Best Crime Thriller Movies on OTT : సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అంటే మొదటగా మలయాళం సినిమాలే గుర్తుకొస్తున్నాయి. ఈమధ్య ఈ సినిమాల ట్రెండ్ బాగా నడుస్తోంది. ఈ కంటెంట్ తో వచ్చిన దృశ్యం మూవీ మలయాళం ఇండస్ట్రీ సినిమా రికార్డులను తిరగరాసింది. ఆ తర్వాత చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాలను తెర కెక్కిస్తున్నారు మేకర్స్. ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మలయాళం మూవీస్ ఏ ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకుందాం పదండి.
కిష్కింధ కాందం (Kishkindha Kaandam)
2024లో విడుదలైన ఈ మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి దింజిత్ అయ్యతన్ దర్శకత్వం వహించగా, సంగీతం ముజీబ్ మజీద్ అందించారు. ఈ మూవీలో ఆసిఫ్ అలీ, విజయరాఘవన్, అపర్ణ బాలమురళి నటించారు. రిజర్వ్ ఫారెస్ట్‌లో మాజీ మిలిటరీ అధికారి అప్పు పిళ్లై, అతని కుమారుడు అటవీ అధికారి అయిన అజయ్ చంద్రన్ నివసిస్తారు. మనవడు కనబడకుండా పోవడంతో మూవీ స్టోరీ రన్ అవుతుంది. 12 సెప్టెంబర్ 2024న విడుదలైన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుని, బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని సాధించింది. ప్రముఖ పాత్రలో నటించిన ఆసిఫ్ అలీ కెరీర్‌లో, అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీ కూడా ఇదే. ఈ మూవీ 2024లో అత్యధిక వసూళ్లు చేసిన మలయాళ మూవీగా రికార్డ్ తిరగరాసింది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
ముంబై పోలీస్ (Mumbai Police)
2013లో విడుదలైన ముంబై పోలీస్ మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీకి రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించారు. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్, జయసూర్య, రెహమాన్ ప్రధాన పాత్రల్లో నటించారు, వీరితో పాటు కుంజన్, అపర్ణ నాయర్, దీపా విజయన్ మరియు నూతన నటి హిమా డేవిస్ సహాయక పాత్రలు పోషించారు. శ్వేతా మీనన్, రియాజ్ ఖాన్ అతిథి పాత్రల్లో నటించారు. ₹5.75 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి మంచి వసూళ్లు సాధించింది. ఖలీజ్ టైమ్స్ ముంబై పోలీస్ మూవీని బాక్సాఫీస్ విజయాలలో ఒకటిగా గుర్తించింది. ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney + hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది.
దృశ్యం (Drushyam)
2013లో విడుదలైన ఈ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీకి జీతు జోసెఫ్ దర్శకత్వం వహించారు. ఇందులో మోహన్‌లాల్‌తో, మీనా, అన్సిబా హాసన్, ఎస్తేర్ అనిల్, ఆశా శరత్, సిద్ధిక్, కళాభవన్ షాజోన్, రోషన్ బషీర్, నీరజ్ మాధవ్ నటించారు. ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోని పెరుంబవూరు ఈ మూవీని నిర్మించారు. IG గీతా ప్రభాకర్ కుమారుడు వరుణ్ ప్రభాకర్ అదృశ్యమైనప్పుడు పోలీసులకు అనుమానం వచ్చి, జార్జ్‌కుట్టి, అతని కుటుంబాన్ని ఇబ్బందులు పెడతారు. ఆప్పుడు ఈ కుటుంభం జరిపే పోరాటాన్ని, ఈ మూవీలో చాలా బాగా చూపించారు. దృశ్యం 19 డిసెంబర్ 2013న విడుదలైంది. దృశ్యం 2 పేరుతో సీక్వెల్ 2021లో విడుదలైంది. విస్తృతమైన విమర్శకుల ప్రశంసలు ఈ మూవీ అందుకుంది. 50 కోట్లు వసూలు చేసిన తొలి మలయాళ చిత్రం కూడా ఇదే.ఈ మూవీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో 125 రోజుల పాటు అత్యధికంగా నడిచిన చిత్రంగా కూడా రికార్డ్ సృష్టించింది. ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney + hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది.
అంజామ్ పథిరా (Anjaam pathiraa)
2021 తెలుగులో మిడ్‌నైట్ మర్డర్స్ పేరుతో విడుదలైన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా మంచి విజేయాన్ని అందుకుంది. 2021 ఫిబ్రవరి 19న ఆహా (aha) ఓటీటీలో విడుదల చేశారు. ఈ మూవీలో కుంచకో బోబన్, శ్రీనాథ్ బసి, షరాఫ్ యుద్దీన్, ఉన్నిమయ ప్రసాద్, జీనూ జెసెఫ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
సీ యూ సూన్ (C u Soon)
సీ యూ సూన్ మలయాళంలో 2020లో విడుదల చేయడంతో పాటు, అదే పేరుతో తెలుగులోకి డబ్బింగ్ చేసి విడుదల చేశారు. ఫహాద్ ఫాజిల్, రోషన్ మ్యాథ్యూ, దర్శన రాజేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు, మహేష్ నారాయణన్ దర్శకత్వం వహించార. సెప్టెంబర్ 1, 2020 నుండి ఓటిటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.