BigTV English

Homemade Moisturizer: ఇంట్లోనే.. మాయిశ్చరైజర్ తయారు చేసుకుందామా ?

Homemade Moisturizer: ఇంట్లోనే.. మాయిశ్చరైజర్ తయారు చేసుకుందామా ?

Homemade Moisturizer: ఈ రోజుల్లో చాలా మంది డ్రై స్కిన్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ కారణంగా మన చర్మం కూడా చాలా ప్రభావితమవుతుంది. చాలా మంది చేతులు, కాళ్ళ గురించి అంతగా పట్టించకోరు. దీనివల్ల చర్మం నిర్జీవంగా, కఠినంగా కనిపించడం ప్రారంభమవుతుంది. ఇలాంటి పరిస్థితిలో.. మీ చర్మాన్ని మృదువుగా, ఆరోగ్యంగా ఉంచడానికి.. మీరు ఇంట్లోనే సులభంగా ఇంట్లోనే మాయిశ్చరైజర్ (ఫేస్ క్రీమ్) తయారు చేసుకోవచ్చు . దీనిని ఉపయోగించడం ద్వారా.. మీ చర్మం మృదువుగా మారుతుంది. అంతే కాకుండా తెల్లగా మెరిసిపోతుంది. కాబట్టి ఇన్ని ప్రయోజనాలు ఉన్న మాయిశ్చరైజర్ ఎలా తయారు చేసుకుని ఉపయోగించాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


మార్కెట్లో లభించే బాడీ లోషన్లు చర్మానికి తగినంత తేమ, పోషణను అందించవు. మీ చర్మాన్ని మృదువుగా , మెరిసేలా చేయడానికి.. మీరు ఇంట్లోనే మాయిశ్చరైజర్ తయారు చేసుకోవచ్చు. దీన్ని తయారు చేయడం చాలా సులభం.

మాయిశ్చరైజర్‌కు కావాల్సిన పదార్థాలు:
బోరోలిన్ లేదా ఏదైనా బాడీ లోషన్
అలోవెరా జెల్
సన్‌స్క్రీన్
గ్లిజరిన్
బేబీ ఆయిల్
నువ్వుల నూనె


మాయిశ్చరైజర్ తయారు చేసుకునే విధానం:
ముందుగా.. ఒక గాజు గిన్నెలో బోరోలిన్ క్రీమ్ , కలబంద జెల్ ని బాగా కలపండి. ఇప్పుడు గ్లిజరిన్, బేబీ ఆయిల్ , నువ్వుల నూనె వేసి బాగా కలపండి. తరువాత ఈ మాయిశ్చరైజర్ ని ఒక సీసాలో నింపండి. స్నానం చేసిన తర్వాత.. శరీరాన్ని టవల్ తో తుడవండి. ఆపై మీరు ఈ మాయిశ్చరైజర్ ని చేతులు, కాళ్ళపై మసాజ్ చేయవచ్చు. ఇది మీ చర్మాన్ని మృదువుగా , మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది.

మాయిశ్చరైజర్ ప్రయోజనాలు:

కలబంద:
కలబంద మీ చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇది చర్మాన్ని లోపలి నుండి హైడ్రేట్‌గా ఉంచడంలో చాలా సహాయపడుతుంది. మన చర్మాన్ని రక్షించుకోవడానికి మనం క్రీములు, పౌడర్లను ఉపయోగిస్తాము. దాని వల్ల ముఖంపై మచ్చలు కూడా కనిపించడం ప్రారంభిస్తాయి. స్నానం చేసిన వెంటనే మీరు దీనిని అప్లై చేస్తే ముఖంపై కొత్త మెరుపు కనిపిస్తుంది.

సన్‌స్క్రీన్:
సీజన్ ఏదైనా సన్‌స్క్రీన్ చాలా ముఖ్యం. సూర్యడి హానికరమైన కిరణాల నుండి మీ ముఖాన్ని రక్షించుకోవడానికి మీరు దీనిని తప్పనిసరిగా ఉపయోగించాలి. మీరు ఇంట్లో ఉన్నా లేదా బయట ఉన్నా.. దీనిని ఉపయోగించడం ద్వారా మీ చర్మాన్ని సూర్యుడి నుండి రక్షించుకోవాలి.

గ్లిజరిన్ ప్రయోజనాలు:
గ్లిజరిన్‌లో వృద్ధాప్యాన్ని నిరోధించే గుణాలు కూడా ఉన్నాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇది డ్రై స్కిన్‌కు కొత్త జీవాన్ని ఇస్తుంది. దీనిని ప్రతి రోజు రోజు ఉపయోగించడం వల్ల ముఖంపై గీతలను నివారిస్తుంది. మీ చర్మం చాలా కాలం పాటు శుభ్రంగా , యవ్వనంగా ఉంటుంది.

Also Read: ఇలా చేస్తే.. క్షణాల్లోనే తెల్లజుట్టు నల్లగా మారుతుంది తెలుసా ?

బేబీ ఆయిల్:
చర్మ సంరక్షణలో బేబీ ఆయిల్ వాడకం చాలా సాధారణం. చర్మం పొడిబారడం తొలగించడానికి చాలా మంది బేబీ ఆయిల్‌ను ఉపయోగిస్తారు. చాలా మంది మహిళలు బేబీ ఆయిల్‌ను మేకప్ రిమూవర్‌గా కూడా ఉపయోగిస్తారు.

నువ్వుల నూనె:
నువ్వుల నూనెలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి,.వి ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరిస్తాయి. ఇది చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది. అంతే కాకుండా చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అందుకే ఇది ముడతలు, ఫైన్ లైన్లను నివారించడంలో కూడా సహాయపడుతుంది.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×