CM Revanth Reddy: వనపర్తి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ది పనులకు, అలాగే వనపర్తి నియోజకవర్గంలో రూ.721 కోట్ల అభివృద్ది పనులకు సీఎం సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వనపర్తిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడారు.
‘వనపర్తితో నాకు ఎంతో అనుబంధం ఉంది. నాకు వనపర్తి చదువుతో పాటు సంస్కారం నేర్పింది. వనపర్తి మాజీ ఎమ్మెల్యే ఇక్కడి రాజకీయాలను కలుషితం చేశారు. ఈ ప్రాంత అభివృద్ది కోసం కాంగ్రెస్ నీటి ప్రాజెక్టులు నిర్మించింది. వనపర్తిలో గతంలో ధన ప్రభావం, కక్ష రాజకీయాలు ఉండేవి కావు. వనపర్తి విద్యార్థిగా తెలంగాణకు కీర్తి తెచ్చేలా పని చేస్తా. బీఆర్ఎస్, బీజేపీ ఏకమై రైతులను మభ్య పెట్టాలని చూస్తున్నాయి. రూ.21వేల కోట్ల రుణమాఫీ జరిగిందా.. లేదా..? రైతులను అడగండి. వనపర్తి ఆత్మగౌరవం నిలబట్టే విధంగా అభివృద్ది చేసి చూపిస్తా. వనపర్తి విద్యార్థిగా తెలంగాణకు కీర్తి తెచ్చేలా పని చేస్తా’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ALSO READ: Warangal Airport: మనకు స్వాతంత్ర్యం రాకముందే వరంగల్ ఎయిర్‌పోర్ట్ ఫేమస్: మంత్రి రామ్మోహన్ నాయుడు
‘రైతు భరోసా డబ్బులు రైతుల అకౌంట్లలో వేశాం. 200 యూనిట్ల కరెంట్ ఇచ్చింది నిజం కాదా..? రూ.500 కే గ్యాస్ సిలిండర్ ఆడబిడ్డలకు ఇస్తున్నాం. ఆడబిడ్డలు బీఆర్ఎస్, బీజేపీ నేతలకు చలాకీ కాల్చి వాత పెట్టండి. మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. కేసీఆర్ గ్రహణం పట్టి గతంలో డ్వాక్రా సంఘాలు నిర్వీర్యమయ్యాయి. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలని ప్రయత్నిస్తున్నాం. బీజేపీ, బీఆర్ఎస్ అభివృద్ది పనులను అడ్డుకుంటున్నాయి’ అని సీఎం చెప్పుకొచ్చారు.
‘డ్వాక్రా సంఘాలకు శిల్పారామంలో మూడున్నర ఎకరాలు ఇచ్చాం. 150 షాపులలో అక్కడ డ్వాక్రా మహిళలు ఉత్పత్తులు విక్రయిస్తున్నారు. మహిళలు సోలార్ ఉత్పత్తి చేసేలా ప్రోత్సహిస్తున్నాం. 4లక్షల 50వేల ఇళ్లు ఆడబిడ్డలకు మంజూరు చేశాం. పదేళ్లలో కేసీఆర్ ఒక్క ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారా..? ఏడాదిలో 55,163 ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చాం. పాలమూరు బిడ్డల గురించి కేసీఆర్ ఏనాడైనా పట్టించుకున్నారా..? పాలమూరు ద్రోహి కేసీఆర్. మీ హరికథలు, పిట్ట కథలు నడవవు కేసీఆర్. సమయం చూసి ఎలా వాత పెట్టాలో మాకు తెలుసు. ఎస్‌ఎల్‌బీసీ ఘటనపై సీఎం మాట్లాడారు. 8 మంది చనిపోవడానికి కారణం నువ్వు కాదా కేసీఆర్..!’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
‘మేం 22 వేల టీచర్లకు ప్రమోషన్లు, 35 వేల టీచర్లకు బదిలీలు చేసి వారి సమస్యలు పరిష్కరించాం. పదేళ్ల పాటు కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకుని ప్రజల గురించి ఆలోచించలేదు. పదేళ్లలో ప్రాజెక్టులు కడితే మా పాలమూరు ప్రజలు ఎందుకు వలస పోతున్నారు. వలసలు పోతున్న పాలమూరు ప్రజల గురించి కేసీఆర్ ఏనాడైనా ఆలోచన చేశారా..? పదేళ్లలో పాలమూరును ఎందుకు పూర్తి చేయలేదు.. బీమా, కల్వకుర్తి, నెట్టంపాడు ఎందుకు పూర్తి చేయలేదు..? ఆర్డీఎస్ ఎందుకు ఎండిపోయింది..? ఎస్‌ఎల్‌బీసీ పదేళ్ల పాటు పడాగ పెట్టడంతో కుప్పకూలిపోయింది.. ఈ పాపం కేసీఆర్ ది కాదా..? ఆంధ్రావాళ్లు రాయలసీమకు నీళ్లు తరలించుకుపోతుంటే గుడ్లప్పగించి కుంటు కేసీఆర్ చూడలేదా..? ప్రగతి భనవ్ కు జగన్ ను పిలిచి పంచభక్ష పరమాన్నం పెట్టి రాయలసీమ ఎత్తిపోతలకు పునాది రాయి వేసింది కేసీఆర్ కాదా..?’ అని సీఎం ప్రశ్నించారు.
ALSO READ: PNB Recruitment: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో భారీగా ఉద్యోగాలు.. జీతమైతే అక్షరాల రూ.1,05,280
రోజమ్మ ఇంటికి పోయి రొయ్యల పులుసు తిని రాయలసీమ రతనాల సీమ చేస్తానని కేసీఆర్ అనలేదా..? మహబూబ్ నగర్ ప్రజలు నిన్ను గుండెల్లో పెట్టుకొని ఎంపీ గా గెలిపించుకుంటే కేసీఆర్ ఏం చేశావు..? పాలమూరు ద్రోహి కేసీఆర్.. కృష్ణా జలాలు ఆంధ్రా తరలించుకు పోతున్నారంటే దానికి కారణం కేసీఆర్ దుర్మార్గం వల్లనే. కృష్ణా జలాల కేటాయింపులో తెలంగాణ కు అన్యాయం జరిగేలా సంతకం పెట్టిన దుర్మార్గుడు కేసీఆర్.. ఆ సంతకమే తెలంగాణకు యమపాశంగా మారింది. పాలమూరు రుణం తీర్చుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాను. పాలమూరు ను పడాగ పెట్టింది కేసీఆరే.. నమ్మినందుకు నట్టేట ముంచాడు’ అని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.