BigTV English

Dark Elbows: ఇలా చేస్తే.. మోచేతులపై ఉన్న నలుపు మాయం !

Dark Elbows: ఇలా చేస్తే.. మోచేతులపై ఉన్న నలుపు మాయం !

Dark Elbows: మోచేతులు నల్లబడటం అనేది సాధారణ సమస్య. ఇది ఎండలో ఎక్కువ సమయం గడపడం, మృత కణాలు పేరుకుపోవడంతో పాటు మరిన్ని కారణాల వల్ల వస్తుంది. ఇది తీవ్రమైన సమస్య కాకపోయినా చర్మానికి అంత మంచిది కాదు. ఇది చేతుల అందాన్ని కూడా పాడు చేస్తాయి. ఈ సమస్య నుండి బయట పడటానికి అంతే కాకుండా కొన్ని రకాల హోం రెమెడీస్ చాలా బాగా ఉపయోగపడతాయి. మరి ఎలాంటి హోం రెమెడీస్ వాడితే.. మోచేతులపై ఉన్న నలుపు తొలగిపోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.


మోచేతులపై ఉన్న నల్లదనాన్ని తొలగించడంలో హోం రెమెడీస్ చాలా ప్రభావ వంతంగా పని చేస్తాయి. అంతే కాకుండా ఇవి మీ చర్మానికి హాని కలిగించకుండా రంగును మెరుగుపరచడంలో కూడా సహాయం చేస్తాయి.

నల్లటి మోచేతులను మెరిపించే చిట్కాలు:


నిమ్మకాయ, చక్కెర మిశ్రమం:
నిమ్మకాయ సహజ బ్లీచింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. చక్కెర స్క్రబ్ లాగా కూడా పనిచేస్తుంది. నిమ్మరసంలో చక్కెర కలిపి మోచేయిపై బాగా రుద్దాలి. ఇది డెడ్ స్కిన్ ను తొలగించి మోచేతులపై ఉన్న చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. 10-15 నిమిషాలు అప్లై చేసిన తర్వాత, సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి 2-3 సార్లు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

పెరుగు, పసుపు:
పెరుగులోని లాక్టిక్ ఆమ్లం చర్మాన్ని మృదువుగా చేస్తుంది. పసుపులో శోథ నిరోధక లక్షణాలు ఉంటాయి. పెరుగులో పసుపు కలిపి పేస్ట్ లాగా చేసి, మోచేయి మీద 15-20 నిమిషాలు ఉంచండి. తరువాత గోరువెచ్చని నీటితో వాష్ చేయండి. ఈ రెమెడీ చర్మం రంగును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా మోచేతులను మృదువుగా చేస్తుంది.

బేకింగ్ సోడా, నీరు:
బేకింగ్ సోడా ఒక మంచి ఎక్స్‌ఫోలియేటర్, ఇది మృత చర్మాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. బేకింగ్ సోడా, నీటిని పేస్ట్ లా చేసి, మోచేతులపై 5-10 నిమిషాలు రుద్దండి. దీని తర్వాత గోరువెచ్చని నీటితో వాష్ చేయండి. ఈ పద్ధతి మోచేతుల నల్లదనాన్ని తగ్గించడమే కాకుండా చర్మాన్ని శుభ్రంగా, మృదువుగా చేస్తుంది.

అలోవెరా జెల్:
అలోవెరా జెల్ చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇది యాంటీఆక్సిడెంట్ , హైడ్రేటింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇది చర్మానికి తేమను అందిస్తుంది. తాజా కలబంద జెల్‌ను మోచేయిపై అప్లై చేసి, 15-20 నిమిషాలు అలాగే ఉంచి, తర్వాత వాష్ చేయండి. ఇలా రోజూ చేయడం వల్ల మోచేయి చర్మం రంగు మారి, చర్మం మృదువుగా ఉంటుంది.

కొబ్బరి నూనె:
కొబ్బరి నూనె సహజ మాయిశ్చరైజింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది చర్మానికి లోతైన తేమను అందిస్తుంది. అంతే కాకుండా దీన్ని క్రమం తప్పకుండా వాడటం వల్ల చర్మం పొడిబారడం, నల్లబడటం తగ్గుతుంది. మోచేతులపై కొబ్బరి నూనె రాసి సున్నితంగా మసాజ్ చేసి రాత్రంతా అలాగే ఉంచండి. ఇలా రోజూ చేయడం వల్ల మోచేతుల చర్మం మృదువుగా , ప్రకాశవంతంగా మారుతుంది.

Also Read: బాగా నిద్ర పట్టాలంటే ఏం తినాలి ? ఏం తినకూడదో తెలుసా ?

ఓట్ మీల్ స్క్రబ్:
ఓట్ మీల్ లో ఎక్స్ ఫోలియేటింగ్ , స్క్రబ్బింగ్ లక్షణాలు ఉంటాయి. ఇవి చనిపోయిన చర్మ కణాలను తొలగించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా ఓట్ మీల్ , తేనె కలిపి పేస్ట్ లా చేసి మోచేతులపై బాగా రుద్దండి. 10-15 నిమిషాలు అలాగే ఉంచి, తర్వాత కడిగేయండి. ఈ స్క్రబ్ చర్మాన్ని శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా మోచేతులపై ఉన్న నల్లదనాన్ని తగ్గిస్తుంది.

 

Tags

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×