిన ప్రతి ఫీచర్‌తో కొత్త అనుభూతిని ఆస్వాదించండి.

Related News

BSNL New Plan: జస్ట్ రూ. 319కే 65 డేస్ వ్యాలిడిటీ.. అన్ లిమిటెడ్ కాల్స్, డేటా కూడా..

Amazon Offers: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025.. స్మార్ట్ ఫోన్స్ బెస్ట్ ఆఫర్స్!

Tesla Sales: ఇండియాలో ఫస్ట్ టెస్లా కార్ ఓనర్ ఆయనే.. ఆ కారు ఫీచర్లు ఇవే

రిటైర్ అయ్యాక ప్రతి నెలా 1 లక్ష రూపాయల పెన్షన్ కావాలా..అయితే ఇలా ఇన్వెస్ట్ చేయండి..?

BSNL Offer: 72 రోజుల వ్యాలిడిటీ, డైలీ 2GB డేటా.. BSNL నుంచి మరో అదిరిపోయే ప్లాన్!

Big Stories

×