BigTV English
Advertisement

Valentine’s Week 2025: ఒక్కో రంగు గులాబీ వెనుక ఒక్కో అర్థం, వాలంటైన్స్ డే వీక్ లో ఏ గులాబీ ఎవరికి ఇవ్వాలంటే?

Valentine’s Week 2025: ఒక్కో రంగు గులాబీ వెనుక ఒక్కో అర్థం, వాలంటైన్స్ డే వీక్ లో ఏ గులాబీ ఎవరికి ఇవ్వాలంటే?

Valentine’s Day 2025: రకరకాలా ప్లవర్స్ ఉన్నప్పటికీ, గులాబీకి ఉన్న ప్రత్యేకత వేరు. నచ్చిన వారికి గులాబీ ఇస్తే, ఎంతో హ్యాపీగా ఫీలవుతారు. వాలంటైన్స్ డే వచ్చిందంటే ప్రియురాలికి లేదంటే ప్రియుడికి గులాబీలు ఇచ్చి తమ ప్రేమను పంచుకుంటారు. చాలా మంది వాలంటైన్స్ వీక్ గా జరుపుకుంటారు. అంటే, ఫిబ్రవరి 14ను ముందు వారం రోజుల పాటు ఈ వేడుకను నిర్వహించుకుంటారు. అందులో ఒక రోజు అంటే ఫిబ్రవరి 7న రోజ్ డే నిర్వహించుకుంటారు. ఇష్టమైన వారికి నచ్చిన గులాబీ ఇచ్చి తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. అయితే, ఒక్కో రంగు గులాబీ పువ్వు ఒక్కో అర్థం ఉంటుంది. ఇంతకీ ఏ రంగు గులాబీ వెనుక ఏం అర్థం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..


గులాబీల రంగు, వాటి వెనుక అర్థాలు

⦿ ఎర్ర గులాబీ


రెడ్ రోజ్ ను ప్రేమకు గుర్తుగా భావిస్తారు. అందుకే, ప్రేమికులు ఈ గులాబీని ఇచ్చిపుచ్చుకుంటారు. ఒకవేళ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా మీరు ఎవరికైనా ప్రేమను వ్యక్త పరచాలి అనుకుంటే రెడ్ రోజ్ ఇచ్చి, ప్రపోజ్ చెయ్యండి.

⦿ తెల్ల గులాబీ

తెల్ల గులాబీలు ప్రేమ, గౌరవం, అమాయకత్వం, స్వచ్ఛతకు గుర్తుగా భావిస్తారు. తెల్ల గులాబీలను కూడా ప్రియమైన వ్యక్తులకు అందించుకోవచ్చు. వీటిని ఎక్కువగా పెళ్లి బొకేలు, అలంకరణ, కొత్త బిజినెస్ మొదలుపెట్టినప్పుడు కస్టమర్లను స్వాగతించడానికి తెలుగు గులాబీలను ఉపయోగిస్తారు.

⦿ పసుపు గులాబీ

పసుపు గులాబీ స్నేహం, ఆనందం, పాజిటివ్ వైబ్స్ ను సూచిస్తుంది. పసుపు గులాబీలను తరచుగా ఫ్రెండ్స్ కు ఇచ్చుకోవచ్చు. మీరు మీ ప్రాణ స్నేహితుడికి, వారు మీ మీద చూపించే శ్రద్ధకు గుర్తుగా ఇచ్చుకోవచ్చు. వీలుంటే ఎల్లో గులాబీ బొకే, లేదంటే ఒక గులాబీ ఇచ్చినా సరిపోతుంది.

⦿ నీలం గులాబీ

నీలం గులాబీ సున్నితత్వం, భావోద్వేగానికి గుర్తుగా ఉపయోగిస్తారు. ఇద్దరు వ్యక్తుల మధ్య భావోద్వేగాన్ని సున్నితంగా సూచించడంలో సాయపడుతుంది. జీవిత భాగస్వాములు సైతం తమ మధ్య ఉన్న భావోద్వేగాన్ని పంచుకునేందుకు ఈ గులాబీలను ఇచ్చుకోవచ్చు.

⦿ పీచ్ గులాబీ

పీచ్ అనేది స్త్రీలు ఎంతగానో ఇష్టపడే రంగు. ఇది వినయం, నిజాయితీ, సానుభూతికి గుర్తుగా భావిస్తారు. ఇద్దరు పార్ట్ నర్స్ మధ్య సంబంధం పట్ల వారి నిజాయితీని ప్రదర్శించడానికి పీచ్ గులాబీలను ఇస్తారు. మీరు మీ భాగస్వామితో నిజాయితీగా ఉన్నట్లు భావిస్తే ఈ గులాబీలను ఇచ్చుకోవచ్చు.

⦿ పింక్ గులాబీ    

పింక్ గులాబీ  చక్కదనం, సౌందర్యం,  స్త్రీ తత్వాన్ని సూచిస్తుంది. మీరు ఎదుటి వారిలో దయ, గాంభీర్యానికి ఇష్టపడినప్పుడు పింక్ గులాబీలను ఇవ్వచ్చు.

⦿ ఆరెంజ్ గులాబీ

ఆరెంజ్ గులాబీలు శక్తి, ఆనందానికి గుర్తుగా భావిస్తారు. రోజు వారీ జీవితంలో మీ కోసం పని చేసే వారికి ఆరెంజ్ గులాబీలను ఇవ్వవచ్చు.

నిజానికి ఫిబ్రవరి నెలను ప్రేమకు గుర్తుగా భావిస్తారు. మన జీవితంలో మరుపురాని జ్ఞాపకాలకు గుర్తుగా వాలంటైన్స్ డే ను జరుపుకుంటారు. మీరు కూడా మీకు నచ్చిన వ్యక్తులకు ప్రియమైన బహుమతులు ఇచ్చి మీ ప్రేమను వ్యక్తపరచుకోండి.

Read Also:  ఖర్జూరం మాత్రమే కాదు, వీటి విత్తనాలు తిన్నా కూడా అనేక ప్రయోజనాలు

Related News

Honey Health Benefits: ఆరోగ్యానికి తీపి చిట్కా.. ఒక చెంచా తేనెతో చలికాలం సమస్యలన్నీ దూరం!..

Lung Cancer: ఊపిరితిత్తుల క్యాన్సర్.. చాలా మంది నిర్లక్ష్యం చేసే లక్షణాలివే !

Lower Cholesterol: మందులు లేకుండా కొలెస్ట్రాల్ తగ్గించే.. సహజ మార్గాలు ఏంటో తెలుసా ?

Massage benefits: ఆయుర్వేదం చెప్పే 5 మసాజ్ రహస్యాలు.. డాక్టర్లు కూడా సూచించే థెరపీలు

Liver Disease: ఈ లక్షణాలు మీలో ఉన్నాయా ? అయితే లివర్ పాడైనట్లే !

Kidney Health: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఎలాంటి డ్రింక్స్ తాగాలి ?

Gas Geyser: ఇంట్లో గ్యాస్ గీజర్లు వాడుతున్నారా ? ఇవి తప్పక తెలుసుకోండి

Water Rich Foods: శరీరంలో నీటి శాతం పెంచే పండ్లు ఇవే !

Big Stories

×