Tips For Dandruff: చలికాలం వచ్చిందంటే చాలు చాలా మందిలో చుండ్రు సమస్య పెరుగుతుంది. పొడి స్కాల్ప్.. దురదతో పాటు చుండ్రును కలిగిస్తుంది. చుండ్రు రావడానికి చాలా కారణాలున్నాయి. కొంత మందికి అన్ని సీజన్లలో చుండ్రు ఉన్నప్పటికీ ఈ సీజన్‌లో ఎక్కువవుతుంది.చుండ్రు కారణంగా జుట్టు కూడా రాలుతుంది. ఈ సమస్య నుండి బయట పడేందుకు కొన్ని రకాల ప్రొడక్స్ట్ వాడుతుంటారు. అయితే పదే పదే యాంటీ డాండ్రఫ్ షాంపూ అప్లై చేసినా కూడా చుండ్రు తగ్గకపోతే ఈ సారి ఈ స్పెషల్ ఎఫెక్టివ్ ఆయిల్ అప్లై చేయండి. ఇది మీ జుట్టుపై చుండ్రు సమస్యను తొలగిస్తుంది. అంతే కాకుండా జుట్టు రాలకుండా నిరోధిస్తుంది.
చుండ్రు ఎందుకు వస్తుంది ?
చలికాలంలో తలలో చుండ్రు పెరగడానికి కారణం వేడి నీళ్లతో జుట్టును వాష్ చేయడం కూడా కావచ్చు. జుట్టును వేడి నీళ్లతో వాష్ చేయడం వల్ల స్కాల్ప్‌లోని సహజ నూనె తగ్గిపోయి, స్కాల్ప్ పూర్తిగా డ్రైగా మారుతుంది. అంతే కాకుండా స్కాల్ప్ పొడిగా మారుతుంది. ఫలితంగా జుట్టుకు దుమ్ము, ధూళి అంటుకుని దురద వంటి సమస్యలు కూడా పెరుగుతాయి. చుండ్రు, దురద నుండి ఉపశమనం పొందడానికి ఉపయోగపడే హోం రెమెడీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చుండ్రు వదిలించుకోవడానికి ఎఫెక్టివ్ హోం రెమెడీ:
చుండ్రుని వదిలించుకోవడానికి మీకు 3 ముఖ్య పదార్థాలు అవసరం. ఇవి మీ జుట్టును చుండ్రు, దురద నుండి ఉపశమనం కలిగిస్తాయి.
హోం రెమెడీ తయారీ :
కావాల్సినవి:
ఆవనూనె
తారామిరా ఆయిల్, జాంబా ఆయిల్
చిన్న ముక్క పటిక
చుండ్రు పోవడం కోసం రెండు చెంచాల ఆవాల నూనెలో ఒక చెంచా జాంబ నూనె, చిన్న పటిక ముక్క కలపండి. తర్వాత ఈ నూనెను తలకు పట్టించి ఒకటి నుంచి రెండు గంటల పాటు అలాగే ఉంచాలి. తర్వాత షాంపూతో జుట్టును శుభ్రం చేసుకోవాలి.
చుండ్రు సమస్య దూరమవుతుంది:
ఈ మూడు పదార్థాల మిశ్రమాన్ని అప్లై చేయడం వల్ల చుండ్రు సమస్య త్వరగా తీరిపోతుంది. అంతే కాకుండా ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు చుండ్రును తొలగిస్తాయి.
ఉసిరి నూనె, ఆలివ్ ఆయిల్ జుట్టుకు ఏది బెటర్ ?
ఉసిరి నూనె జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. అంతే కాకుండా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇది జుట్టు మూలాలను బలపరుస్తుంది. జుట్టును మెరిసేలా చేస్తుంది. శిరోజాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అదే సమయంలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఆలివ్ నూనెలో కనిపిస్తాయి. ఇది జుట్టు ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
Also Read: ఏడాదంతా ఆరోగ్యంగా ఉండటం కోసం.. ఈ రోజు నుంచే ఇలా చేయండి
నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, కాలుష్యం కారణంగా జుట్టు రాలడం, చుండ్రు, జుట్టు నెరిసిపోవడం వంటి అనేక రకాల సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రజలు అనేక రకాల షాంపూలు, మందులను ఉపయోగిస్తున్నారు. చాలా సార్లు ప్రజలు తమ ఆహారంలో మార్పులు చేసుకుంటారు. కానీ ఇది కూడా ఎటువంటి ప్రభావాన్ని చూపదు. భారతీయ స్త్రీలు లేదా పురుషుల జుట్టుకు ఏ నూనె మంచిది? ఈ ప్రశ్న చాలా మంది మదిలో తలెత్తుతుంది. చాలా మంది ప్రజలు ఉసిరి నూనెను మంచిదిగా భావిస్తారు. మరికొందరు ఆలివ్ ఆయిల్ జుట్టుకు పెరుగుదలకు ఉపయోగపడుతుందని చెబుతారు.