Homemade Face Cream: ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది కొరియన్ డ్రామాలను ఇష్టపడతారు. కొరియన్ డ్రామాలతో పాటు కొరియస్ స్కిన్ కేర్ పట్ల కూడా ఆసక్తి చూపిస్తుంటారు. కొరియన్ అమ్మాయిల లాగా మెరిసే చర్మాన్ని పొందడానికి వివిధ రకాల పద్ధతులను ప్రయత్నించే వారు చాలా మందే ఉంటారు. కానీ వీటి ప్రభావం ఎక్కువ కాలం ఉండదు. అందుకే ఇలాంటి సమయంలో మీరు పక్కా స్కిన్ కేర్ టిప్స్ ఫాలో అవ్వాలి.
అది ఖచ్చితంగా మీ చర్మానికి సహజమైన మెరుపును తెస్తుంది. అంతే కాకుండా అద్దం లాంటి చర్మం కోసం మీరు కూడా ఇంట్లోనే కొరియన్ స్టైల్ నైట్ క్రీమ్ తయారు చేసుకుని వాడవచ్చు. ప్రతి రోజూ రాత్రి పూట దీనిని చర్మంపై అప్లై చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి మీరు ఇంట్లో కొరియన్ గ్లాసీ స్కిన్ కోసం ఫేస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మీ ముఖాన్ని శుభ్రం చేసుకోండి:
కొరియన్ గ్లాసీ స్కిన్ కోసం మీరు ముందుగా మీ ముఖాన్ని పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. చర్మాన్ని శుభ్రం చేసుకోవడం ద్వారా.. మీరు మీ చర్మంపై ఏది అప్లై చేసినా అది చర్మంలోకి బాగా కలిసిపోతుంది. మీ చర్మాన్ని శుభ్రం చేసుకోవడానికి మీరు మంచి క్లెన్సర్‌ని ఉపయోగించాలి.
ఇంట్లోనే నైట్ క్రీమ్ ఇలా తయారు చేసుకోండి:
కావాల్సినవి:
బియ్యం నీళ్లు – 2 టేబుల్ స్పూన్లు
అలోవెరా జెల్- 2 టేబుల్ స్పూన్లు
విటమిన్ ఇ క్యాప్సూల్- 1
కొబ్బరి నూనె- 1 టేబుల్ స్పూన్
తయారీ విధానం: ముందుగా.. ఒక గిన్నెలో రెండు చెంచాల బియ్యం కడిగిన నీళ్ళు తీసుకోండి. వీటికి రెండు చెంచాల పాలు కలపండి. ఇప్పుడు దీనిలోనే రెండు చెంచాల అలోవెరా జెల్ కలపండి. అనంతరం అందులో విటమిన్ ఇ క్యాప్సూల్ నూనె కలపండి. తర్వాత చెంచా పచ్చి కొబ్బరి నూనె కలపండి.ఇప్పుడు ఒక చెంచా సహాయంతో వీటన్నింటినీ బాగా మిక్స్ చేయండి.
దీని నుండి నురుగ రావడం ప్రారంభమయ్యే వరకు కలపండి. ఈ విధంగా క్రీమ్ తెల్లగా మారుతుంది. ఇప్పుడు దానిని ఒక చిన్న గాజు పాత్రలో స్టోర్ చేయండి. మీరు దానిని ఒక వారం వరకు ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవచ్చు.
ఇలా అప్లై చేయండి:
ప్రతి రాత్రి మీ ముఖాన్ని శుభ్రం చేసుకుని తడి లేకుండా తుడవండి. ఇప్పుడు తయారు చేసుకున్న క్రీమ్ ముఖం మీద అప్లై చేసి.. చేతులతో ముఖాన్ని కింది నుండి పైకి మసాజ్ చేయండి. మీరు దీన్ని ప్రతి రాత్రి 7 రోజుల పాటు ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల మీ చర్మంపై కొత్త కనిపిస్తుంది.
Also Read: తెల్లజుట్టును నల్లగా మార్చడంలో.. వీటిని మించినది లేదు !
అలోవెరా నైట్ క్రీమ్:
మొటిమలను నయం చేయడంలో.. కలబంద సహాయపడుతుంది. ఇది యాంటీ ఏజింగ్, మాయిశ్చరైజింగ్ లక్షణాలను కూడా కలిగి ఉంది. కలబందలో ఉండే అమైనో ఆమ్లాలు చర్మ కణాలను మృదువుగా చేసి దాని ఆకృతిని మెరుగుపరుస్తాయి.