BigTV English

OTT Movie : అమ్మాయిల్ని మాత్రమే టార్గెట్ చేసే సైకో… తలలు వేరు చేసి వీడు చేసే పనులు చూస్తే దిమాక్ ఖరాబ్

OTT Movie : అమ్మాయిల్ని మాత్రమే టార్గెట్ చేసే సైకో… తలలు వేరు చేసి వీడు చేసే పనులు చూస్తే దిమాక్ ఖరాబ్

OTT Movie : క్రైమ్ స్టోరీలు మొదటి నుంచి, చివరి దాకా సస్పెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. ప్రేక్షకులు ఈ ఈ సినిమాలను చివరి వరకు చూసిన తర్వాతే రిలాక్స్ అవుతారు. ఎందుకంటే ఈ సినిమాలలో ట్విస్టులు అలా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ ఒక సైకో కిల్లర్ చుట్టూ తిరుగుతుంది. ఆడవాళ్లను చంపి తలలు వేరు చేసే ఈ సైకో, ఎవరు అనేది క్లైమాక్స్ వరకు సస్పెన్స్ గానే ఉంటుంది. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ హాలీవుడ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘వాచర్‘ (Watcher). 2022లో విడుదలైన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీకి క్లోయ్ ఒకునో దర్శకత్వం వహించారు. ఈ మూవీలో మైకా మన్రో, కార్ల్ గ్లుస్మాన్, బర్న్ గోర్మాన్ నటించారు. జనవరి 21, 2022న జరిగిన సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో వాచర్ వరల్డ్ ప్రీమియర్‌ను ప్రదర్శించి, గ్రాండ్ జ్యూరీ ప్రైజ్‌కి నామినేట్ చేయబడింది. ఈ మూవీ జూన్ 3, 2022న యునైటెడ్ స్టేట్స్‌లో థియేట్రికల్‌గా విడుదలైంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

అమెరికాకు చెందిన జూలియా, రొమేనియాకి చెందిన ఫ్రాన్సిస్ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఫ్రాన్సిస్ ఉద్యోగం కోసం రొమేనియాకి వెళ్లాల్సి వస్తుంది. జూలియాని కూడా రొమేనియాకి తన వెంట తీసుకుని వెళ్తాడు. అక్కడే ఒక అపార్ట్మెంట్ తీసుకొని ఉంటారు. ఆ ప్రాంతంలో ఒక సైకో కిల్లర్ మహిళలను చంపి, తలలను వేరు చేస్తుంటాడు. అతనికి పోలీసులు స్పైడర్ అనే పేరు కూడా పెడతారు. ఆ సైకో కిల్లర్ని పట్టుకునే ప్రయత్నంలోనే ఉంటారు పోలీసులు. అక్కడ జూలియాని ఒక వ్యక్తి ఎప్పుడూ ఫాలో అవుతూ ఉంటాడు. జూలియా ఉంటున్న ఇంటికి ఎదురుగానే ఇతని ఫ్లాట్ కూడా ఉంటుంది. భర్తకు చెబితే ఈ విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటాడు. పైగా ఆమెపై జోకులు కూడా వేస్తుంటాడు. పోలీసులకు అతని మీద కంప్లైంట్ కూడా చేస్తుంది. అయితే ఆమె భయంతో అలా ఊహించుకుంటూ ఉందని, పోలీసులు కూడా తేలిగ్గా తీసుకుంటారు.

జూలియాకి పక్క ఫ్లాట్లో ఉండే ఎరీనా అనే మహిళ పరిచయం అవుతుంది. ఆ ఫ్లాట్ నుంచి అప్పుడప్పుడు, జూలియాకి సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. ఒకరోజు ఎక్కువగా సౌండ్ రావడంతో ఆ ఫ్లాట్లోకి వెళ్తుంది. అప్పటికే ఆ సైకో కిల్లర్ ఎరినాను చంపి తల వేరు చేస్తూ ఉంటాడు. ఆ సైకోని చూసి జూలియా షాక్ అవుతుంది. ఇదివరకు తనని ఫాలో చేస్తున్న వ్యక్తి, మహిళలను చంపుతున్న వ్యక్తి ఒకరిని తెలుసుకుంటుంది. ఆమెను కూడా సైకో కిల్లర్ చంపడానికి వస్తాడు. ఆమె గొంతును కూడా కొంచెం కోస్తాడు. ఆమె కింద పడిపోయి, ప్రాణాలతో పోరాడుతూ ఉంటుంది. అక్కడికి జూలియా భర్త వస్తాడు. అతన్ని కూడా సైకో చంపాలనుకుంటాడు. చివరికి సైకో చేతిలో జూలియా చనిపోతుందా? జూలియా భర్తని కూడా ఆ సైకో చంపుతాడా? వీళ్ళిద్దరూ ఆ సైకోని ఎదుర్కొంటారా? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీని చూడాల్సిందే.

Related News

OTT Movie : గ్యాంగ్ స్టర్ గా సిల్వెస్టర్ స్టాలోన్… అల్టిమేట్ యాక్షన్ సీన్స్… యాక్షన్ ప్రియులకు పంగడే

OTT Movie : సూపర్ హీరోల బిడ్డను బలికోరే బ్రహ్మ రాక్షసి… కడుపులో ఉండగానే బీభత్సం… క్లైమాక్స్ డోంట్ మిస్

Sundarakanda OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన నారా రోహిత్‌ ‘సుందరకాండ’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!

OTT Movie : పెంచిన పెదనాన్న ఇంటిని తగలబెట్టే లేడీ కిలాడీ… అమ్మాయి కాదు మావా ఆడపులి… పిచ్చెక్కించే ట్విస్టులు

OTT Movie : మరో వ్యక్తితో భర్త దగ్గర అడ్డంగా దొరికిపోయే భార్య… అతనిచ్చే ట్విస్టుకు దిమాక్ కరాబ్ మావా

OTT Movie : కంటికి కన్పించిన అమ్మాయిని వదలకుండా అదే పాడు పని… ఈ సైకో ఇంత కరువులో ఉన్నాడేంటి భయ్యా ?

OTT Movie : పెళ్ళైన ట్యూషన్ టీచర్ పై ప్రేమ… సీక్రెట్ లెటర్ తో బండారం బట్టబయలు… IMDbలో 7.5 రేటింగ్

OTT Movie : తవ్వకాల్లో బయటపడే శవపేటిక… దుష్ట శక్తి విడుదలవ్వడంతో దబిడి దిబిడి… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు డోంట్ వాచ్

Big Stories

×