Hair Mask For Silky Hair: ప్రతి ఒక్కరూ పొడవాటి, అందమైప మెరిసే జుట్టును కోరుకుంటారు. దీని కోసం.. కొందరు పార్లర్లకు వెళ్లి ఖరీదైన హెయిర్ ట్రీట్‌మెంట్‌లను ట్రై చేస్తుంటారు. అంతే కాకుండా జుట్టు రకాన్ని బట్టి షాంపూలు, కండీషనర్లు, సీరమ్‌లు, హెయిర్ మాస్క్‌లు కూడా వాడుతుంటారు. కానీ ప్రతి ఒక్కరూ జుట్టు సంబంధిత సమస్యలు తగ్గడానికి మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు.
మీరు ఇంట్లోనే హెయిర్ మాస్క్‌ను సులభంగా తయారు చేసుకుని వాడవచ్చు. ఎలాంటి హెయిర్ మాస్కులు తయారు చేసుకుని వాడితే అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పొడవాటి, మెరిసే జుట్టు కోసం హెయిర్ మాస్క్ :
కావలసిన పదార్థాలు :
2 టేబుల్ స్పూన్ల- పెరుగు
1 టేబుల్ స్పూన్- తేనె
1 టేబుల్ స్పూన్- కలబంద జెల్
1 టేబుల్ స్పూన్- కొబ్బరి నూనె
1 టేబుల్ స్పూన్- గుడ్డు పచ్చసొన
మాస్క్ తయారు చేసుకునే విధానం:
మీరు ఇంట్లోనే కెరాటిన్ మాస్క్ తయారు చేసుకోవాలనుకుంటే.. ముందుగా ఒక శుభ్రమైన గిన్నెలో పెరుగు తీసుకుని.. పైన తెలిపిన మోతాదులో తేనె, కలబంద జెల్, కొబ్బరి నూనె కలపండి. తర్వాత జుట్టు మృదువుగా మారడానికి.. ఈ గిన్నెలో గుడ్డు పచ్చసొన అంటే పసుపు భాగాన్ని మిక్స్ చేయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలపండి. తద్వారా అన్ని పదార్థాలు బాగా కలిసిపోతాయి.
ఎలా ఉపయోగించాలి ?
ఇప్పుడు ఈ హెయిర్ మాస్క్‌ను జుట్టుకు అప్లై చేయాల్సిన సమయం. కాబట్టి ముందుగా మీ జుట్టును సరిగ్గా దువ్వండి. తర్వాత ఈ మాస్క్‌ను జుట్టు మూలాల నుండి చివర్ల వరకు సరిగ్గా అప్లై చేయండి. మొత్తం జుట్టుకు అప్లై చేసిన తర్వాత..మాస్క్‌ను 30-45 నిమిషాలు అలాగే ఉంచండి. ఈ సమయంలో.. మీ జుట్టుకు మురికి అంటుకోకుండా షవర్ క్యాప్‌తో కప్పండి. 40 నిమిషాల తర్వాత.. మీ జుట్టును షాంపూతో వాష్ చేయండి. ఈ మాస్క్‌ను ఉపయోగించడం వల్ల మీ జుట్టు పట్టు కంటే మృదువుగా మారుతుంది. చూడటానికి చాలా బాగా బాగుంటుంది.
Also Read: ఇవి వాడితే జుట్టు రాలడం వెంటనే ఆగిపోతుంది. తెలుసా ?
ప్రయోజనాలు:
మీరు ఈ హెయిర్ మాస్క్‌ను వారానికి కనీసం రెండుసార్లు కూడా ఉపయోగించవచ్చు. దీనిని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల.. మీ జుట్టు సిల్కీగా మృదువుగా మారుతుంది. దీని తర్వాత.. మీకు ఎలాంటి కెరాటిన్ చికిత్స అవసరం ఉండదు. ఈ హెయిర్ మాస్క్ జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. అంతే కాకుండా జుట్టుకు తేమను కూడా అందిస్తుంది. కాబట్టి సమయం.. వృధా చేయకుండా.. పార్లర్‌లో డబ్బు ఖర్చు చేయడానికి బదులుగా, ఇంట్లో హెయిర్ మాస్క్‌ను తయారు చేసి జుట్టుకు అప్లై చేయండి. ఇవి జుట్టుకు అవసరం అయిన పోషణను అందిస్తాయి. అంతే కాకుండా జుట్టు సిల్కీగా మారేలా చేస్తాయి. హెయిర్ మాస్క్ తరచుగా వాడటం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.
Also Read: ముక్కుపై బ్లాక్ హెడ్స్ తగ్గాలంటే ? ఈ టిప్స్ ట్రై చేయండి