BigTV English

Hero Dhanush: ధనుష్ మూవీ సెట్ లో భారీ అగ్ని ప్రమాదం.. భారీ నష్టం కూడా..!

Hero Dhanush: ధనుష్ మూవీ సెట్ లో భారీ అగ్ని ప్రమాదం.. భారీ నష్టం కూడా..!

Hero Dhanush:కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanusha) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెలిసిందే. ఒకవైపు సినిమాలకు దర్శకత్వం వహిస్తూనే.. మరొకవైపు ఆ సినిమాలలో నటిస్తూ మరింత బిజీగా మారిపోయారు. ఇలాంటి సమయంలో ఆయన ఒక సినిమా షూటింగ్లో బిజీగా ఉండగా.. ఆ షూటింగ్ సెట్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. ప్రస్తుతం ‘ఇడ్లీ కడై’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా సెట్ లోనే భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.ఈ సినిమా కోసం వేసిన సెట్ లో ప్రమాదవశాత్తు పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో సెట్ లో ఉన్న కీలక సామాగ్రి కాలిపోయినట్టు సమాచారం. తేని జిల్లాలోని అండిపట్టి లో ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇక ప్రస్తుతం ఈ విషయం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.


ఇడ్లీ కడై మూవీ విశేషాలు..

ధనుష్ ఇడ్లీ కడై మూవీ విషయానికి వస్తే.. డాన్ పిక్చర్స్ తో కలిసి వండర్ బార్ ఫిలిమ్స్ ఆధ్వర్యంలో ధనుష్ రచన, దర్శకత్వంతో పాటు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తమిళ్ భాషా డ్రామా చిత్రంగా వస్తున్న ఈ సినిమాలో ధనుష్ సరసన నిత్యామీనన్ (NithyaMenon) మరొకసారి జతకడుతోంది. ఇక ఈ చిత్రంలో అరుణ్ విజయ్, షాలిని పాండే, ప్రకాష్ రాజ్, సముద్రఖని, పార్థిబన్, సత్యరాజ్, రాజకిరణ్ తదితరులు నటిస్తున్నారు. రెడ్ జెయింట్ ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఇక అక్టోబర్ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదట ఏప్రిల్ 10వ తేదీన సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ అనూహ్యంగా నిర్మాణం పూర్తి కాకపోవడంతో సినిమా వాయిదా వేశారు. ఇప్పుడు అక్టోబర్ నెలలో విడుదల చేయడానికి సన్నహాలు సిద్ధం చేసుకుంటూ ఉండగా.. సడన్గా ఇలా సెట్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రానికి జీ.వి. ప్రకాష్ కుమార్ (GV.Prakash kumar) సంగీతాన్ని అందిస్తున్నారు.


ధనుష్ సినిమాలు..

ఒక ధనుష్ విషయానికి వస్తే.. కోలీవుడ్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ధనుష్.. ఒకవైపు సినిమాలను నిర్మిస్తూ మరొకవైపు దర్శకత్వం వహిస్తూ అలాగే నటుడిగా కూడా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ఈ మధ్యకాలంలో తెలుగు, తమిళ్ , హిందీ భాషలలో నటిస్తూ భారీ పాపులారిటీ దక్కించుకున్న ధనుష్.. మరొకవైపు తన సినిమాలతో భారీ కలెక్షన్స్ వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా కంటెంట్ ఓరియెంటెడ్ కథలతో ఆడియన్స్ ముందుకు వస్తున్న ఈయన.. తన సినిమాలతోనే భారీ సక్సెస్ సొంతం చేసుకుంటున్నారని చెప్పవచ్చు. ఇక ధనుష్ అన్నయ్య సెల్వ రాఘవన్ కూడా ఇండస్ట్రీలో నటుడిగా ,దర్శకుడిగా చలామణి అవుతున్న విషయం తెలిసిందే. అటు ఈయన తండ్రి కూడా ఇండస్ట్రీకి చెందినవారు కావడం గమనార్హం.

Trisha: పెళ్లి పై హాట్ బాంబు పేల్చిన త్రిష.. నిరాశలో ఫ్యాన్స్..!

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×