Delhi Governor Temples Demolish| ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిషి మార్లేనా సింగ్ లెఫ్టెనెంట్ గవర్నర్ వికె సక్సేనాపై సంచలన ఆరోపణలు చేశారు. గవర్నర్ సక్కేనా ఏర్పుటు చేసిన ఒక కమిటీ హిందూ, బౌద్ధ దేవాలయాలను ధ్వంసం చేసేందుకు ఆదేశాలు జారీ చేసిందని ఆమె చెప్పారు. అయితే ఆమె వ్యాఖ్యలను గవర్నర్ కార్యాలయం వ్యతిరేకించింది. ముఖ్యమంత్రి ఆతిషి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని గవర్నర్ సెక్రటేరియట్ ప్రకటించింది.
“ఎటువంటి దేవాలయాలు, మసీదులు, ఇతర ప్రార్థనా స్థలాలు ధ్వంసం చేయడం లేదు. అటువంటి ప్రస్తావనలేమీ రాలేదు” అని లెఫ్టెనెంట్ గవర్నర్ ఒక ప్రకటన జారీ చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రార్థనా స్థలాలు.. ముఖ్యంగా దేవాలయాలు ధ్వంసం చేసేందుకు ఒక మతపరమైన కమిటీ ఆదేశాలు జారీ చేసినట్లు తనకు నవంబర్ 22నే సమాచారం అందినట్లు ఆతిషి తెలిపారు. ఈ మేరకు సిఎం ఆతిషి.. గవర్నర్ కార్యాలయానికి ఒక లేఖ కూడా రాశారు.
“ఒక మతపరమైన కమిటీని మీరు ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ప్రార్థనా స్థలాను ధ్వంసం చేయమని ఆదేశాలు జారీ చేసింది. దానిపై వివరణ ఇవ్వండి” అని ఆతిషి ఆ లేఖ ద్వారా ఆరా తీశారు. కానీ ఈ లేఖపై గవర్నర్ సెక్రటేరియట్ ప్రతినిధి మండిపడ్డారు. ఢిల్లీ సిఎం ఆతిషి.. మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లాగానే దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని.. ఇవన్నీ తీవ్ర అంశాలను, ప్రభుత్వ వైఫల్యాలను పక్క దారి మళ్లించే ప్రయత్నాలని చెప్పారు.
Also Read: 2024లో భారత్ కోల్పోయిన మహానుభావులు వీరే..
ముఖ్యమంత్రి ఆతిషి లేఖలో వివరాల ప్రకారం.. ఢిల్లీలోని వెస్ట్ పటేల్ నగర్, దిల్షాద్ గార్డెన్, సుందర్ నగ్రీ, సీమా పురి, గోకల్ పురి, ఉస్మాన్ పూర్ ప్రాంతాల్లో ఉన్న హిందూ, బౌధ్ధ ప్రార్థనా స్థలాలు ధ్వంసం చేసేందుకు గవర్నర్ ఏర్పాటు చేసిన కమిటీ ఆదేశించింది. అయితే ఈ ప్రార్థనా స్థలాలు ధ్వంసం చేయడం ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని.. అందుకే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆమె గవర్నర్ ను కోరారు.
ఇంతకుముందు ఈ మతపరమైన కమిటీ ఏమైనా ప్రస్తావన ఉంటే ఢిల్లీ ముఖ్యమంత్రి, హోం మంత్రి తెలియజేసేది. వాటిని ఢిల్లీ ప్రభుత్వం గవర్నర్ వద్దకు ఆమోదం కోసం పంపేది. కానీ ఇప్పుడు గవర్నర్ నేరుగా వ్యవహరిస్తున్నారు. పాత విధానమైతే ఢిల్లీ ప్రభుత్వం ప్రజలు మనోభావాలు దెబ్బతీసే ఎటువంటి చర్యలనైనా అమలు కాకుండా నివారించేదని ఆతిషి తెలిపారు.
Also Read: జమిలి ఎన్నికలు ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకం కాదు.. యుసిసి కూడా త్వరలోనే.. కేంద్రం
2023 లోనే ప్రార్థనా స్థలాలను ధ్వంసం చేసేందుకు కమిటీ నిర్ణయం తీసుకుందని.. కానీ ఈ అంశం గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉందని ముఖ్యమంత్రి ఆతిషి వెల్లడించారు.