Telugu Movie OTT : కూతురి పుట్టినరోజు కోసం ఓ తండ్రికి కొంత డబ్బు అవసరం అవుతుంది. తన అవసరం చెప్పినందుకు ఎదురైన అవమానం అతని మనసును ఎంతగానో గాయపరుస్తుంది. అదే సమయంలో అతను పని చేసే యజమాని కారులో ఊహించని స్థాయిలో నగదు కనిపిస్తుంది. చేతిలో డబ్బు లేక ఇబ్బంది పడుతున్న వ్యక్తికి… కళ్లముందు పెద్ద మొత్తంలో క్యాష్ కనిపిస్తే మనసులో ఎలాంటి సంఘర్షణ మొదలవుతుంది ? డబ్బు, ఆత్మగౌరవం, తండ్రి–కూతుళ్ల బంధం వంటి అంశాలన్నీ ఉన్న తెలుగు చిత్రం ‘ఒక చిన్న ప్రశ్న’ (Oka Chinna Prasna). మరి ఈ ఇంట్రెస్టింగ్ తెలుగు మూవీ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వచ్చింది అంటే ?
కిరణ్ ఓ సాధారణ డ్రైవర్. పెద్దగా ఆస్తులు లేని అతని కుటుంబానికి చిన్న చిన్న అవసరాలే పెద్ద భారంగా మారుతుంటాయి. అయితే తన కూతురి విషయంలో మాత్రం అతను ఎప్పుడూ వెనక్కి తగ్గడు. ఆమె పుట్టినరోజును సంతోషంగా జరపాలని భావించిన కిరణ్ కు కొంత డబ్బు అవసరం అవుతుంది. ఆ డబ్బు కోసం అడిగినప్పుడు అతనికి ఎదురయ్యే స్పందన మాత్రం బాధ పెడుతుంది. యజమాని తన అవసరాన్ని పెద్దగా పట్టించుకోకుండా అవమానించడం అతని ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. డబ్బున్న వారికి చిన్న విషయంగా కనిపించేది… తనలాంటి మధ్యతరగతి వ్యక్తికి ఎంత ముఖ్యమో ఈ సంఘటన ద్వారా చూపించారు దర్శకుడు.
ఇలాంటి సమయంలో కిరణ్ పని చేసే యజమాని కారులో భారీ మొత్తంలో నగదు కనిపిస్తుంది. ఆ టైమ్ లో కిరణ్ కు అది ఓ పరీక్షలా మారుతుంది. ఒకవైపు తన కూతురి కోరిక తీర్చాలనే తండ్రి మనసు… మరోవైపు తనది కాని డబ్బును తాకకూడదనే బాధ్యత. ఈ రెండింటి మధ్య అతను తీసుకునే నిర్ణయమే కథను మరో కీలక మలుపు తిప్పుతుంది. ఇక్కడి నుంచి కిరణ్ కథ కేవలం డబ్బు చుట్టూ తిరగదు. సమాజంలో డబ్బున్నవాళ్లకు, సాధారణ ప్రజలకు మధ్య ఉన్న తేడా… గౌరవం కోసం ఒక మనిషి చేసే పోరాటం… తండ్రి తన పిల్లల కోసం ఎంత వరకు వెళ్లగలడనే భావోద్వేగంతొ స్టోరీ సాగుతుంది. కిరణ్ కూతురు కూడా తన తండ్రి ఎదుర్కొంటున్న పరిస్థితిని అర్థం చేసుకుని తనదైన రీతిలో స్పందిస్తుంది. ఏకంగా పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగుతుంది.
అలా ఒక చిన్న కుటుంబ అవసరం చివరకు పెద్ద నైతిక సమస్యగా మారుతుంది. కిరణ్ ముందున్న డబ్బు అతని జీవితాన్ని మార్చే అవకాశం కావచ్చు.. అదే సమయంలో అతన్ని తీవ్రమైన సమస్యల్లోకి నెట్టే ప్రమాదం కూడా కావచ్చు. కిరణ్ చివరకు ఏ నిర్ణయం తీసుకున్నాడు ? కారులోని నగదుకు ఏమైంది ? తన కూతురి కోసం తండ్రి చేసిన ప్రయత్నం ఎలాంటి పరిణామాలకు దారితీసింది ? ఒక సాధారణ కుటుంబం ఎదుర్కొనే ఈ చిన్న సమస్యే చివరకు ఎందుకు ఇంత పెద్ద విషయంగా మారిందనేది ‘ఒక చిన్న ప్రశ్న’ సినిమాలో చూడాల్సిన ఆసక్తికరమైన అంశం.
Also Read : ఒకే రూమ్‌లో క్రష్‌తో సీక్రెట్ లైఫ్… చెప్పుకోలేని ప్రేమతో హీరో తిప్పలు… నెట్‌ఫ్లిక్స్‌లో సీజన్ 2 ల్యాండింగ్
‘ఒక చిన్న ప్రశ్న’ తెలుగు సినిమానే. అక్టోబర్ 4 నుంచి ETV Winలో స్ట్రీమింగ్ అవుతోంది. కథా సుధ సిరీస్ లో భాగంగా ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక తెలుగు సినిమానే కాబట్టి తెలుగు ఆడియో అందుబాటులో ఉంది. బాలాదిత్య (Baladitya) ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు వేగేశ్న సతీష్ దర్శకత్వం వహించారు.