Sleep: మంచి నిద్ర పొందడంలో ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కొన్ని ఆహార పదార్థాలు నిద్రను మెరుగుపరుస్తాయి. అంతే కాకుండా మరికొన్ని రకాల ఆహార పదార్థాలు తినడం వల్ల నిద్రకు ఆటంకం కలుగుతుంది. నిద్ర లేమి సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. త్వరగా నిద్ర పోయేందుకు అవకాశాలు ఉంటాయి. మరి ఎలాంటి ఫుడ్ తినడం వల్ల నిద్ర ప్రేరేపించబడుతుంది. మంచి నిద్ర కోసం ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మనం ఏమి తినాలి ?
పాలు:
మంచి నిద్ర కోసం తినవలసిన ఆహారాలలో పాలు ముఖ్యమైనది. పాలలో ట్రిప్టోఫాన్, కాల్షియం ఉంటాయి. ఇవి మెదడులో మెలటోనిన్ (నిద్ర హార్మోన్) ఉత్పత్తిని పెంచుతాయి. పడుకునే ముందు ఒక గ్లాసు గోరు వెచ్చని పాలు తాగడం వల్ల హాయిగా నిద్రపడుతుంది. నిద్ర లేమి సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు ప్రతి రోజు పాలు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
కుంకుమపువ్వు, పసుపుతో పాలు:
పసుపులో శోథ నిరోధక లక్షణాలు ఉన్నాయి. కుంకుమ పువ్వు మానసిక ప్రశాంతతకు సహాయపడుతుంది. అంతే కాకుండా ఇది మెలటోనిన్ స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది. ఫలితంగా నిద్ర తొందరగా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి.
చిరోంజీ, బాదం:
చిరోంజి , బాదంపప్పులలో మెగ్నీషియం , ట్రిప్టోఫాన్ ఉంటాయి. ఇవి మంచి నిద్రకు మేలు చేస్తాయి. అంతే కాకుండా ఇవి నాడీ వ్యవస్థను ప్రశాంత పరుస్తాయి. ఇది రాత్రిపూట ప్రశాంతమైన నిద్ర పొందడానికి సహాయపడుతుంది.
వోట్మీల్:
ఓట్స్‌లో మంచి నిద్రకు అవసరమైన మెలటోనిన్, సెరోటోనిన్ వంటి అంశాలు ఉంటాయి. ఇవి శరీరంలోని శక్తిని నియంత్రించడంలో, ప్రశాంతతను కాపాడుకోవడంలో సహాయపడతాయి.
ఏం తినకూడదు ?
కెఫిన్ ఉన్న ఆహారాలు:
కెఫిన్ (టీ, కాఫీ, శీతల పానీయాలు) మానుకోండి. ఎందుకంటే ఇవి నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. వీటిని సాయంత్రం పూట అస్సలు తినకూడదు.
కారంగా ఉండే ఆహారాలు:
రాత్రిపూట కారంగా ఉండే ఆహారాలు తినడం మానుకోండి. ఎందుకంటే అవి గుండెల్లో మంట, ఆమ్లత్వం లేదా గ్యాస్ సమస్యలను కలిగిస్తాయి. అంతే కాకుండా ఇవి నిద్రకు అంతరాయం కలిగిస్తాయి.
తీపి పదార్థాలు:
ఎక్కువ చక్కెర లేదా స్వీట్లు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. ఇది శరీరాన్ని చురుగ్గా పని చేసేలా చేస్తుంది. అంతే కాకుండా ఇది నిద్రలేమి సమస్యలను కలిగిస్తుంది. పడుకునే ముందు స్వీట్లు తినడం వల్ల కూడా అద్భుత ప్రయోజనాలు ఉంటాయి.
Also Read: చెరకు రసం తాగితే.. శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే !
నూనె ఆహారం:
పడుకునే ముందు ఎక్కువ నీరు లేదా ద్రవాలు తాగకుండా ఉంటే మంచిది. ఎందుకంటే తరచుగా బాత్రూంకు వెళ్లాల్సిన అవసరం మిమ్మల్ని మేల్కొలిపే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే ఎక్కువగా నీరు తాగకుండా ఉంటేనే బెటర్.
సిట్రస్ పండ్లు:
నారింజ లేదా ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లను నిద్ర వేళకు ముందు తినడం మానుకోండి ఎందుకంటే వాటి ఆమ్ల లక్షణాలు కడుపు చికాకును కలిగిస్తాయి. అంతే కాకుండా మీ నిద్రకు అంతరాయం కలిగించవచ్చు. అంతే కాకుండా రాత్రి పూట సిట్రస్ పండ్లు తినడ వల్ల కూడా జలుబు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.