BigTV English
Advertisement

OTT Movie : మూడు తరాలకు ముచ్చెమటలు పట్టించే దెయ్యం… బెస్ట్ హర్రర్ మూవీ

OTT Movie : మూడు తరాలకు ముచ్చెమటలు పట్టించే దెయ్యం… బెస్ట్ హర్రర్ మూవీ

OTT Movie : కామెడీ స్టోరీలతో వచ్చే హారర్ సినిమాలను ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ఇందులో కడుపుబ్బ నవ్వించే సన్నివేశాలు చాలా ఉంటాయి. భయపెడుతూ, నవ్వించే ఈ సినిమాలు ఓటీటీ లో చాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో, ఒక చిలిపి దయ్యం ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత సన్నివేశాలు సరదాగా సాగిపోతాయి. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ డార్క్ ఫాంటసీ కామెడీ హారర్ మూవీ పేరు ‘Beetlejuice Beetlejuice’. 2024 లో వచ్చిన ఈ మూవీకి టిమ్ బర్టన్ దర్శకత్వం వహించారు. ఇది 1988 లో విడుదలైన ‘Beetlejuice’ మూవీకి సీక్వెల్‌గా రూపొందింది. ఈ సినిమా మొదటి భాగం నుండి 36 సంవత్సరాల తర్వాత సీక్వెల్ ను తెరకెక్కించారు. ఇది డీట్జ్ కుటుంబంలోని మూడు తరాల చుట్టూ కథ తిరుగుతుంది. ఈ మూవీలో మైఖేల్ కీటన్, వినోనా రైడర్, కేథరీన్ ఓ’హారా తమ పాత్రలను మళ్లీ పోషించారు.అలాగే జెన్నా ఒర్టెగా, జస్టిన్ థెరోక్స్, మోనికా బెల్లూచీ, విల్లెం డఫో వంటి కొత్త నటీనటులు కూడా నటించారు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీలోకి వెళితే

లిడియా డీట్జ్ ఒక పారానార్మల్ టాక్ షో అనే ‘ఘోస్ట్ హౌస్’ని నడుపుతూ ఉంటుంది. తన భర్త రిచర్డ్ మరణించిన తర్వాత తన కుమార్తె ఆస్ట్రిడ్ తో కలసి ఉంటోంది. లిడియా ఇప్పుడు తనకంటూ ఒక జీవితాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటుంది. కానీ ఆమె ఇప్పటికీ బీటిల్‌జూస్ అనే ఒక చిలిపి దెయ్యం గురించి గుర్తుచేసుకుంటూ ఉంటుంది. అతను ఆమెకు గతంలో మరచిపోలేని జ్ఞాపకాలతో వెంటాడుతాడు. లిడియా తండ్రి చార్లెస్ డీట్జ్ అకస్మాత్తుగా చనిపోతాడు. అతని అంత్యక్రియలకు, డీట్జ్ కుటుంబం వింటర్ రివర్‌ అనే ప్రాంతానికి తిరిగి వస్తారు. చార్లెస్ ఒక పెద్ద షార్క్ దాడి చేయడంవలన మరణించి ఉంటాడు. అతని అంత్యక్రియల కోసం కుటుంబం సమావేశమవుతుంది. ఈ సమయంలో లిడియా తన బాయ్‌ఫ్రెండ్, ప్రొడ్యూసర్ అయిన రోరీ తో మనసు పారేసుకుంటుంది. అతను ఆమెను హాలోవీన్ రోజున వివాహం చేసుకోవాలని ప్రపోస్ చేస్తాడు. ఇంతలో ఆస్ట్రిడ్ తన తాత చనిపోయిన ఇంటిలోని అటకపై ఒక రహస్యమైన ప్రాంతానికి దారి కనిపెడుతుంది. ఆమె ఆ దారిని అనుకోకుండా తెరుస్తుంది. దీంతో బీటిల్‌జూస్ ఆ దారినుంచి మళ్లీ ఈ లోకంలోకి ప్రవేశిస్తాడు.

అతనికి లిడియాను వివాహం చేసుకోవాలనే ఉద్దేశం ఉంటుంది. అదే సమయంలో బీటిల్‌జూస్ మాజీ భార్య డెలోర్స్, అతనిపై ప్రతీకారం తీర్చుకోవడానికి వస్తుంది. మరోవైపు ఆస్ట్రిడ్ ను ఒక చిన్న జెరెమీ దెయ్యం బంధిస్తుంది. అతను ఆమె ఆత్మను తీసుకోవాలని ప్లాన్ చేస్తాడు. ఆమెను రక్షించడానికి, లిడియా బీటిల్‌జూస్ సహాయం కోరుతుంది. అందుకు అతను ఆమెతో వివాహ ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఆ తరువాత వీళ్ళు ఆస్ట్రిడ్ ను మరణించిన ఆమె తండ్రి ఆత్మ సహాయంతో రక్షిస్తారు. ఇక లిడియా బీటిల్‌జూస్‌ను వివాహం చేసుకోవడానికి చర్చికి వెళ్తుంది. ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్న డెలోర్స్ ను ఒక భారీ శాండ్‌వార్మ్ తినేస్తుంది. లిడియా, ఆస్ట్రిడ్ కలిసి కొత్త జీవితాన్ని ఆస్వాదించాలని అనుకుంటారు. చివరికి బీటిల్‌జూస్ ఇన్నాళ్ళూ ఏమైపోయాడు ? లిడియా, బీటిల్‌జూస్‌ను వివాహం చేసుకుంటుందా ? ఆస్ట్రిడ్ ఆత్మను ఆ దెయ్యం ఎందుకు తీసుకోవాలి అనుకుంటుంది ? ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే,ఈ మూవీని చూడాల్సిందే.

Related News

The Great Pre Wedding Show OTT : చిన్న సినిమాగా వచ్చి చితగ్గొడుతున్న ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’… క్రేజీ ఓటీటీ డీల్

OTT Movie : 20 ఏళ్ల అబ్బాయితో 40 ఏళ్ల ఆంటీ… పాటలతో వలపు వల… ఆ సీన్లైతే అరాచకం భయ్యా

OTT Movies : ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ సినిమాలు.. ఆ నాల్గింటిని మిస్ అవ్వకండి..

OTT Movie : పూలమ్మే పిల్ల జీవితంలోకి మాజీ ప్రియుడు… ఖతర్నాక్ క్లైమాక్స్ మావా

OTT Movie : కుర్రాడి నుంచి పండు ముసలిదాకా ఎవ్వర్నీ వదలని అమ్మాయి… ఇదెక్కడి తేడా యవ్వారంరా సామీ ?

OTT Movie : ప్రియుడిని వదిలేసి మరొకడితో… కళ్ళు తెరిచినా మూసినా అవే సీన్లు… క్లైమాక్స్ కెవ్వు కేక

OTT Movie : చేతబడులతో చచ్చి బతికే కుటుంబం… ‘విరూపాక్ష’ను మించిన బ్లాక్ మ్యాజిక్ మరాఠీ మూవీ తెలుగులో

OTT Movie : తాత వల్ల నలిగిపోయే కూతురు, మనవడు… గుండెను పిండేసే రాశి ఫ్యామిలీ ఎంటర్టైనర్

Big Stories

×