Sandeep Reddy Vanga: ఉన్నది ఉన్నట్టుగా రఫ్‌గా మాట్లాడే దర్శకులు ఇండస్ట్రీలో చాలా తక్కువమంది ఉంటారు. ఇక ఈ జెనరేషన్‌లో అలాంటి డైరెక్టర్ ఎవరు అంటే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు సందీప్ రెడ్డి వంగా. ‘అర్జున్ రెడ్డి’ లాంటి కాంట్రవర్షియల్ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు సందీప్. ఆ సినిమాను ప్రమోట్ చేస్తున్న సమయంలోనే తన యాటిట్యూడ్, ఆఫ్ స్క్రీన్ కాన్ఫిడెన్స్ చూసి సందీప్‌కు చాలామంది యూత్ ఫిదా అయ్యారు. ఇక ఒక్కొక్క సినిమాకు తనకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూ పోతోంది తప్పా తగ్గడం లేదు. తాజాగా సందీప్ పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో అసలు ‘యానిమల్’ కోసం రణబీర్‌ను ఎందుకు ఎంపిక చేశాడో బయటపెట్టాడు.
యాక్టింగ్ ఇష్టం
సందీప్ రెడ్డి వంగా చివరిగా రణబీర్ కపూర్ (Ranbir Kapoor)తో ‘యానిమల్’ (Animal) అనే సినిమా తెరకెక్కించాడు. ఆ సినిమా హిందీలోనే కాదు.. దేశవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్ హిట్‌ను సాధించింది. దీంతో సందీప్ రెడ్డి వంగా రేంజ్ మరింత పెరిగిపోయింది. అయితే రణబీర్ కపూర్ లాంటి సాఫ్ట్ ఇమేజ్ ఉన్న హీరోను ఈ మూవీలో హీరోగా ఎంపిక చేయడానికి కారణమేంటో తాజాగా బయటపెట్టాడు సందీప్. ‘‘నేను తన ముందు సినిమాలు చూసినప్పుడు ఆ కోపం, ఆవేశం తన యాక్టింగ్‌లో స్పష్టంగా కనిపించేవి. తన మొదటి సినిమా నుండి నాకు రణబీర్ యాక్టింగ్ అంటే ఇష్టం. నేను కథ రాసుకున్న తర్వాత రణబీర్‌ను ఎంపిక చేసుకోలేదు. ముందు నుండి తనే నా మైండ్‌లో ఉన్నాడు’’ అని చెప్పుకొచ్చాడు.
ముందే చెప్పాను
‘‘నేను యానిమల్ ఐడియా వచ్చినప్పుడే రణబీర్‌కు చెప్పాను. తనకు కూడా అది బాగా నచ్చింది. అలా నేను స్క్రీన్‌ప్లే రాయడం మొదలుపెట్టిన తర్వాత అది పూర్తి చేయడానికి నాకు సంవత్సరం పట్టింది. ప్రతీ సీన్ తనను ఊహించుకునే రాశాను’’ అని బయటపెట్టాడు సందీప్ రెడ్డి వంగా. మామూలుగా తను ఏ హీరో కోసం అయితే కథ రాసుకుంటాడో.. ఆ హీరోతోనే కచ్చితంగా ఆ సినిమాను తెరకెక్కించడం సందీప్ రెడ్డి వంగాకు ముందు నుండి అలవాటే. అలాగే ‘యానిమల్’ను రణబీర్ కోసమే రాసుకున్నానని తాజాగా క్లారిటీ ఇచ్చాడు ఈ యంగ్ డైరెక్టర్. అంతే కాకుండా ఫిల్మ్ మేకింగ్‌పై తన స్టైల్‌లో పలు కాంట్రవర్షియల్ కామెంట్స్ కూడా చేశాడు.
Also Read: అవకాశాల కోసం అలా చేయాలి, బాలీవుడ్‌కు వెళ్లింది అందుకే.. పూజా హెగ్డే కామెంట్స్
క్రిమినల్ పని చేయలేదు
‘యానిమల్’ సినిమాపై ఒక ఐఏఎస్ ఆఫీసర్ నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్‌ను మరోసారి గుర్తుచేసుకున్నాడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). ‘‘నేనేదో క్రిమినల్ పని చేశాను అన్నట్టుగా ఆ అధికారి మాట్లాడారు. తను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడం కోసం కష్టపడి చదివాడు. నేనేం అనుకుంటా అంటే ఢిల్లీ వెళ్లి ఒక ఇన్‌స్టిట్యూషన్‌లో జాయిన్ అయ్యి 2,3 ఏళ్లు కష్టపడితే ఐఏఎస్ అయిపోవచ్చు. దానికి చదవాల్సిన బుక్స్ చాలా లిమిటెడ్ ఉంటాయి. దాదాపు 1500 బుక్స్ చదివితే ఐఏఎస్ అయిపోవచ్చు కదా. కానీ ఫిల్మ్ మేకింగ్ విషయంలో అలా కాదు. ఇది నేర్పించడానికి టీచర్స్ ఉండరు’’ అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగా. ఈ కామెంట్స్ చాలామందికి నచ్చలేదు.