Hair Spa At Home: పొడవాటి ఒత్తైన జుట్టు మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది. అంతే కాకుండా మీ వ్యక్తిత్వాన్ని కూడా పెంచుతుంది. పొడి బారిన నిర్జీవమైన జుట్టు మూల నుండి బలహీనంగా మారుతుంది. అంతే కాకుండా సులభంగా రాలిపోతుంది. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం ఒక్కటే హెయిర్ స్పా.
జుట్టుకు పోషణను అందించడంలో హెయిర్ స్పా చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ఇది జట్టు చివర్లు కూడా చిట్లకుండా కాపాడుతుంది. బట్టతల సమస్యలను కూడా తగ్గిస్తుంది. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న హెయిర్ స్పా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
హెయిర్ స్పా తయారు చేయడానికి మీరు పార్లర్‌కు వెళ్లవలసిన అవసరం లేదు కొన్ని టిప్స్ పాటించి మీరు కూడా మీరు ఇంట్లోనే సులభంగా హెయిర్ స్పా కూడా చేసుకోవచ్చు.
ఇంట్లో హెయిర్ స్పా ఎలా చేయాలి ?
కావలసినవి:
హెయిర్ ఆయిల్
షాంపూ
కండిషనర్
హెయిర్ మాస్క్
హెయిర్ స్పా స్టెప్స్:
1. తలకు మసాజ్ చేయండి:
హెయిర్ స్పా చేయడానికి ముందుగా మీ తలకు మసాజ్ చేయండి. మసాజ్ కోసం కొబ్బరి లేదా ఆలివ్ నూనె వాడండి. నూనెను గోరువెచ్చగా అప్లై చేసిన తర్వాత చేతులతో తలకు 15 నుండి 20 నిమిషాలు మసాజ్ చేయండి. ఆయిల్ మసాజ్ వల్ల రక్త ప్రసరణ సక్రమంగా జరిగి జుట్టు పెరుగుదల కూడా సక్రమంగా ఉంటుంది.
2. మసాజ్ తర్వాత జుట్టుకు ఆవిరి పట్టండి:
మసాజ్ చేసిన తర్వాత మీ జుట్టుకు ఆవిరి పట్టండి. ఆవిరి పట్టడానికి మందపాటి కాటన్ టవల్‌ను వేడి నీటిలో ముంచి దాన్ని పిండుకుని ఆ టవల్‌ను జుట్టు చుట్టూ బాగా చుట్టండి. మీ తల చుట్టూ 5 నుండి 10 నిమిషాలు వేడి టవల్ చుట్టుకోండి. ఇది మీ తలపై ఉన్న నూనె మూలాలను చేరేలా చేస్తుంది.
3. మీ జుట్టును వాష్ చేయండి:
మీ జుట్టుకు ఆవిరి పట్టిన తర్వాత షాంపూతో మీ జుట్టును వాష్ చేయండి. మీరు చలికాలంలో గోరు వెచ్చని నీటిని ఉపయోగించవచ్చు.
మీ జుట్టుకు షాంపూ చేసిన తర్వాత మీ జుట్టుకు మంచి నాణ్యత గల కండిషనర్‌ను అప్లై చేయండి. మీరు కండిషనర్ వాడకూడదని అనుకుంటే మాత్రం మరిగించిన డికాషన్ లో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి జుట్టుకు అప్లై చేసి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో వాష్ చేయండి.
Also Read: ఈ నేచురల్ హెయిర్ కలర్‌తో.. క్షణాల్లోనే తెల్ల జుట్టు నల్లగా మారడం ఖాయం
4. హెయిర్ మాస్క్ అప్లై చేయండి:
జుట్టుకు హెయిర్ మాస్క్ వేయడం అనేది హెయిర్ స్పాలో చివరి దశ. మీరు ఇంట్లో కూడా హెయిర్ మాస్క్ తయారు చేసుకోవచ్చు. హెయిర్ మాస్క్ తయారు చేయడానికి ఒక ప్లాస్టిక్ గిన్నెలో రెండు గుడ్లు, ఒక టీస్పూన్ తేనె , కొద్దిగా కొబ్బరి నూనె కలపండి. కనీసం 30 నిమిషాల పాటు కొద్దిగా తడిగా ఉన్న జుట్టు మీద హెయిర్ మాస్క్‌ను అప్లై చేయండి. తర్వాత మీ జుట్టును షాంపూతో వాష్ చేయండి. ఈ విధంగా మీ హెయిర్ స్పా పూర్తవుతుంది. ఇది మీ జుట్టుకు చాలా ప్రయోజనాలను కలిగిస్తుంది. అంతే కాకుండా జుట్టు రాలకుండా కాపాడుతుంది.