BigTV English

New Year Resolution: ఏడాదంతా ఆరోగ్యంగా ఉండటం కోసం.. ఈ రోజు నుంచే ఇలా చేయండి

New Year Resolution: ఏడాదంతా ఆరోగ్యంగా ఉండటం కోసం.. ఈ రోజు నుంచే ఇలా చేయండి

New Year Resolution: 2024 సంవత్సరపు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ మనమందరం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాము. గత సంవత్సరం ఎలా గడిచినప్పటికీ.. ఈ ఏడాది ఆరోగ్యానికి సంబంధించి చాలా విషయాల్లో మనందరికీ సవాలుగా మారనంది. గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడమే కాకుండా, లక్షలాది మంది మరణిస్తున్నారు. కేవలం ఈ గత ఏడాది కొరోనరీ ఆర్టరీ వ్యాధి కారణంగానే కోటి మందికి పైగా మరణించారని, శ్వాసకోశ సమస్యలు , ఊపిరితిత్తుల క్యాన్సర్ 18 లక్షల మందికి పైగా ప్రాణాలను బలిగొన్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ వ్యాధులన్నీ భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని, అందుకే వచ్చేఈ ఏడాది రాకుండా జాగ్రత్తపడాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.


న్యూ ఇయర్ 2025 సంవత్సరంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి జాగ్రత్తలు తీసుకోండి. మంచి ఆరోగ్యం కోసం మీరు ఈ రోజు తీసుకునే రిజల్యూషన్ భవిష్యత్తులో అనేక రకాల వ్యాధుల బారి నుండి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడుతుంది.

ఈ సంవత్సరం కనిపించే అన్ని వ్యాధులలో, ఒక విషయం చాలా సాధారణం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారిలో తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే ఈ ఏడాది ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే చర్యలపై తీవ్రమైన శ్రద్ధ వహించాలి.


న్యూ ఇయర్ సందర్భంగా ఈ రిజల్యూషన్స్ తీసుకోండి:

బరువు తగ్గండి :
మీరు అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతుంటే మాత్రం తప్పకుండా బరువు తగ్గడానికి ప్రయత్నించండి. మీ శరీర బరువులో కేవలం ఐదు నుండి పది శాతం తగ్గడం వల్ల గుండె జబ్బులు, టైప్-2 మధుమేహం, అధిక రక్తపోటు వంటి అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించవచ్చు. బరువు తగ్గాలంటే నిత్యం, ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేసే అలవాటు చేసుకోవాలి. మీరు బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా అనేక తీవ్రమైన వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడే కొన్ని ప్రత్యేక ఆహారాలను కూడా తీసుకోవాలి.

మీ ఆహారపు అలవాట్లను మెరుగుపరచుకోండి:
మీరు కొత్త సంవత్సరంలో ఆరోగ్యంగా ఉండాలంటే మీరు తినే ఆహారంపై శ్రద్ధ వహించండి. ప్రతి రోజు మీ ఆహారంలో పండ్లు , కూరగాయలు ఉండేలా చూసుకోండి. పండ్లు,కూరగాయలలో తక్కువ కేలరీలు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు మీకు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి. అంతే కాకుండా ఇవి బరువు తగ్గడానికి సహాయపడతాయి. పీచుపదార్థాలు అధికంగా ఉండే ఆహారాలు తినడం వల్ల ఇవి కొలెస్ట్రాల్, షుగర్ వంటి సమస్యలు పెరగకుండా నిరోధిస్తాయి.

అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడే ఆకుపచ్చ కూరగాయలతో పాటు నట్స్ , సీడ్స్ ఆహారంలో భాగంగా చేర్చుకోవం వల్ల యాంటీఆక్సిడెంట్లను పొందవచ్చు.

శారీరక శ్రమ ముఖ్యం:
ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న వ్యాధులకు శారీరక శ్రమ లేకపోవడం ప్రధాన కారణమని చాలా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి .ఈ రోజులో ఎక్కువ సమయం కూర్చొని లేదా విశ్రాంతి తీసుకునే వ్యక్తులు నడుస్తూ ఉండే వ్యక్తుల కంటే రక్తపోటు, కొలెస్ట్రాల్ మొదలైన అనేక ఆరోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, 2025లో మీ దినచర్యలో ఇది చేర్చుకోండి – ‘తక్కువగా కూర్చోండి-ఎక్కువగా నడవండి’

రోజువారీ జీవితంలో శారీరక శ్రమను పెంచడం లక్ష్యంగా పెట్టుకోండి. లిఫ్ట్‌కు బదులుగా మెట్లను ఉపయోగించండి. సమీపంలోని ప్రదేశాలకు డ్రైవింగ్ చేయడానికి బదులుగా నడిచి వెళ్లండి. రోజుకు కనీసం 10 వేల అడుగులు నడవాలని లక్ష్యంగా పెట్టుకోండి. మీరు రోజంతా ఆఫీసులో ఉంటే.. అప్పుడప్పుడు మీ సీట్ నుండి లేచి నడవండి. ఈ అలవాటు మీ ఆరోగ్యంలో సానుకూల మార్పులను తీసుకురావడానికి సహాయపడుతుంది.

Also Read: వీటిని ఫ్రిజ్‌లో పెడుతున్నారా ? జాగ్రత్త !

హెల్త్ చెకప్ తప్పనిసరి:
వ్యాధులు పెరగడానికి, వాటిని సకాలంలో గుర్తించకపోవడమే ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. మనమందరం నిర్ణీత వ్యవధిలో ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ ఉంటే చిన్న చిన్న అనారోగ్య రుగ్మతలు పెద్ద సమస్యలుగా మారకముందే వాటిని గుర్తించడంలో సహాయపడుతుంది. వ్యాధిని ముందుగానే గుర్తించినప్పుడు చికిత్స తరచుగా మరింత ప్రభావవంతంగా ఉంటుంది.

ఇంట్లో షుగర్ , రక్తపోటును క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ ఉండండి. దీని కోసం ఇంట్లో ఒక యంత్రాన్ని ఉంచుకోండి. మీకు ఏ పరీక్షలు అవసరమో , మీ ఆరోగ్యానికి అనుగుణంగా వాటిని ఏ వ్యవధిలో చేయాలి అనే దాని గురించి మీ వైద్యుడిని సంప్రదించండి.

Related News

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Fennel Seeds: సోంపు తినడం వల్ల ఎన్ని లాభాలుంటాయో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు !

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Big Stories

×