భారత ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 11 భాషలను క్లాసిక్ భాషలుగా గుర్తించింది. వాటిలో ఒకటి తెలుగు. అత్యంత అందమైన, అత్యంత పురాతనమైన భాషగానూ గుర్తింపు తెచ్చుకుంది. ఉభయ తెలుగు రాష్ట్రాలే కాదు, దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్నారు. ఇక పలు దేశాల్లోనూ తెలుగు మాట్లాడే ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇంతకీ ఏ దేశంలో ఎంత మంది తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్నారో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ప్రపంచంలో తెలుగు మాట్లాడే ప్రజలు ఏ దేశాల్లో ఉన్నారంటే?
ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రస్తుతం పలు దేశాల్లో సత్తా చాటుతున్నారు. ఫార్మా, హెల్త్ రంగాలతో పాటు పొలిటికల్ గానూ రాణిస్తున్నారు. మరికొన్ని దేశాల్లో లేబర్స్ గానూ పని చేస్తున్నారు.
⦿ కెనడా- 54,685
కెనడాలో పెద్ద సంఖ్యలో తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్నారు. ఆ దేశంలో 54, 685 మంది తెలుగు ప్రజలు నివసిస్తున్నారు. వీరిలో ఉద్యోగస్తులతో పాటు విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు.
⦿ ఆస్ట్రేలియా- 59,400
ఆస్త్రేలియాలోనూ పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు నివసిస్తున్నారు. ఇక్కడ కూడా ఎక్కువ మంది ఉద్యోగస్తులతో పాటు విద్యార్థులు ఉన్నారు. ఆస్ట్రేలియాలోని పలు ప్రధాన నగరాల్లో తెలుగు ప్రజలు నివసిస్తున్నారు.
⦿ మలేషియా 1,26,000
ఇక మలేషియాలో పెద్ద సంఖ్యలో తెలుగు వారు జీవిస్తున్నారు. నిజానికి ఇక్కడ సౌత్ స్టేట్స్ కు సంబంధించిన ప్రజలు ఎక్కువగా ఉంటారు. అందులోనూ తమిళనాడు వాసులు అధికంగా కనిపిస్తారు. తెలుగు ప్రజలు కూడా ఎక్కువగానే ఉన్నారు. మలేషియాలో అధికారిక లెక్కల ప్రకారం 1,26,000 మంది తెలుగు ప్రజలు నివసిస్తున్నారు.
⦿ మయన్మార్- 1,38,000
తెలుగు ప్రజలు ఎక్కువగా నివసించే దేశాల్లో మయన్మార్ ఒకటి. ఇక్కడ ఏకంగా 1,38,000 మంది నివసిస్తున్నారు. వీరిలో ఎక్కువగా ఉద్యోగస్తులు, లేబర్ పనులు చేసే వాళ్లు కూడా ఉన్నారు.
Read Also: వారం రోజుల ప్రేమికుల పండుగ, ఒక్కో రోజు ఒక్కో స్పెషల్!
⦿ సౌదీ అరేబియా- 3,83,000
ఇక సౌదీ అరేబియాలోనూ చాలా మంది తెలుగు ప్రజలు నివసిస్తున్నారు. వీరిలో ఎక్కువగా తెలంగాణ నుంచి వెళ్లిన వాళ్లే ఉన్నారు. అక్కడ చాలా మంది భవన నిర్మాణ రంగంలో పని చేస్తున్నారు. ఇంజినీర్లుగానూ, లేబర్ గానూ పనులు చేస్తున్నారు. తెలంగాణ నుంచి ఉపాధి కోసం ఎక్కువగా ఆదేశానికి వెళ్తుంటారు. ఇక్కడ మొత్తం 3, 83,000 మంది నివసిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
⦿ అమెరికాలో 12,30,000
భారత్ తర్వాత ఎక్కువ మంది తెలుగు మాట్లాడే ప్రజలు అమెరికాలో ఉన్నారు. అక్కడ పలు రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. మొత్తంగా అమెరికాలో 12,30,000 మంది తెలుగు ప్రజలు నివసిస్తున్నారు. అక్కడ రాజకీయాల్లోనూ కీరోల్ పోషిస్తున్నారు.
Read Also: ఒక్కో రంగు గులాబీ వెనుక ఒక్కో అర్థం, వాలంటైన్స్ డే వీక్ లో ఏ గులాబీ ఎవరికి ఇవ్వాలంటే?
ఇక ఇండియాలో తెలుగు మాట్లాడే వారు 8 కోట్ల 11 లక్షల 27 వేల 740 మంది ఉన్నట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లోనూ తెలుగు ప్రజలు నివసిస్తున్నారు.
Read Also: సర్జరీ టైమ్‌లో డాక్టర్లు ఆకుపచ్చ రంగు దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు!