E-Paper
Advertisement

హెల్దీ అండ్ టేస్టీ ఓట్స్ మసాలా వడ..ఈవెనింగ్ స్నాక్స్‌కి పర్ఫెక్ట్!

హెల్దీ అండ్ టేస్టీ ఓట్స్ మసాలా వడ..ఈవెనింగ్ స్నాక్స్‌కి పర్ఫెక్ట్!
Advertisement

Oats masala vada recipe: సాయంత్రం అయిందంటే చాలు ఏదో ఒక స్నాక్ తినాలనిపించడం కామన్. ముఖ్యంగా టీతో పాటు వేడి వేడిగా కరకరలాడే స్నాక్స్ ఉంటే ఆ మజానే వేరు. ఈవెనింగ్ పూట అయితే పిల్లలైనా,పెద్దలైనా బయట దొరికే జంక్ ఫుడ్ తినడానికి ఇష్టపడతారు. కానీ అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందుకే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యాన్నిచ్చే ఒక అద్భుతమైన ఈవినింగ్ స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదే ట్రెండింగ్ అండ్ హెల్దీ ‘ఓట్స్ మసాలా వడ’!

ఓట్స్ మసాలా వడ:

ప్రస్తుత బిజీ లైఫ్‌లో ఆరోగ్యంపై శ్రద్ధ పెంచడం చాలా అవసరం. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు లేదా ఫిట్‌గా ఉండాలనుకునేవారు.. ఆయిలీ ఫుడ్‌కి దూరంగా ఉంటారు. అలాంటి వారి కోసం ఓట్స్ అద్భుతమైన ఆహారం. అయితే.. రోజూ ఓట్స్ ఉప్మా లేదా ఇతర బ్రెక్ ఫాస్ట్‌లు తిని బోర్ కొట్టిందా? అయితే అలాంటి వారి కోసమే ఎంతో రుచికరమైన, కరకరలాడే ‘ఓట్స్ మసాలా వడ’. ఇది తింటుంటే నార్మల్ మినప వడల కంటే ఎంతో టేస్టీగా ఉంటుంది.

ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు :

Advertisement

ఓట్స్: 1 కప్పు

శనగపిండి: అర కప్పు

Advertisement

ఉల్లిపాయ: 1

పచ్చిమిర్చి: 3 లేదా 4

అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టీస్పూన్

కొత్తిమీర, పుదీనా తరుగు: కొద్దిగా

జీలకర్ర, సోంపు: అర టీస్పూన్ చొప్పున

కారం,పసుపు: సరిపడా

ఉప్పు,నూనె: సరిపడా

తయారీ విధానం:

1. ముందుగా ఒక గిన్నెలో ఓట్స్ తీసుకుని, వాటిని కొద్దిగా పొడి పొడిగా లేదా మిక్సీ జార్‌లో వేసి మరీ మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. లేదంటే పది నిమిషాలు నాన బెట్టి నీరు పిండేయండి.

2. ఒక పెద్ద గిన్నెలో గ్రైండ్ చేసుకున్న ఓట్స్, శన గపిండి , సన్నగా తరిగిన ఉల్లి పాయ ముక్కలు,పచ్చి మిర్చి,అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి.

3.అందులోనే జీల కర్ర,సోంపు,కారం,పసుపు,తగినంత ఉప్పు,సన్నగా తరిగిన కొత్తి మీర,పుదీనా వేసి బాగా కలపాలి. పిండి ముద్దలా రావడానికి .. కొన్ని నీళ్లు చల్లుకోవాలి.

4.ఇప్పుడు చేతికి కొద్దిగా నూనె రాసుకుని, పిండిని చిన్న ఉండలుగా తీసుకొని అర చేతిలో పెట్టి వడల మాదిరిగా ఒత్తు కోవాలి.

డీప్ ఫ్రై లేదా షాలో ఫ్రై: స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత తయారు చేసుకున్న ఓట్స్ వడలను నూనెలో వేసి మధ్య మంటపై బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. హెల్త్ కాన్షియస్ ఉన్నవారు దీన్ని అప్పం పాన్ లో కొద్దిగా నూనె వేసి షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు.

క్రిస్పీగా, గుమ గుమలాడే ఈ ఓట్స్ మసాలా వడలను వేడి వేడి టీ లేదా టమాటా కెచప్‌తో తింటుంటే.. ఆ రుచి మాటల్లో చెప్పలేం. కేవలం పదే నిమిషాల్లో చేసుకోగలిగే ఈ హెల్దీ స్నాక్‌ని ఈ రోజే మీ ఇంట్లో ట్రై చేసి అందరి ప్రశంసలు పొందండి!

Related News

ఎనర్జీ ఇస్తుందనుకుంటే.. ప్రాణాలకే ఎసరు పెడుతోంది.. తల్లిదండ్రులూ జాగ్రత్త!

నోరూరించే బీరకాయ కొత్తిమీర చట్నీ..ఒక్కసారి తింటే వదిలిపెట్టరు

ట్రెడిషనల్ స్టైల్ కట్టే పొంగలి..ఇలా చేస్తే తిన్నవాళ్ళు మెచ్చుకోవాల్సిందే!

మెట్టెలు, ముక్కుపుడక కేవలం అలంకారమేనా? ఆడవాళ్లకు వీటిని తప్పనిసరి చేయడం వెనుకున్న కారణాలివే!

ఒక్కసారి ఇలా రాయలసీమ మటన్ వేపుడు చేసి చూడండి.. మళ్లీ మళ్లీ ఇదే చేసుకుంటారు!

గోవా స్టైల్ కరకరలాడే రవ్వ ఫిష్ ఫ్రై రెసిపీ.. తక్కువ నూనెతో అద్భుతమైన రుచి!

బగారా రైస్, చపాతీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్.. ఘుమఘుమలాడే గుత్తి వంకాయ కాజు మసాలా!

Big Stories

Advertisement
×