Tips For White Hair: ప్రస్తుతం చాలా మంది ఎదుర్కుంటున్న సమస్యల్లో తెల్ల జుట్టు కూడా ఒకటి. చిన్నా పెద్దా తేడా లేకుండా అనేక మంది నేడు జుట్టు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇదిలా ఉంటే తెల్ల జుట్టు మన ఆత్మ విశ్వాసాన్ని తగ్గిస్తుంది. అందుకే దీనిని ఎలాగైనా నల్లగా మార్చుకోవడానికి చాలా మంది బయట మార్కెట్‌లో దొరికే హెయిర్ కలర్స్‌తో పాటు ఆయిల్స్, షాంపూలను వాడుతుంటారు. ఇవి శాశ్వతంగా తెల్ల జుట్టును నల్లగా మార్చలేవు.
అందుకే తెల్ల జుట్టును ప్రారంభంలోనే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. లేదంటే హోం రెమెడీస్ ట్రై చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. మరి రసాయనాలతో తయారు చేసే హెయిర్ కలర్స్ ఆయిల్స్‌కు బదులుగా తెల్ల జుట్టును తక్కువ సమయంలోనే నల్లగా మార్చే హోం రెమెడీస్ ఎలా తాయారు చేసుకుని వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
హెన్నాతో హెయిర్ కలర్:
జుట్టును సహజంగానే నల్లగా మార్చుకోవడానికి నేచురల్ హెన్నా పౌడర్ ను ఉపయోగించవచ్చు. ముఖ్యంగా తెల్ల జుట్టు సమస్యతో ఇబ్బంది పడే వారికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. హెన్నా వివిధ రంగులలో మార్కెట్ లో అందుబాటులో ఉంటుంది. జుట్టు రంగును బట్టి మీరు హెన్నాను ఎంపిక చేసుకోండి. హెన్నాలో ఇండిగో పౌడర్ కలిపి కూడా మీరు వాడవచ్చు.
తయారీ విధానం:
ముందుగా ఒక గిన్నెలో 4 టేబుల్ స్పూన్ల హెన్నా పౌడర్ తీసుకోండి ఇందులో సమాన మోతాదులో ఇండిగో పౌడర్ యాడ్ చేయండి. తర్వాత వీటిలో తగినన్ని నీళ్లు పోసి పేస్ట్ లాగా తయారు చేయండి. తర్వాత దీనిని బ్రష్ సహాయంలో జుట్టుకు అప్లై చేయండి. అరగంట తర్వాత తలస్నానం చేయండి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా ఇది జుట్టును నల్లగా మార్చడంలో కూడా చాలా ప్రభావ వంతంగా పనిచేస్తుంది.
బీట్ రూట్ హెయిర్ కలర్:
తెల్ల జుట్టు నల్లగా మార్చడంలో బీట్ రూట్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిని తరచుగా వాడటం వల్ల తెల్ల జుట్టు పూర్తిగా మాయం అవుతుంది. బీట్ రూట్ తో తయారు చేసిన ఫేస్ ప్యాక్ జుట్టుకు వాడటం వల్ల అద్భుత ఫలితాలు ఉంటాయి.
Also Read: సమ్మర్‌లో.. కూల్ కూల్‌గా ఐస్ ఫేషియల్
ఇందుకోసం చిన్న కప్పులో హెన్నాను తీసుకోవాలి. తర్వాత ఒక బీట్ రూట్ తీసుకుని దాని తొక్క తీసి మిక్సీలో పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత దాని నుండి రసం తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ బీట్ రూట్ జ్యూస్ ని హెన్నా పౌడర్ లో మిక్స్ చేసి పేస్ట్ లాగా తయారు చేసుకోండి. అనంతరం ఈ రెండింటినీ మిక్స్ చేసి ఇలా తయారయిన ఈ పేస్ట్ ను జుట్టుకు పట్టించి ఆరనివ్వండి. 30 నిమిషాల తర్వాత తలస్నానం చేయండి. ఇలా తరచుగా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా తక్కువ సమయంలోనే జుట్టు నల్లబడుతుంది.