Gastric Health Tips: మనలో చాలామందికి గ్యాస్ సమస్య చాలా ఇబ్బంది పెడుతుంటుంది. కడుపు నిండిపోవడం, ఉబ్బరం, డక్కులు, మంట ఇవన్నీ గ్యాస్ సమస్య వల్లే వస్తాయి. దీనివల్ల అసౌకర్యమే కాకుండా, మనం చేసే పనుల్లో కూడా దృష్టి సరిగా పెట్టలేము. అయితే కొన్ని సులభమైన ఇంటి చిట్కాలు పాటిస్తే ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.
కొబ్బరి నీళ్లు
మొదటగా కొబ్బరి నీళ్లు గురించి చెప్పాలి. ఇది ప్రకృతిలో లభించే అద్భుతమైన ఔషధం లాంటిది. రోజూ ఉదయం ఒక గ్లాస్, సాయంత్రం ఒక గ్లాస్ కొబ్బరి నీళ్లు తాగితే కడుపు చల్లబడుతుంది. కడుపులో మంట తగ్గిపోతుంది. అలాగే గ్యాస్ తయారయ్యే అవకాశాలు ఉండవు. దీని వల్ల శరీరానికి నీరసం రాదు, జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది.
మజ్జిగలో కొత్తిమీర రసం
ఇక మరో సులభమైన చిట్కా మజ్జిగలో కొత్తిమీర రసం కలిపి తాగడం. ఒక గ్లాస్ మజ్జిగ తీసుకుని దాంట్లో ఒక టీస్పూన్ కొత్తిమీర రసం కలిపి తాగితే కడుపులో చల్లదనం కలుగుతుంది. గ్యాస్ సమస్య క్రమంగా తగ్గిపోతుంది. దీనివల్ల కడుపులో ఉండే విషపదార్థాలు కూడా బయటికి పోతాయి. వేసవిలో అయితే ఇది మరీ అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది.
Also Read: Google pay: ఈ ఒక ట్రిక్‌తో మీ గూగుల్ పే హిస్టరీ పూర్తిగా ఖాళీ.. జస్ట్ ఇలా చేయండి
అల్లం ముక్క
మూడవది అల్లం ముక్క. భోజనానికి ముందు చిన్న అల్లం ముక్కను నోట్లో వేసుకుని నమిలితే గ్యాస్ సమస్య తగ్గిపోతుంది. అల్లం జీర్ణక్రియను బలపరుస్తుంది. ఆహారం సరిగ్గా జీర్ణమై, కడుపులో గాలి పేరుకునే సమస్య ఉండదు.
మసాలా పదార్థాలకు దూరంగా ఉండండి
మనకు తినాలనే ప్రతి పదార్థాల్లో ఇప్పుడు మసాలా తప్పని సరిగా వాడుతారు. అందులో బిర్యానీ ఒకటి. అందులో మసాలా లేనిదే వంట వండటం కష్టం, అసలు మసాలా లేకపోతే బిర్యాని రుచి రాదు. కానీ చాలా మంది గ్యాస్ సమస్య ఉన్నవారు బిర్యానీ తిని మందులు వేసుకుందామని తినేస్తుంటారు. కానీ, దాని వల్ల ఆనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. గ్యాస్ట్రిక్ ఉన్నవారు బిర్యానీ జంగ్ ఫుడ్స్ కు దూరంగా ఉండటం వారి ఆరోగ్యానికి చాలా మంచిది.
అదే కాకుండా, రోజూ తేలికైన ఆహారం తీసుకోవడం, ఎక్కువగా నీళ్లు తాగడం, ఫాస్ట్ ఫుడ్, ఎక్కువగా మసాలా పదార్థాలు తినడం మానుకోవడం కూడా చాలా ముఖ్యమైనవి. వీటిని పాటిస్తే గ్యాస్ సమస్య రాకుండా కాపాడుకోవచ్చు. అందువల్ల గ్యాస్ సమస్యతో బాధపడుతున్నవారు ఈ సులభమైన ఇంటి చిట్కాలను ప్రయత్నించండి. కడుపు తేలికగా ఉంటుంది, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.