BigTV English

Telugu Producers : మారాల్సింది వాళ్లు వీళ్లు కాదు… ప్రొడ్యూసర్లు మారితే ఇండస్ట్రీ బాగు పడుతుంది

Telugu Producers : మారాల్సింది వాళ్లు వీళ్లు కాదు… ప్రొడ్యూసర్లు మారితే ఇండస్ట్రీ బాగు పడుతుంది

Telugu Producers : ప్రపంచ సినీ వేదికపై మెరిసిన తెలుగు సినీ పరిశ్రమ ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఒక రకమైన సంక్షోభం ఇప్పుడు ఇండస్ట్రీలో ఉంది. ఈ పరిస్థితుల వల్లే ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ మధ్య కొన్ని వివాదాలు నెలకొన్నాయని చెప్పొచ్చు. అయితే ఈ గడ్డు పరిస్థితుల నుంచి ఇండస్ట్రీ బయట పడాలంటే.. వీళ్లు మారాలి. వాళ్లు మారాలి అంటూ ఎవరికి తొచింది వాళ్లు చెబుతున్నారు.


కానీ, మారాల్సింది వాళ్లు, వీళ్లు కాదు. నిర్మాతలు మారాలి. ఈ నిర్మాతలు మారితే… ఇండస్ట్రీ బాగు పడుతుంది. అది ఏంటో.. ఎలానో ఇప్పుడు చూద్దాం…

ఈ మధ్య.. అంటే ఎప్పుడైతే ఇండస్ట్రీలో సంక్షోభం స్టార్ట్ అయిన నాటి నుంచి కొంత మంది… ఇండస్ట్రీ ఈ సంక్షోభం నుంచి భయట పడాలి అంటే హీరోలు మారాలి అని అంటున్నారు.


దానికి వాళ్లు ఇచ్చే ఎక్స్‌ప్లేనేషన్స్ ఇవి..

గతంలో ఒక హీరో ఏడాదికి కనీసం రెండు నుంచి మూడు సినిమాలు చేసేవాడు. ఇప్పుడు ఒక హీరో సినిమా రావాలంటే కనీసం రెండు నుంచి మూడేండ్లు పడుతుంది అని చెప్పారు.

కానీ, నిజానికి తప్పు హీరోలదా..?

దీన్ని గమనిస్తే దీనిలో తప్పు హీరోలదా..? అంటే కచ్చితంగా కాదు అని అనొచ్చు. గతంలో హీరోలు ఏడాదికి మూడు సినిమాలు చేసే వాళ్లు. ఇప్పుడు హీరోలు ఒక్క సినిమాను మూడేండ్లకు చేస్తున్నారు. అని నిజమే.

అయితే… గతంలో ఒక్క హీరో ఒక్కో సినిమాకు నిర్మాతలు ఇచ్చే రెమ్యునరేషన్ చాలా తక్కువ. ఇప్పుడు హీరోలకు ఒక్కో సినిమాకు ఇచ్చే పారితోషికం మూడెంకల్లో ఉంటుంది. రెమ్యునరేషన్‌తో పాటు లాభాల్లో వాటాలు కూడా సమర్పిస్తున్నారు.

ఇలా ఒక్కో సినిమాకు త్రి డిజిట్ రెమ్యునరేషన్, లాభాల్లో వాటాలు ఇచ్చిన తర్వాత ఆ హీరోకు ఏడాది రెండు సినిమాలు చేయాల్సిన అవసరం లేదు. టైం ఉన్నా… డైరెక్టర్లు రెడీగా ఉన్నా… ఒక్క సినిమాను పూర్తి చేయడానికి కనీసం రెండేళ్లు తీసుకుంటున్నారు.

వెకేషన్స్ సినిమా కంటే మోస్ట్ ఇంపార్టెంట్

ఈ మధ్య హీరోలకు సినిమా కంటే వెకేషన్సే చాలా ఇంపార్టెంట్ అయిపోయాయి. పట్టు మని పది రోజులు కూడా షూటింగ్ చేయకుండానే… ఫ్యామిలీతో ఫ్లైట్ ఎక్కేసి వేకేషన్ మూడ్ లోకి వెళ్లిపోతారు. ఆ ఫ్లైట్ అండ్ ఫారిన్‌ ఖర్చులు మొత్తం కూడా కొన్ని సార్లు.. కొంత మంది నిర్మాతలే భరిస్తారు అనేది ఇండస్ట్రీలో ఓపెన్ టాక్.

హీరోలను ఇలా అలవాటు చేసింది ఎవరు..?

ఇలా భారీ రెమ్యునరేషన్స్, వెకేషన్స్, ఫ్లైట్ ఖర్చులు, ఫారిన్ లో ఖర్చులను పెట్టడం ఇవి హీరోలకు ఎవరు అలవాటు చేశారు..? నిర్మాతలు కాదా..? దీనికి టాలీవుడ్ లో ఉన్న నిర్మాతలు కాదు అనే సమాధానం ఇవ్వగలరా..?

ఒక ఓటీటీ డీల్స్‌లో నిర్మాతల పాత్ర ఎంత..?

ఈ సంక్షోభం సమయంలోనే మరో వాదన కూడా వచ్చింది. అదే ఓటీటీ డీల్స్. సినిమా రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే ఓటీటీకి వస్తుంది. అది మార్చుకుంటే ఇండస్ట్రీ బాగు పడుతుంది అని అన్నారు చాలా మంది. అది 100 శాతం నిజం.

అయితే మార్చుకోవాల్సింది ఎవరు..? అంటే నిర్మాతలే కదా మార్చుకోవాల్సింది. ఆ మధ్య ఓటీటీల్లోకి సినిమాలు 4 వారాల తర్వాతే రావాలి అంటూ రూల్స్ పెట్టుకున్నారు. ఆ రూల్స్ పెట్టుకున్న నిర్మాతలే ఆ రూల్స్‌ను తుంగలో తొక్కి ఓటీటీకి ముందే ఇచ్చేస్తున్నారు.

EX బన్నీ వాస్…

ఈ మధ్య బన్నీ వాస్ అనే నిర్మాత చాలా ఎమోషనల్ ట్వీట్ వేశాడు. రిలీజైన 28 రోజుల లోపే ఓటీటీకి ఇచ్చేస్తే రాబోయే నాలుగేళ్లల్లో 90 శాతం సింగింల్ థియేటర్స్ క్లోజ్ అవుతాయి అంటూ చాలా అంటే చాలా ఎమోషనల్ అండ్ రియాలిటీ క్వశ్చన్ ను రైజ్ చేశాడు.

కానీ, ఆయన నిర్మించిన “సింగిల్” మూవీని మాత్రం ఆయన చెప్పిన 28 రోజులు గడవక ముందే ఓటీటీకి ఇచ్చేశాడు.

స్పెషల్ గా బన్నీ వాస్ ఒక్కరే కాదు. అలాంటి నిర్మాతలు చాలా మంది ఉన్నారు. ఈ మధ్య ఇది జరిగింది కాబట్టి ఆయనను ఉదహరించాం అంతే.

అమీర్ ఖాన్‌ను ఆదర్శంగా తీసుకోలేరా..?

ఈ ఓటీటీ డీల్స్ విషయంలో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్‌ను ఆదర్శంగా తీసుకోలేరా..? అమీర్ ఖాన్ ఇప్పుడు ‘సితారే జమీన్ పర్’ అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా ఈ నెల 20 రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాను ఎట్టిపరిస్థితుల్లో ఓటీటీ రిలీజ్ చేయను అని ప్రకటించాడు. తన సినిమాను ఓటీటీకి ఇవ్వకుండా… యూట్యూబ్ లో రిలీజ్ చేస్తా అని ప్రకటించాడు. అంతే కాదు.. ఓటీటీ వల్ల ఇండస్ట్రీ దెబ్బతింటుంది అని కూడా కామెంట్స్ చేశాడు.

ఇలా తెలుగు నిర్మాతలకు చేసే దమ్ము ఉందా..? ఇవి చేస్తే.. నిర్మాతలు ఇలా మారితే.. ఇండస్ట్రీ బాగుపడదా..?

Related News

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Shriya Saran: నేను హీరోయిన్ అని నా భర్తకు తెలీదు.. ఆ మూవీ చూసి భయపడ్డారు – శ్రియా

Big Stories

×