చాన్నాళ్ల తర్వాత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియా ముందుకొచ్చారు. వైసీపీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో జగన్ చోటివ్వడంతో ఆయన కాస్త యాక్టివ్ అయినట్టు తెలుస్తోంది. ఓటమి తర్వాత దాదాపుగా అనిల్ నెల్లూరులో మొహం చూపించడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు కూడా అన్యమనస్కంగానే మీడియా ముందుకొచ్చిన అనిల్, రాష్ట్రంలో మైనింగ్ మాఫియా ఉందంటున్నారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డిపై విమర్శలతో విరుచుకుపడ్డారు. తాను నోరు తెరిస్తే చాలామంది జాతకాలు బయటకొస్తాయని హెచ్చరించారు. అంతా బాగానే ఉంది కానీ, ఆయన కోపానికి అసలు కారణం వేరే ఉంది. ఆమధ్య వైసీపీలో ఉండగా తన బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ తో ఆయనకు గొడవలు మొదలయ్యాయి. అనిల్ తో విభేదించి రూప్ కుమార్ వైసీపీ నుంచి బయటకు వచ్చి టీడీపీలో చేరారు. వేమిరెడ్డి అనుచరుడిగా ఇప్పుడు బిజినెస్ వ్యవహారాల్లో మునిగిపోయారు. వచ్చే ఎన్నికలనాటికి తన ప్రత్యర్థి ఆర్థికంగా బలపడితే, తాను ఇబ్బంది పడతానని గ్రహించిన అనిల్, మైనింగ్ మాఫియా అంటూ కొత్త స్టోరీ మొదలు పెట్టారు.
నన్ను అరెస్ట్ చేస్తే..! చాలా మంది పేర్లు బయటపెడతా😲Anil Kumar Yadav's shocking comments YCP #tdp #cbn #naralokesh #anilkumaryadav #anilkumaryadavcomments #anilkumaryadavshockingcommentsonpawankalyan #anilkumaryadavspeech pic.twitter.com/bguyqzhowD
— i_am_with_lokesh🔥 (@iam_with_lokesh) May 5, 2025
ప్లాన్ ఎ..
నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అనిల్ గెలిచే అవకాశం లేదని గ్రహించిన జగన్ గత ఎన్నికల్లో ఆయన్ను నర్సరావు పేట పంపించారు. కానీ అక్కడ కూడా ఆయన ఓడిపోయారు. తీరా ఇప్పుడు నెల్లూరు వచ్చి రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అనిల్ ఓ రేంజ్ లో మాట్లాడేవారు. లోకేష్ ని, చంద్రబాబుని ఇష్టం వచ్చినట్టు తిట్టేవారు. అసెంబ్లీలోనే బుల్లెట్ దిగిందా లేదా అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడారు. తీరా పోలవరం విషయంలో అనిల్ గాలి తీసేశారు జగన్. రెండో విడతలో అనిల్ కి మంత్రి పదవి తీసేయడంతో ఆయన హవా తగ్గింది. ఆ తర్వాత నెల్లూరు జిల్లాలో మంత్రి పదవి తెచ్చుకున్న కాకాణి గోవర్దన్ రెడ్డి హవా మొదలైంది. దీంతో అనిల్ కాస్త వెనక్కి తగ్గారు. సొంత పార్టీలోనే తనకు పరపతి లేదని చివర్లో నొచ్చుకున్నారు. కానీ అనిల్ కి ఒక విషయం క్లారిటీగా తెలుసు. ఆయనకి వైసీపీ మినహా ఇక ఏ పార్టీలోనూ ఛాన్స్ లేదు. ఉంటే వైసీపీలోనే ఉండాలి, లేకపోతే రాజకీయాలకు దూరం కావాలి. అందుకే జగన్ కి విధేయుడిగా అక్కడే ఉన్నారు. ఇప్పుడు నెల్లూరు రాజకీయాల్లో తిరిగి క్రియాశీలం కావాలనుకుంటున్నారు. అందుకే ఎంపీ వేమిరెడ్డిని టార్గెట్ చేస్తూ ప్రెస్ మీట్ పెట్టారు.
ప్లాన్ బి..
అనిల్ సొంత నియోజకవర్గం నెల్లూరు టౌన్ లో ఆయన ఇమేజ్ పూర్తిగా డ్యామేజీ అయింది. ప్రత్యర్థి మంత్రి నారాయణ దూసుకెళ్తున్నారు. అనిల్ కి సొంత పార్టీలోనే పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి రూపంలో ప్రత్యర్థి తయారయ్యారు. దీంతో అనిల్ కి ఏం చేయాలో అర్థం కావడం లేదు. అయితే ఇప్పుడు ఓ లక్కీ ఛాన్స్ దొరికింది. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కాకాణి గోవర్దన్ రెడ్డి, అక్రమ మైనింగ్ కేసులో అదృశ్యమయ్యారు. ఆయన లేని లోటు స్పష్టంగా కనపడుతోంది. ఈ దశలో అనిల్ తిరిగి యాక్టివ్ కావాలనుకుంటున్నారు. కాకాణి లేకపోవడంతో జిల్లా పార్టీపై పట్టు సాధించాలనుకుంటున్నారు అనిల్. అందుకే ఈ హడావిడి అంతా.
నెల్లూరు నగరంలో గతంలో అనిల్ కుమార్ యాదవ్, రూప్ కుమార్ యాదవ్ ఒకే మాటపై ఉండేవారు. అనిల్ వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలవడంలో రూప్ కుమార్ పాత్ర కూడా ఉంది. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి రూప్ పార్టీ మారారు. టీడీపీలో చేరారు. తన రైట్ హ్యాండ్ లాంటి రూప్ లేకపోవడంతో గత ఎన్నికల్లో అనిల్ ఇబ్బంది పడ్డారు. ఏకంగా నెల్లూరు నుంచి వలస పోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఎంపీ వేమిరెడ్డి సహకారంతో రూప్ కుమార్ యాదవ్ ఆర్థికంగా బలపడుతుండటంతో అనిల్ ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అందుకే మైనింగ్ మాఫియా అంటూ గందరగోళం సృష్టించడానికి ఆయన రెడీ అయ్యారు.