BigTV English

EVV Satyanarayana: ఈ.వీ.వీ. సత్యనారాయణ గురించి ఎవరికి తెలియని పది రహస్యాలివే!

EVV Satyanarayana: ఈ.వీ.వీ. సత్యనారాయణ గురించి ఎవరికి తెలియని పది రహస్యాలివే!

EVV Satyanarayana Birth Anniversary: దివంగత స్టార్ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ (EVV Satyanarayana) గురించి నేటితరం యువతకు పెద్దగా తెలియకపోయినా.. 90’స్ ఆడియన్స్ కి ఈయన గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఈయన సినిమాల విషయానికి వస్తే.. నాడే కాదు నేటి జనరేషన్ వారు కూడా ఈయన సినిమాలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. ఇకపోతే ఈయన చనిపోయి నేటికీ 14ఏళ్లు అవుతున్నా.. ఈయన సినిమాలు ఇంకా మనల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాయి. ఇకపోతే ఈరోజు ఆయన జయంతి. ఈ సందర్భంగా ఈయనకు సంబంధించి ఎవరికీ తెలియని 10 విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.


1. ఈవీవీ సత్యనారాయణ.. 1956 జూన్ 10న ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లాలోని దొమ్మేరు అనే ఊర్లో ఒక రైతు కుటుంబంలో జన్మించారు. పూర్తి పేరు ఈదర వీర వెంకట సత్యనారాయణ. తండ్రి పేరు వెంకటరావు. తల్లి వెంకటరత్నం. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఈయనకు తమ సొంత ఊరిలో 70 ఎకరాల వరకు పొలం ఉందని సమాచారం.

2. ఇంటర్మీడియట్ వరకు పూర్తి చేసిన ఈయిన సినిమాల మీద ఆసక్తితో చెన్నై వచ్చేశారు. అయితే ఈ విషయం ఈయన తండ్రి వెంకట్ రావుకి నచ్చలేదు.అయినా తన మొండి వైఖరిని ఈవీవీ మార్చుకోలేదు. దాంతో ఈవీవీ కి సరస్వతి కుమారిని ఇచ్చి వివాహం జరిపించారు. కొన్నాళ్లు పొలం పనులు చూసుకుంటూ వచ్చిన ఈవీవీ సత్యనారాయణకి ఆర్యన్ రాజేష్, నరేష్ జన్మించారు. అయినా సరే సినిమాల మీద ఆసక్తి తగ్గకపోవడంతో తండ్రిని ఒప్పించి మరీ చెన్నైకి వెళ్ళిపోయారు ఈవీవీ సత్యనారాయణ.


3. అవకాశాల కోసం ఎన్నో కష్టాలు పడ్డారు. సమయానికి తిండి ఉండేది కాదు..మంచినీళ్లు తాగి పడుకున్న రోజులు కూడా ఉన్నాయట. ఎవరు ఎంకరేజ్ చేసిన వాళ్లే లేరు. తిట్లు, అవమానాలు, చీదరింపులు.. ఇలా ఎన్నో ఎదుర్కొన్నారు. అవకాశాల కోసం ఎదురుచూస్తున్నప్పుడు రాజీవ్ కనకాల (Rajiv kanakala) తండ్రి దేవదాసు కనకాల (Devadas kanakala) తన సినిమా ‘ఇంటి భాగోతం’ కి అసిస్టెంట్ డైరెక్టర్ ఈవీవీకి అవకాశం కల్పించారు. అలా ఆయన పనితనం అందరి దృష్టిని ఆకట్టుకుంది.

4. ఇక తర్వాత జంధ్యాల, సురేష్ కృష్ణ వంటి స్టార్ డైరెక్టర్ల దగ్గర శిష్యరికం చేసిన ఈయనకు.. ఆ తర్వాతే దర్శకుడిగా సినిమాలు చేసే అవకాశం లభించింది.

5. తొలి ప్రయత్నంలో ‘చెవిలో పువ్వు’ అనే చిత్రానికి వహించారు ఈవీవీ సత్యనారాయణ . 1990లో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. అప్పటివరకు ఈయనను వెతుక్కుంటూ వచ్చిన నిర్మాతలు కూడా వెనకడుగు వేశారు. మొదటి సినిమా డిజాస్టర్ కావడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన సూసైడ్ కూడా చేసుకోవాలని అనుకున్నట్లు గతంలో తెలిపారు.

6. అయితే ఈయన పనితనాన్ని మెచ్చిన రామానాయుడు మాత్రం ‘ప్రేమ ఖైదీ’ సినిమాకి దర్శకత్వం చేసే అవకాశం ఇచ్చారు. అలా వచ్చిన ప్రేమ ఖైదీ సినిమా సూపర్ హిట్ అయింది. పెట్టిన పెట్టుబడికి నాలుగు రెట్లు లాభాలు లభించాయి.

7. తర్వాత వెను తిరిగి చూసుకోలేదు ఈవీవీ సత్యనారాయణ. అప్పుల అప్పారావు, సీతారత్నం గారి అబ్బాయి, ఏవండీ ఆవిడ వచ్చింది, జంబలకడిపంబ, ఆ ఒక్కటి అడక్కు, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, అబ్బాయిగారు, అల్లుడా మజాకా, ఆమె ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించి స్టార్ డైరెక్టర్గా పేరు సొంతం చేసుకున్నారు ఈవీవీ సత్యనారాయణ.

8. అంతేకాదు రచన, ఊహ, రవళి, రంభ వంటి హీరోయిన్లను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత ఈయన సొంతం.

9. ఈయన స్టార్ డైరెక్టర్గా ఎదగడమే కాదు ఇండస్ట్రీలోకి వచ్చిన వీవీ.వినాయక్, శ్రీనువైట్ల వంటి వారికి కూడా అవకాశం కల్పించారు.

10. ఈయన దర్శకత్వం వహించిన ‘ఆమె’ చిత్రానికి తొలి నంది అవార్డు కూడా అందుకున్నారు.

ALSO READ:HBD Balakrishna : బాలా బాబాయ్‌కి కళ్యాణ్ రామ్ స్పెషల్ విషెష్.. ఈసారైనా గెట్‌లోకి ఎంట్రీ ఉంటుందా?

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×