UP Crime News: కొన్ని గంటల్లో వివాహం.. ఊరేగింపుగా వెళ్తున్న వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. కారణం ఏంటనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. కాకపోతే ఆత్మహత్యకు ముందు పెళ్లికొడుకు 20 సార్లు ఫోన్ లో మాట్లాడినట్టు తెలుస్తోంది.
అసలేం జరిగింది?
ఉత్తరప్రదేశ్‌లోని అమేథి జిల్లాలో ఊహించని ఘటన జరిగింది. వివాహ వేడుక కాస్త విషాదంగా మారింది. వరుడు ఊరేగింపు నుండి బయటకు వెళ్లి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. గౌరీ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బని సమీపంలో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. మృతుడు సొంతూరు రాయ్‌బరేలికి చెందిన 30 ఏళ్ల రవి యాదవ్‌గా గుర్తించారు.
రాయ్‌బరేలీ జిల్లా సలోన్‌కు చెందిన 30 ఏళ్ల రవికి శుక్రవారం రాత్రి పెళ్లి జరగనుంది. వివాహం అజంగఢ్‌లో జరగనుంది. అందుకు ఘనంగా ఏర్పాటు చేశారు ఇరు కుటుంబాల పెద్దలు. తన కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఊరేగింపుగా శుక్రవారం ఉదయం ఊరేగింపుతో ఆ ప్రాంతానికి బయలుదేరాడు. మార్గ మధ్యలో బని రైల్వే స్టేషన్ సమీపంలో వరుడు రవి కారులో నుంచి బట్టలు మార్చుకుంటానని వెళ్లాడు.
కుటుంబసభ్యుల్లో టెన్షన్
ఎంత సేపటికి కనిపించలేదు. ఈలోపు రవి కుటుంబసభ్యుల్లో ఒక్కటే ఆందోళన. అదే సమయంలో ఆ రూట్లో గూడ్స్ రైలు వస్తుంది. రవిని దాని కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏం జరిగింది అనేది మాత్రం ఇప్పటికీ సస్పెన్షన్‌గా మారింది. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు స్పాట్‌కి చేరుకున్నారు.
ALSO READ: మేనేజర్‌ని హత్య చేసిన ఉద్యోగి, సెలవు కోసం గొడవ
ఘటన ప్రాంతం నుంచి వరుడు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాడు రైల్వే పోలీసులు. రవి ఆత్మహత్య వెనుక అసలేం జరిగింది? అనేది సస్పెన్షన్‌గా మారింది. పెళ్లి ఇష్టం లేక రవి ఆత్మహత్య చేసుకున్నాడా? ఏమైనా కారణాలు ఉన్నాయా? అనేది అసలు విషయం.
మృతుడి ఫ్యామిలీ వెర్షన్
మృతుడి అన్నయ్య వెర్షన్ మరోలా ఉంది. తాము అజంగఢ్ కు చెందినవారమని, కొన్నేళ్లుగా రాయ్ బరేలిలో సలోన్ ప్రాంతంలో ఉన్నట్లు చెప్పాడు. ప్రేమ వ్యవహారం లేదని, ఐదు నెలల కిందట ఓ అమ్మాయితో వివాహం ఓకే అయ్యిందని, తాము ఎంతో సంతోషంగా ఉన్నామని చెబుతున్నాడు.
వివాహ ఊరేగింపు మధ్యాహ్నం 3.30 గంటలకు సలోన్ నుండి ప్రారంభమైనప్పుడు సంతోషంగా కనిపించాడని తెలిపాడు. గౌరీగంజ్ వంతెన దగ్గర ట్రాఫిక్‌తో వెళ్తున్న కారు వేగం తగ్గిందన్నాడు. రవి కారు దిగి నెమ్మదిగా కదులుతున్న రైలు ఎక్కాడని డ్రైవర్ చెబుతున్నట్లు తెలిపాడు. సాయంత్రం దాదాపు ఐదు గంటల సమయంలో మాకు సమాచారం వచ్చిందన్నారు.
సాయంత్రం ఆరు గంటల సమయంలో రవి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్టు ఉంది. అందుకుముందు కనీసం 20 సార్లు ఫోన్‌లో మాట్లాడినట్టు చెబుతున్నారు. మొత్తానికి రవి ఆత్మహత్య వ్యవహారం ఇరు ఫ్యామిలీలకు విషాదమనే చెప్పవచ్చు. మరి పోలీసుల విచారణలో ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయో చూడాలి.