Dark Chocolate: డార్క్ చాక్లెట్ అంటే కేవలం రుచికరమైన స్వీట్ మాత్రమే కాదు. దీన్ని రోజూ కొద్దిగా తింటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కోకో బీన్స్‌తో తయారయ్యే ఈ చాక్లెట్‌లో చక్కెర తక్కువ, 70 శాతం కంటే ఎక్కువ కోకో ఉంటుందట. రోజుకు 1-2 ఔన్సులు తినడం వల్ల గుండె ఆరోగ్యం నుంచి చర్మ సౌందర్యం వరకూ అనేక ప్రయోజనాలు పొందొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం!
గుండెకు రక్షణ
డార్క్ చాక్లెట్‌లో ఫ్లేవనాయిడ్స్ అనే సూపర్ పవర్ ఉందట. ఇవి రక్తపోటును తగ్గించి, రక్త ప్రవాహాన్ని సాఫీగా చేస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. అంతేకాకుండా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గి, మంచి కొలెస్ట్రాల్ (HDL) పెంచేందుకు కూడా సహాయపడుతుందట. తరచుగా డార్క్ చాక్లెట్ తింటే గుండె జబ్బుల రిస్క్ తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీంతో రక్తం గడ్డకట్టే అవకాశం తగ్గుతుంది.
మెదడుకు బూస్ట్
బ్రెయిన్‌కి కూడా డార్క్ చాక్లెట్ బెస్ట్ ఫ్రెండ్ అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్ మెదడుకు రక్త సరఫరా పెంచి, జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను మెరుగుపరుస్తాయట. అంతేకాకుండా వయసు మీదపడుతున్నా మతిమరుపు రాకుండా కాపాడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. కొద్దిగా కెఫీన్, థియోబ్రోమిన్ కారణంగా చురుకుదనం, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయని అంటున్నారు. రోజూ ఒక ముక్క తింటే మైండ్ షార్ప్‌గా ఉంటుందట.
స్ట్రెస్ బై బై, హ్యాపీ వైబ్స్ హాయ్!
ఒత్తిడితో బాధపడుతున్నారా? డార్క్ చాక్లెట్ మీ మూడ్ లిఫ్టర్! ఇందులో ఎండార్ఫిన్, సెరోటోనిన్ వంటి హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి. మెగ్నీషియం ఆందోళన తగ్గించి, రిలాక్స్‌గా ఉంచుతుంది. రోజు చివర్లో ఒక చిన్న చాక్లెట్ ముక్క తింటే స్ట్రెస్ మాయం, సంతోషం బరిలోకి!
చర్మానికి గ్లో
డార్క్ చాక్లెట్ చర్మాన్ని కూడా కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ ఎండ, కాలుష్యం నుంచి చర్మాన్ని రక్షిస్తాయట. రక్త ప్రవాహం మెరుగై చర్మం తేమగా, కాంతివంతంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ముడతలు తగ్గి, చర్మం స్మూత్‌గా కనిపిస్తుంది.
పోషకాల పవర్‌హౌస్
డార్క్ చాక్లెట్‌లో ఐరన్, మెగ్నీషియం, ఫైబర్, విటమిన్ K, E వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి రక్త ఆరోగ్యం, కండరాలు, జీర్ణక్రియకు సాయం చేస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. 70% కోకో ఉన్న చాక్లెట్ ఎంచుకుంటే చక్కెర తక్కువగా, పోషణ ఎక్కువగా లభిస్తుందని అంటున్నారు.
ఎలా ఎంచుకోవాలి?
కనీసం 70% కోకో ఉన్న డార్క్ చాక్లెట్ కొనడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే వీటిలో చక్కెర, ఆర్టిఫిషియల్ షుగర్స్ చాలా తక్కువ ఉండేలా చూసుకోవాలి.