BigTV English
Advertisement

Bald Head: బట్టతలపై కూడా జుట్టు పెరగాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి !

Bald Head: బట్టతలపై కూడా జుట్టు పెరగాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి !

Bald Head: ఈ రోజుల్లో బట్టతల అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. బిజీ లైఫ్ స్టైల్‌‌తో పాటు, ఒత్తిడి, పోషకాహార లోపం, కాలుష్యం దీనికి ప్రధాన కారణాలు. కానీ మంచి విషయం ఏమిటంటే కొన్ని సులభమైన, హోం రెమెడీస్ పాటించడం ద్వారా రాలిపోయిన జుట్టును తిరిగి పొందవచ్చు. మీరు క్రమం తప్పకుండా హోం రెమెడీస్ పాటిస్తే, మీ జుట్టు ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా.. కొత్త జుట్టు కూడా పెరగడం ప్రారంభమవుతుంది. బట్టతలతో ఇబ్బంది పడే వారు ఎలాంటి హోం రెమెడీస్ పాటిస్తే.. తిరిగి జుట్టు పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.


వీటితో.. బట్టతలకు చెక్ ..

ఆవాలు, కొబ్బరి నూనెతో మసాజ్ :
వారానికి రెండుసార్లు మీ తలకు ఆవాల నూనెతో మసాజ్ చేసుకోండి. ముఖ్యంగా ఆవాలు , కొబ్బరి నూనె మిశ్రమం జుట్టు మూలాలను బలోపేతం చేస్తుంది. అంతే కాకుండా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది కొత్త జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ఈ ఆయిల్ ను 10-15 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి కొన్ని గంటల తర్వాత కడిగేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.


ఉల్లిపాయ జ్యూస్:
ఉల్లిపాయ రసాన్ని పురాతన కాలం నుండి జుట్టు పెరుగుదలకు ఉపయోగిస్తున్నారు. ఇందులో సల్ఫర్ కూడా ఉంటుంది. ఇది తలలో కొల్లాజెన్ ఏర్పడటాన్ని పెంచుతుంది. అంతే కాకుండా కొత్త జుట్టు పెరగడానికి కారణమవుతుంది. మీరు దీనిని వారానికి 1-2 సార్లు తలకు అప్లై చేసి 30 నిమిషాల తర్వాత కడిగేయవచ్చు.

ఉసిరి, బ్రాహ్మి :
ఉసిరి జుట్టుకు అమృతం లాంటిది. మీరు దీనిని మీ ఆహారంలో కూడా భాగంగా చేర్చుకోవచ్చు లేదా మీ జుట్టుకు కూడా ఉసిరి పొడిని అప్లై చేయవచ్చు. బ్రాహ్మి తలపై చర్మాన్ని చల్లబరుస్తుంది. అంతే కాకుండా జుట్టు మూలాలను బలపరుస్తుంది. బట్టతల సమస్యతో ఇబ్బంది పడే వారు ఉసిరి పొడిని పెరుగులో కలిపి వారానికి ఒకసారి హెయిర్ మాస్క్ లాగా కూడా వేసుకోవచ్చు.

ఒత్తిడిని నియంత్రించండి:
ఒత్తిడి మీ జుట్టుకు అతిపెద్ద శత్రువు. యోగా, ధ్యానం లేదా ప్రతిరోజూ వాకింగ్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. అంతే కాకుండా ఇది హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడానికి , జుట్టు రాలడాన్ని ఆపడానికి సహాయపడుతుంది. మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు.. శరీరం కూడా బాగా పనిచేస్తుంది.

సమతుల్య, పోషకాహారం:
మొక్కకు పోషణ అవసరమైనట్లే.. జుట్టుకు కూడా పోషణ అవసరం అవుతుంది. మీ ఆహారంలో ప్రోటీన్, ఐరన్, విటమిన్ బి12 , ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉండేలా చూసుకోండి. ఆకుపచ్చ కూరగాయలు, డ్రై ఫ్రూట్స్, పప్పుధాన్యాలు, గుడ్లు జుట్టు పెరుగుదలకు చాలా బాగా ఉపయోగపడతాయి.

Also Read: పెరుగుతో గ్లోయింగ్ స్కిన్.. ఇలా వాడితే ఖరీదైన ఫేస్ క్రీములు అవసరమే లేదు !

రసాయన ఉత్పత్తులు:
షాంపూ, హెయిర్ కలర్ లేదా స్టైలింగ్ ఉత్పత్తులలో ఉండే రసాయనాలు జుట్టును దెబ్బతీస్తాయి. అందుకే కెమికల్స్ లేని షాంపూని ఉపయోగించడానికి ప్రయత్నించండి. ఇది జుట్టు మూలాలను రక్షిస్తుంది. అంతే కాకుండా జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది.

తగినంత నిద్ర, నీరు తీసుకోవడం:
నిద్ర , నీరు – ఈ రెండింటినీ చాలా మంది పట్టించుకోరు. కానీ అవి చాలా ముఖ్యమైనవి. రోజుకు కనీసం 7-8 గంటలు నిద్రపోవడం , 2-3 లీటర్ల నీరు తాగడం వల్ల శరీరం నుండి వ్యర్థ పదార్థాలు బయటకు పంపి.. జుట్టు మూలాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.

Related News

Winter Skincare: చలికాలంలో చర్మాన్ని.. కాపాడుకోండిలా !

Diabetes And Stroke: రక్తంలో చక్కెర పెరుగుదల.. మెదడును ఎలా ప్రభావితం చేస్తుంది?

Banana: రోజూ 2 అరటిపండ్లు తింటే.. ఎన్ని ప్రయోజనాలుంటాయో తెలుసా ?

Kitchen tips: వంట చేస్తున్నప్పుడు కళాయి మూతపై నీరు ఎందుకు పోయాలి?

Chicken Korma: అన్నం, చపాతీల్లోకి అదిరిపోయే చికెన్ కుర్మా, రెసిపీ ఇదిగో

Farmer’s Honor: పండ్లు, కూరగాయల మీద పండించిన రైతుల ఫోటో.. ఎంత మంచి నిర్ణయమో!

Tulsi Leaves: ప్రతిరోజు ఉదయం తులసి ఆకులను నమిలితే.. ఏమవుతుంది ?

Let them go: వెళ్లేవాళ్లని వెళ్లనివ్వండి బాసూ.. లేదంటే మనసును బాధపెట్టినవాళ్లవుతారు!

Big Stories

×