Pakistani umpire in Blind Asia Cup 2026 Celebration: బ్లైండ్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ ( Blind Asia Cup 2026) విజేతగా పాకిస్తాన్ అంధుల క్రికెట్ జట్టు నిలిచిన సంగతి తెలిసిందే. శుక్రవారం జరుగాల్సిన బ్లైండ్ ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్ వర్షార్పణం కావడంతో టీమిండియా, పాకిస్తాన్ అంధుల మ్యాచ్ రద్దు చేస్తూ ప్రకటించారు. ఈ తరుణంలోనే వరల్డ్ బ్లైండ్ క్రికెట్ కౌన్సిల్, పాక్ అంధుల క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు సయ్యద్ సుల్తాన్ షా ఆదేశాల మేరకు పాకిస్తాన్ జట్టును ఛాంపియన్ గా చేస్తూ ప్రకటన చేశారు.
దీంతో పాకిస్తాన్ అంధుల క్రికెట్లు ట్రోఫీ తీసుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఓ వివాదం రాజుకుంది. ఈ టోర్నమెంట్ రిఫరీగా వ్యవహరించిన ఓ అంపైర్… టైటిల్ సెలబ్రేషన్స్‌లో (Pakistani umpire in Blind Asia Cup 2026 Celebration) పాల్గొన్నాడు. పాకిస్తాన్ క్రికెటర్లతో పాటు చిందులు వేస్తూ రచ్చ చేశాడు. ఇండియన్ జెట్స్ పేల్చేశామంటూ వివాదస్పద సంజ్ఞలు ఓవరాక్షన్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అంపైర్ కూడా పాకిస్తాన్ వాడేనని గుర్తించిన టీమిండియా అంధుల క్రికెట్ యాజమాన్యం.. అతనిపై ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
బ్లైండ్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ ( Blind Asia Cup 2026) విజేతగా పాకిస్తాన్ నిలిచిన తరుణంలోనే ఆ జట్టు ప్లేయర్లు ట్రోఫీని అందుకున్నారు. దీంతో అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమాన్ని టీమిండియా బ్లైండ్ క్రికెట్ జట్టు వాకౌట్ చేసింది. అటు ట్రోఫీ తీసుకున్న పాకిస్తాన్ అంధుల క్రికెటర్లు హరీస్ రౌఫ్ తరహాలోనే వివాదస్పద సెలబ్రేషన్స్ చేసారు. ఇండియాకు సంబంధించిన యుద్ధ విమానాలు కూల్చేశామని, చేతులతో సైగలు చేస్తూ రెచ్చిపోయారు.
పాక్ అంధుల క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు సయ్యద్ సుల్తాన్ షా (Syed Sultan Shah), నఖ్వీ లాగానే వరల్డ్ బ్లైండ్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ పదవిలో ఉన్నాడు. ఈ తరుణంలోనే వర్షం పడి మ్యాచ్ రద్దయినా, ఏక పక్షంగా నిర్ణయం తీసుకుని.. పాకిస్తాన్ జట్టును విజేతగా ప్రకటించాడని టీమిండియా అంధుల క్రికెట్ జట్టు ఆరోపిస్తోంది. ఫైనల్ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారితే రిజర్వ్ డే లేదా ఇరు జట్లను ఛాంపియన్ గా ప్రకటించే అవకాశాలు ఉంటాయని పేర్కొంటున్నారు. కానీ సయ్యద్ సుల్తాన్ షా తప్పుడు నిర్ణయం తీసుకుని పాక్ కు టైటిల్ ( Blind Asia Cup 2026) ఇచ్చేశాడని ఆగ్రహిస్తున్నారు.
Pakistani umpire who officiated throughout the Blind Asia Cup 2026, was seen celebrating with Pakistan Blind team 🤨
The Umpire must remain neutral, but he’s a Pakistani, so you won’t expect principles from them 😅
A must watch 👇🏻 pic.twitter.com/0cpFdGvYCw
— Ajay Jadeja (@AjayJadeja171) November 21, 2026