Tips For White Hair: ప్రస్తుతం తెల్ల జుట్టుతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అందుకే చిన్నా పెద్దా తేడా లేకుండా హెయిర్ కలర్స్ వాడుతున్నారు. రసాయనాలతో తయారు చేసిన హెయిర్ కలర్స్ జుట్టుకు దెబ్బతినేలా చేస్తాయి. అంతే కాకుండా జుట్టు రాలడానికి కూడా కారణం అవుతాయి. ఇలాంటి సమయంలో హోం రెమెడీస్ వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా వీటి వల్ల ఎలాంటి ఖర్చు కూడా ఉండదు. సహజంగా హెన్నాను తయారు చేసుకుని వాడటం వల్ల తెల్ల జుట్టు క్షణాల్లోనే తెల్లగా మారుతుంది. ఇది జుట్టును సహజంగా మెరిసేలా చేస్తుంది. అంతే కాకుండా మందంగా చేస్తుంది.
తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి కావలసినవి:
1-2 టేబుల్ స్పూన్లు- కాఫీ పౌడర్
2-3 టేబుల్ స్పూన్లు- హెన్నా పౌడర్
2-3 కప్పులు- నీరు
½ స్పూన్- నిమ్మరసం
అర కప్పు- ఆమ్లా పౌడర్
అప్లికేటర్ బ్రష్
మిక్సింగ్ గిన్నె
తెల్ల జుట్టుకు హెన్నా వేసుకోవడానికి టిప్స్:
తెల్ల జుట్టును పూర్తిగా తెల్లగా మార్చడానికి మీరు ముందుగా హోం మేడ్ హెయిర్ కలర్ తయారు చేసుకోవాలి.
స్టెప్ 1: కాఫీ పౌడర్‌ను నీటిలో కొద్దిసేపు మరిగించి.. తక్కువ మంట మీద మరిగించి, మరిగిన తర్వాత చల్లార్చండి. ఇప్పుడు దానిలో హెన్నా పౌడర్ వేయండి.
స్టెప్ 2:హెన్నా పొడిని నీటిలో దాదాపు 8 గంటలు లేదా రాత్రంతా నానబెట్టండి. హెన్నాలో బ్లాక్ టీ నీరు, నిమ్మరసం, ఉసిరి పొడి కలపండి. ఇది జుట్టుకు సహజమైన నల్లదనాన్ని ఇస్తుంది.
స్టెప్ 3: మరకలు పడకుండా ఉండటానికి పాత బట్టలు ధరించండి. మీ జుట్టును చిన్న చిన్న విభాగాలుగా చేయండి. కుదుళ్ల నుండి కొన వరకు కవర్ చేయడానికి అప్లికేటర్ బ్రష్‌ను ఉపయోగించండి. జుట్టుకు పూర్తిగా అప్లై చేసిన తర్వాత తలకు కవర్ ధరించండి.
స్టెప్ 4: హెన్నాను మీ జుట్టు మీద 30 నిమిషాలు అలాగే ఉంచండి. అది ఆరిన తర్వాత.. చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. వెంటనే షాంపూ తో వాష్ చేయండి. మీరు మరుసటి రోజు జుట్టుకు షాంపూ ఉపయోగించవచ్చు. మీరు దీన్ని నెలకు 2 సార్లు ఉపయోగించవచ్చు.
హెన్నా వల్ల తెల్ల జుట్టు తగ్గుతుందా ?
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ హోం మేడ్ హెయిర్ కలర్ చాలా బాగా పనిచేస్తుంది. ఇది జుట్టుకు సహజ రంగును ఇస్తుంది. దీని ప్రభావం దాదాపు ఒక నెల పాటు కనిపిస్తుంది. దీనికి కలబంద, ఉసిరి, కాఫీ వంటి పదార్థాలను కలపడం వల్ల దాని లక్షణాలు మరింత పెరుగుతాయి. ఇది జుట్టు యొక్క సహజ మెరుపును కూడా పెంచుతుంది.
Also Read: బియ్యం పిండిలో ఈ ఒక్కటి కలిపి వాడితే.. చందమామ లాంటి ముఖం
జుట్టుకు హెన్నా వల్ల కలిగే ప్రయోజనాలు:
హెన్నా దాని ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందింది. దాని యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ , క్యాన్సర్ నిరోధక లక్షణాలు తల, జుట్టుకు చాలా మేలు చేస్తాయి. అంతే కాకుండా అవి జుట్టును చిక్కగా, నల్లగా, హైడ్రేట్ చేయడానికి పనిచేస్తాయి. హెన్నా యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది తలపై ఇన్ఫెక్షన్ల నుండి ఉపశమనం కలిగిస్తుంది.