Acne Problem: మొటిమలు అనేది ఒక సాధారణ చర్మ సమస్య. ఇవి హార్మోన్ల మార్పులు, తప్పుడు ఆహారపు అలవాట్లు, ఒత్తిడి లేదా తప్పుడు చర్మ సంరక్షణ అలవాట్ల వల్ల కౌమారదశలో ఎక్కువగా వస్తుంటాయి.మొటిమలు ప్రధానంగా ముఖంపై ఏర్పడతాయి. ఇలాంటి సమయంలో కొన్ని సార్లు మచ్చలు కూడా ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయి.
కొన్ని రకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తే అది మొటిమలకు కారణమవుతుంది. ఒక్కోసారి జన్యుపరమైన కారణాల వల్ల కూడా మొటిమలు రావచ్చు. అంటే కుటుంబం ఎవరికైనా ఉంటే కూడా మీకు ఈ సమస్య రావచ్చు. మొటిమల సమస్య తాత్కాలికమైనది. సరైన స్కిన్ కేర్ పాటిస్తే మొటిమల సమస్యను తగ్గించుకోవచ్చు. అంతే కాకుండా ముఖాన్ని కూడా మెరిసేలా చేయవచ్చు.
మొటిమలను ఎలా తొలగించాలి ?
అలోవెరా జెల్:
మీ ముఖంపై తరచుగా మొటిమలు కనిపిస్తుంటే, మొటిమలపై తాజా అలోవెరా జెల్‌ను అప్లై చేసి 20-30 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది చర్మాన్ని ఉపశమనం చేస్తుంది. అంతే కాకుండా మొటిమలను కూడా తగ్గిస్తుంది.
వేప ఆకులు:
మీ ఇంటి దగ్గర వేప చెట్టు ఉంటే వేప ఆకులను మెత్తగా చేసి పేస్ట్ లా చేసి మొటిమల మీద రాయండి. వేపలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది బ్యాక్టీరియాను తొలగిస్తుంది. ఫలితంగా మొటిమలు తగ్గే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.
తేనె, దాల్చిన చెక్క పేస్ట్ :
1/2 టీస్పూన్ దాల్చిన చెక్క పొడికి 1 టీస్పూన్ తేనె మిక్స్ చేసి మొటిమల మీద అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. దాల్చిన చెక్క, తేనె చర్మాన్ని శుభ్రపరుస్తాయి. అంే కాకుండా ఇవి మొటిమలను త్వరగా తగ్గిస్తాయి.
పసుపు, చందనం పేస్ట్:
పసుపులో క్రిమినాశక గుణాలు ఉన్నాయి. చందనం చర్మానికి చల్లదనాన్ని ఇస్తుంది. రోజ్ వాటర్‌లో పసుపు , గంధపు పొడిని కలిపి పేస్ట్‌ను తయారు చేసి ముఖానికి అప్లై చేయండి. దీని నుండి మీరు ఖచ్చితంగా ప్రయోజనం పొందుతారు.
కొబ్బరి నూనె:
కొబ్బరి నూనెలో 1-2 చుక్కల టీ ట్రీ ఆయిల్ మిక్స్ చేసి మొటిమలపై అప్లై చేయాలి. ఇది ముఖంపై ఉండే బ్యాక్టీరియాను నాశనం చేయడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ఇది మొటిమలను తగ్గిస్తుంది. టీ ట్రీ ఆయిల్‌ను నేరుగా ముఖంపై అప్లై చేయకూడదు. ఇలా చేస్తే.. ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది.
Also Read: మీగడ ఇలా వాడితే.. అమ్మాయిలే అసూయపడే అందం
నిమ్మరసం:
తాజా నిమ్మరసాన్ని కాటన్ సహాయంతో మొటిమల మీద రాయండి. 10 నిమిషాల తర్వాత కడగాలి. ఇందులో ఉండే సిట్రిక్ యాసిడ్ చర్మాన్ని శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా ఇది బ్యాక్టీరియాను తొలగిస్తుంది. ఈ రెమెడీలను క్రమం తప్పకుండా పాటించడం ద్వారా.. మొటిమలు తగ్గుతాయి. అంతే కాకుండా చర్మం శుభ్రంగా, ఆరోగ్యంగా మారుతుంది. తరుచుగా వీటిని వాడటం వల్ల ముఖంపై మొటిమలు తగ్గుతాయి. అంతే కాకుండా గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.