Tips For Dry Skin: ముఖం అందంగా, మెరుస్తూ ఉండాలని అందరూ కోరుకుంటారు. అందుకోసం కొంత మంది వివిధ రకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తారు. ఇదిలా ఉంటే మరికొందరు మేకప్ వేసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. ఇలా మేకప్ చేయడం వల్ల ఒక్కోసారి ముఖం బాగా డ్రైగా మారుతుంది.
మేకప్ తర్వాత ముఖం పొడిగా కనిపించడానికి చర్మంలో తేమ లేకపోవడం, తప్పుడు ఉత్పత్తులను ఉపయోగించడం లేదా సరైన మేకప్ టెక్నిక్‌ని అనుసరించకపోవడం వంటి అనేక కారణాలు ఉండవచ్చు. అందుకే మేకప్ వేసుకునేటప్పుడు కొన్ని రకాల టిప్స్ పాటించడం చాలా ముఖ్యం. లేకుంటే అది పెరిగిపోయి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. డ్రై స్కిన్ సమస్యను తగ్గించే కొన్ని టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మాయిశ్చరైజర్ ఉపయోగించండి:
అధిక మేకప్ కారణంగా ముఖం చాలా పొడిగా మారుతుంది. పొడి చర్మం కోసం మంచి మాయిశ్చరైజర్ ఉపయోగించడం చాలా ముఖ్యం. మీ ముఖాన్ని కడిగిన తర్వాత మీ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి మంచి మాయిశ్చరైజర్ ఉపయోగించండి. దీని కోసం, గ్లిజరిన్ , హైలురోనిక్ యాసిడ్‌తో చేసిన మాయిశ్చరైజర్‌లను ఎంచుకోండి.
వేప, తులసి ఫేస్ ప్యాక్:
వేప, తులసిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇవి డ్రై , డల్ స్కి న్‌ను మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది. ఇందుకోసం ఒక చెంచా వేప పొడి, ఒక చెంచా తులసి పొడి, తేనె కలిపి ప్యాక్‌లా తయారు చేసి ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత ముఖాన్ని వాష్ చేయాలి. ఇలా తరుచుగా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మొటిమలు తగ్గేందుకు ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి.
తేనె, పెరుగు మాస్క్:
మీరు వేప ఫేస్ ప్యాక్ వాడకపోతే గనక తేనె, పెరుగు మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయండి. ఇది చర్మానికి తేమను అందించి మృదువుగా చేస్తుంది. అంతే కాకుండా తేనెలో మీ చర్మాన్ని మృదువుగా మార్చడంలో సహాయపడే మూలకాలు ఉన్నాయి. అందుకే తేనెను ముఖానికి వాడాలి.
రోజ్ వాటర్:
రోజ్ వాటర్‌ను ముఖంపై స్ప్రే చేయడం వల్ల చర్మం చల్లబడి పొడిబారకుండా చేస్తుంది. ఇది మంచి నేచురల్ టోనర్. ఇలా చేయడం వల్ల చలికాలంలో కూడా మీ చర్మం మెరుస్తుంది. రోజ్ వాటర్ లో అలోవెరా జెల్ కలిపి మిక్స్ చేసి ముఖానికి వాడటం వల్ల కూడా డ్రై స్కిన్ సమస్య తొలగిపోతుంది.
Also Read: వీటితో.. మొటిమలకు శాశ్వత పరిష్కారం !
కొబ్బరి నూనె ఉపయోగించండి:
మీ చర్మం చాలా పొడిగా మారినట్లయితే, మీ ముఖం కడుక్కున్న తర్వాత కొబ్బరి నూనెను ఉపయోగించండి. ఉపయోగించడానికి ముందె మీ చేతిలో కొబ్బరి నూనె తీసుకొని ముఖం మీద సున్నితంగా మసాజ్ చేయండి.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.