Blackheads: మురికి , డెడ్ స్కిన్ వల్ల చాలా మందిలో బ్లాక్ హెడ్స్ ఏర్పడతాయి. బ్లాక్‌హెడ్స్ మీ చర్మ సౌందర్యాన్ని తగ్గిస్తాయి. వీటిని తొలగించడానికి ఖరీదైన చికిత్సలు, ఉత్పత్తులు అవసరమవుతాయి. కానీ మీరు సహజ పరిష్కారాల కోసం చూస్తున్నట్లయితే.. మీకు హోం రెమెడీస్ చాలా బాగా పనిచేస్తాయి. బ్లాక్ హెడ్స్ తొలగించే రెండు ఎఫెక్టివ్ హోం రెమెడీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బేకింగ్ సోడా, వాటర్ స్క్రబ్:
ముందుగా ఒక చెంచా బేకింగ్ సోడా తీసుకోండి.
దానికి కొద్దిగా నీళ్లు పోసి చిక్కటి పేస్ట్‌ను సిద్ధం చేయండి.
ఈ పేస్ట్‌ను ముక్కుపై సున్నితంగా అప్లై చేసి వృత్తాకారంలో మసాజ్ చేయండి.
3-5 నిమిషాల పాటు మసాజ్ చేసిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.
నిమ్మ, తేనె:
సగం నిమ్మకాయ రసాన్ని తీయండి.
అందులో ఒక చెంచా తేనె కలపండి.
ఈ మిశ్రమాన్ని ముక్కుకు పట్టించి 10-15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి.
తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.
బ్లాక్ హెడ్స్ తగ్గించే ఇతర చిట్కాలు:
ప్రతిరోజు మీ ముఖాన్ని 2 సార్లు కడగండి.
డెడ్ స్కిన్‌ను తొలగించడానికి వారానికి ఒకసారి స్క్రబ్బింగ్ చేయండి.
ఆయిల్ ఫుడ్ , జంక్ ఫుడ్ మానుకోండి.
పుష్కలంగా నీరు త్రాగండి. సమతుల్య ఆహారం కూడా తీసుకోండి.