BigTV English

Hibiscus Hair Mask: మందార పువ్వుతో ఈ హెయిర్ సీరమ్ ట్రై చేసారంటే.. ఊడిన జుట్టు మళ్లీ వస్తుంది..

Hibiscus Hair Mask: మందార పువ్వుతో ఈ హెయిర్ సీరమ్ ట్రై చేసారంటే.. ఊడిన జుట్టు మళ్లీ వస్తుంది..

Hibiscus Hair Mask: జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. కానీ ప్రస్తుత రోజుల్లో ప్రధానంగా ఎదుర్కుంటున్న సమస్య జుట్టు రాలిపోవడడం, చుండ్రు రావడం. వీటన్నింటికి కారణం జీవన శైలిలో మార్పులు. సరైన పోషకాహారం తినకపోవడం. ధుమ్మూ, ధూళి ఇతర కారణాలు కావచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ ఉరుకులు, పరుగుల జీవితంలో ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ప్రతిరోజు ఉదయం వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు.. జుట్టు సంరక్షణకు చాలా మంచిది.


జుట్టు ఒత్తుగా, సాఫ్ట్‌గా, హెల్దీగా పెరగాలంటే.. మనం బయట ఎన్నో రకాల ప్రొడక్ట్స్ కోసం ఎంత గానో ఖర్చు చేస్తాం.. కానీ ఎలాంటి ఖర్చు లేకుండా మన ఇంటి ఆవరణంలో దొరికే మందారం చెట్టు నుండి వచ్చే ఆకులు, పువ్వుల ద్వారా మన కేశాలు ఊడిపోకుండా కుదుళ్లు గట్టిగా ఉండేలా చేయొచ్చు. మందారంలో అమైనో ఆమ్లాలు, విటమిన్ సి, ప్లేవనాయిడ్స్, యంటీ ఆక్సీడెంట్లు, జుట్టుకు పోషణను అందిస్తాయి. జుట్టు సిల్కీగా ఉండేలా చేస్తుంది. ఇవి జుట్టు రాలడాన్ని ఆపడంతో పాటు, బట్టతలను నివారించడంలో సహాయపడుతుంది. మందార ఆకులు, పువ్వులతో ఆయిల్.. ఎలా ప్రిపెర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

మందార పువ్వులతో హెయిర్ సీరమ్..


కావాల్సిన పదార్ధాలు..
మందార పువ్వులు
కొబ్బరి నూనె
కరివేపాకు
మూడు టేబుల్ స్పూన్ మెంతులు
వెల్లుల్లిపాయలు
పెద్ద ఉల్లిపాయ
కలబంద

Also Read: పెద్దగా గురక వస్తోందా? తేలిగ్గా తీసుకోకండి, అది ఆ ప్రాణాంతక సమస్య వల్ల కావచ్చు

తయారు చేసుకునే విధానం..

ముందుగా మందార పువ్వులను శుభ్రంగా కడిగి పక్కన పెట్టాలి. ఉల్లిపాయ, వెల్లుల్లి పాయలు, కరివేపాకు, కలబంద, మెంతులు ఇవన్ని కొబ్బరి నూనెలో కలిపి స్టవ్ మీద ఈ మిశ్రమాన్ని బాగా మరిగించాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లారనిచ్చి వడకట్టుకోవాలి. ఇంతే.. మందార పువ్వులతో హెయిర్ సీరమ్ రెడీ అయినట్లే.. ఈ అయిల్‌ను ప్రతిరోజు తలకు అప్లై చేయొచ్చు.. దీని వల్ల పట్టులాంటి కురులు మీ సొంతం అవుతుంది. జుట్టు సిల్కీగా మారుతుంది. జుట్టు రాలడాన్ని ఆపేసి.. ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. ఈ హెయిర్ సీరమ్‌లో వాడే పదార్ధాలన్ని జుట్టు సంరక్షణకు చాలా మంచిది. జుట్టుకు కావాల్సిన పోషకాలను అందిస్తాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓసారి ట్రై చేయండి.

మందారం, ఉసిరి హెయిర్ మాస్క్

నాలుగు, ఐదు మందార పువ్వులను మెత్తగా పేస్ట్ లాగా చేసి.. అదే పరిమాణంలో ఉసిరి పొడిని కలిపి బాగా మిక్స్ చేయండి.. ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చెయ్యండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. చుండ్రు సమస్యలు తొలగిపోతాయి.

కుంకుడుకాయలు, మందారం ఆకులు

కుంకుడుకాయలు జుట్టు పెరుగుదలకు, చుండ్రు సమస్యలు తొలగించేందుకు అద్బుతంగా పనిచేస్తుంది. తలస్నానం చేసేటప్పుడు షాంపులతో కాకుండా.. కుంకుడుకాయలలో మందారం ఆకులు కలిపి తలస్నానం చేస్తే అద్బుతమైన రిజల్ట్ మీకు కనిపిస్తుంది. మీ కురులు సిల్కీగా తయారవుతుంది. దీంతో పాటు జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

Related News

Non-vegetarian food: ముక్క లేనిదే ముద్ద దిగడం లేదా ? అయితే జాగ్రత్త !

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Big Stories

×