Mohsin Naqvi: ఆసియా 2025 టోర్నమెంట్ ( Asia Cup 2025 ) విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి సెప్టెంబర్ 28వ తేదీ వరకు ఈ మెగా టోర్నమెంట్ జరిగింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ టోర్నమెంటులో ఛాంపియన్ గా టీమిండియా నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు పైన ఏకంగా ఐదు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది టీం ఇండియా. అయితే ఫైనల్లో గెలిచిన కూడా ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ట్రోఫీని టీమిండియా తీసుకోలేదు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ గా ఉన్న మొహ్సిన్ నఖ్వీ ( Mohsin Naqvi ) ప్రస్తుతం ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ( Asian Cricket Council ) చైర్మన్ గా ఉన్నారు. ఈ కారణంగానే మనవాళ్లు ఆ ట్రోఫీని తీసుకోలేదు. ఇండియాకు పంపించాలని మొహ్సిన్ నఖ్వీకి చాలా సార్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి ( Board of Control for Cricket in India ) రిక్వెస్ట్ పెట్టింది. అయినా కూడా మొహ్సిన్ నఖ్వీ వినడం లేదు. ఇప్పటికీ ట్రోఫీని పంపించలేదు.
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ట్రోఫీ విషయంలో తాజాగా మరోసారి మొహ్సిన్ నఖ్వీ ( Mohsin Naqvi )ని సంప్రదించిందట భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఇప్పటికైనా ట్రోఫీని ఇవ్వాలని కోరిందట. టోర్నమెంట్ ఫినిష్ అయి నెల రోజులు పూర్తి అయింది. ఇప్పటికీ కూడా ట్రోఫీ ఇవ్వకపోతే ఎలా అని మొహ్సిన్ నఖ్వీ ( Mohsin Naqvi )కి లేఖ రాసిందట భారత క్రికెట్ నియంత్రణ మండలి. అయితే దీనిపై తాజాగా మొహ్సిన్ నఖ్వీ స్పందించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే తాను చెప్పాను.. వస్తే సూర్య కుమార్ ను తన ఆఫీస్ కు వచ్చి ట్రోఫీని తీసుకు వెళ్ళమనండి.. అతనికి కుదరకపోతే టీమిండియాలో ఎవరైనా పర్వాలేదు. అర్షదీప్ వచ్చిన కూడా తాను ట్రోఫీ ఇచ్చేస్తా. అందులో ఎలాంటి డౌట్ లేదంటూ మొహ్సిన్ నఖ్వీ సమాధానం ఇచ్చారట. కానీ నేను మాత్రం ఇండియాకు పంపించేది లేదని భీష్ముంచుకొని కూర్చున్నారట. దీంతో మొహ్సిన్ నఖ్వీ పైన భారత క్రికెట్ నియంత్రణ మండలి సీరియస్ అయినట్టు తెలుస్తోంది.
ఆసియా ఫైనల్ 2025 టోర్నమెంటులో ( Asia Cup 2025 ) టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. దీంతో ఆసియా కప్ ను 9వ సారి గెలుచుకుంది టీం ఇండియా. ఈ మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ( Pak) 19.1 ఓవర్లలో 146 పరుగులు చేసి కుప్పకూలింది. మిడిల్ ఆర్డర్ కుప్పకూలడంతో పాకిస్తాన్ తక్కువ స్కోరు చేసింది. ఇక అనంతరం చేజింగ్ కు దిగిన టీమిండియా, అద్భుతంగా రాణించింది. టాపార్డర్ వికెట్లు కుప్పకూలినా, తిలక్ వర్మ మాత్రం చివరి వరకు పోరాడాడు. దీంతో 5 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది.
🚨 BCCI CONTACTS MOHSIN NAQVI FOR ASIA CUP TROPHY 🚨
– Mohsin Naqvi suggested holding a ceremony in the first week of November and said, 'Bring one of your players to receive the trophy'. pic.twitter.com/DclizczdlH
— Sheri. (@CallMeSheri1_) October 21, 2025