Hibiscus Hair Gel: మగువలకు కురులే అందం .. పొడవైన జుట్టును ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదు. కానీ ప్రస్తుత రోజుల్లో పొడవాటి జుట్టు అతి కొద్ది మందిలో మాత్రమే కనిపిస్తుంది. ఇక జుట్టు సంరక్షణ కోసం నిత్యం ఎన్నో రకాల టిప్స్ ట్రై చేస్తుంటారు. బయట మార్కెట్లో హెయిర్ సీరమ్‌లు, ఆయిల్స్ ఉపయోగిస్తుంటారు. వీటివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. పైగా వాటివల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతుంటారు. కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా.. మన ఇంటి పెరట్లో దొరికే మందార పువ్వుతో హెయిర్ జెల్ తయారు చేసుకున్నారంటే మంచి రిజల్ట్ మీకు కనిపిస్తాయి. జుట్టు రాలడాన్ని ఆపేసి.. ఒత్తుగా, పొడవుగా పెరిగేలా సహాయపడతుంది. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్ధాలు
మందారం పువ్వులు
అలోవెరాజెల్
గ్లిసరిన్
బాదం నూనె
విటమిన్ ఇ క్యాప్సూల్స్
రోజ్‌మెరీ ఆయిల్
టీట్రీ ఆయిల్
తయారు చేసుకునే విధానం
ముందుగా మందారం పువ్వులను వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని అందులో మందారం పువ్వులు, గ్లాస్ వాటర్ పోసి ఐదు, పది నిమిషాల పాటు మరిగించాలి. స్టవ్ ఆఫ్ చేసి వేరే బౌల్ లోకి వడకట్టుకోవాలి. అందులో అలోవెరాజెల్, గ్లిసరిన్, బాదం నూనె, విటమిన్ ఇ క్యాప్సూల్స్, రోజ్ మెరీ ఆయిల్, టీట్రీ ఆయిల్ కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని గాజు సీసాలో స్టోర్ చేసుకోవచ్చు. ఈ హెయిర్ సీరమ్‌ను ప్రతిరోజు జుట్టుకు పెట్టుకోవచ్చు. లేదా రాత్రి పడుకునే ముందు అప్లై చేసి మరుసటి రోజు తలస్నానం చెయ్యండి మంచి ఫలితం ఉంటుంది. జుట్టుకు పోషణను అందించి పొడవుగా, ఒత్తుగా పెరిగేలా సహాయపడుతుంది. తెల్లజుట్టు సమస్యలను కూడా దూరం చేస్తాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
పొడవాటి జుట్టు కోసం ఈ హెయిర్ సీరమ్ ట్రై చేయండి జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరుగుతుంది.
కావాల్సిన పదార్ధాలు
మెంతులు
అల్లం
కలోంజీ సీడ్స్
కొబ్బరి నూనె
మందారం పువ్వులు
కరివేపాకు
తయారు చేసుకునే విధానం
ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని.. అందులో కొబ్బరి నూనె చిన్న అల్లం ముక్క, మెంతులు రెండు టేబుల్ స్పూన్, కలోంజీ సీడ్స్ రెండు టేబుల్ స్పూన్, కరివేపాకు వేసి బాగా 10 నిమిషాల పాటు మరిగించండి. ఇప్పుడు స్టవ్ కట్టేసి గాజు సీసాలోకి వడకట్టుకోండి. ఈ హెయిర్ ఆయిల్‌ను ప్రతిరోజు జుట్టుకు అప్లై చేసుకోవచ్చు. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. జుట్టు పొడవుగా, ఒత్తుగా, సిల్కీగా పెరుగుతుంది. చుండ్రు సమస్యలు తొలగిపోతాయి. ఇందులో ఉపయోగించే పదార్ధాల వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు.. జుట్టుకు తగిన పోషణను అందించడంలో సహాయపడతాయి.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.