BigTV English

Curd For Face: పెరుగుతో గ్లోయింగ్ స్కిన్.. ఇలా వాడితే ఖరీదైన ఫేస్ క్రీములు అవసరమే లేదు !

Curd For Face: పెరుగుతో గ్లోయింగ్ స్కిన్.. ఇలా వాడితే ఖరీదైన ఫేస్ క్రీములు అవసరమే లేదు !

Curd For Face: వేసవిలో ఎండ, చెమట, దుమ్ము కలిసి మన చర్మాన్ని నిస్తేజంగా, నల్లగా మారుస్తాయి. ఈ సీజన్‌లో ముఖంపై మెరుపును కాపాడుకోవడం కొంచెం కష్టమే. కానీ అది అసాధ్యం కాదు. మీరు పెరుగును సరైన పద్ధతిలో ఉపయోగిస్తే మీ ముఖం చల్లగా ఉండటమే కాకుండా లోపలి నుండి కూడా మెరుస్తుంది.


పెరుగు సహజ బ్లీచింగ్ అంతే కాకుండా యాంటీ-టానింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది చర్మాన్ని తేలికగా, శుభ్రంగా , మృదువుగా చేస్తుంది. దీనిని కొన్ని ప్రత్యేకమైన పదార్థాలతో కలిపి ముఖానికి అప్లై చేస్తే.. దాని ప్రభావం రెట్టింపు అవుతుంది. ముఖానికి ఎలాంటి పదార్థాలను అప్లై చేస్తే.. గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

పెరుగు, పసుపు:
ఒక చెంచా పెరుగులో చిటికెడు పసుపు కలిపి ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత సాధారణ నీటితో వాష్ చేయాలి. ఈ మిశ్రమం ముఖంపై ఉన్న నల్లటి మచ్చలు , పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది.


పెరుగు, శనగపిండి:
ఒక చెంచా పెరుగును రెండు చెంచాల శనగపిండితో కలిపి పేస్ట్ లా చేయండి. దీన్ని ముఖానికి అప్లై చేసి మెల్లగా ఆరిన తర్వాత కడిగేయాలి. ఈ ప్యాక్ చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా ముఖ రంధ్రాలను బిగుతుగా చేస్తుంది.

పెరుగు, తేనె:
ఒక టీస్పూన్ పెరుగులో అర టీస్పూన్ తేనె కలిపి ముఖానికి 10-15 నిమిషాలు అప్లై చేయాలి. ఇది చర్మాన్ని తేమగా చేస్తుంది. అంతే కాకుండా చర్మాన్ని లోపలి నుండి మెరుస్తుంది. ఈ ప్యాక్ ముఖ్యంగా డ్రై స్కిన్, సున్నితమైన చర్మం ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది.

పెరుగు , ఓట్స్:
1 టీ స్పూన్ ఓట్స్‌ను మెత్తగా రుబ్బుకుని.. దానికి కాస్త పెరుగు కలపండి. ఈ మిశ్రమంతో మీ ముఖాన్ని సున్నితంగా మసాజ్ చేయండి. ఇది సహజమైన ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది. అంతే కాకుండా మృత కణాలను తొలగించడం ద్వారా చర్మాన్ని మృదువుగా చేస్తుంది.

పెరుగు, దోసకాయ:
కాస్త దోసకాయ జ్యూస్ తీసుకుని .. అందులో పెరుగు కలిపి ముఖానికి అప్లై చేయాలి. ఈ ప్యాక్ వేడి చికాకు , దద్దుర్లు నుండి ఉపశమనం కలిగిస్తుంది. అంతే కాకుండా చర్మాన్ని చల్లబరుస్తుంది. ఇది వడదెబ్బ విషయంలో కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుంది.

పెరుగు, నిమ్మకాయ:
ఒక టీస్పూన్ పెరుగులో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి 10 నిమిషాలు అప్లై చేయాలి. ఈ మిశ్రమం చర్మంపై ఉన్న టానింగ్ ను తొలగించడంలో సహాయపడుతుంది. వారానికి రెండుసార్లు దీనిని ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

Also Read: జుట్టు రాలుతోందా ? అయితే.. ఈ టిప్స్ మీకోసమే

పెరుగు, పుదీనా:
కాస్త పుదీనా ఆకులను తీసుకుని గ్రైండ్ చేసి, దానికి కాస్త పెరుగు కలిపి ముఖానికి అప్లై చేయాలి. పుదీనా చర్మాన్ని చల్లబరుస్తుంది. అంతే కాకుండా పెరుగు మొటిమలను తగ్గిస్తుంది. వేసవిలో చర్మంపై మొటిమలు ఉన్నవారికి ఈ ప్యాక్ చాలా బాగా ఉపయోగపడుతుంది.

పెరుగు, ముల్తానీ మిట్టి:
ముల్తానీ మట్టిని పెరుగుతో కలిపి మందపాటి పేస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేయండి. ఇది చర్మానికి మ్యాట్ ఫినిషింగ్ ఇస్తుంది. వేసవిలో చర్మం జిగటగా మారే వారికి ఇది ప్రత్యేకంగా సరిపోతుంది.

Related News

Bad Breakfasts: బ్రేక్ ఫాస్ట్‌లో ఇలాంటివి తిన్నారంటే గుండె పోటు ప్రమాదం పెరిగిపోతుంది అంటున్న డాక్టర్లు

Silky Hair tips: జుట్టుకు షాంపూ పెట్టాక ఈ ఒక్క వస్తువుతో మీ వెంట్రుకలను శుభ్రం చేసుకోండి చాలు, సిల్కీగా మారిపోతాయి

Sweet Corn Kebab: వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుందా? స్వీట్ కార్న్‌తో కబాబ్ చేయండి అదిరిపోతుంది

Millets: మిల్లెట్స్ తింటున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి

Home remedies: రాత్రి దిండు కింద పెట్టే సింపుల్ హోమ్ రెమిడీ.. ఇలా చేస్తే..

Onion juice: జుట్టుకు ఉల్లిపాయ రసం రాస్తున్నారా? వీటిని కలిపితే..

Big Stories

×