E-Paper
Advertisement

విరిగిపోయిన పాలతో ఇలా అంగూరీ రసమలై చేయండి.. బేకరీ స్టైల్ టేస్ట్ గ్యారెంటీ!

విరిగిపోయిన పాలతో ఇలా అంగూరీ రసమలై చేయండి.. బేకరీ స్టైల్ టేస్ట్ గ్యారెంటీ!
Advertisement

Angoori Rasmalai: ఎక్కువగా స్వీట్స్ క్రేవింగ్స్ ఉన్నవాళ్లకి ఒకే రకమైనవి తినాలంటే కాస్త బోరింగ్‌గా అనిపిస్తుంటుంది. ఈ క్రమంలో ఇంట్లోనే స్పెషల్‌గా ఏదైనా చేసుకోవాలనిపిస్తే.. ‘అంగూరి రసమలై’ ట్రై చేయవచ్చు. చిన్న చిన్న ద్రాక్ష పండ్ల ఆకారంలో ఉండే మృదువైన పనీర్ బాల్స్, చిక్కటి పాలలో నానుతూ వాటి రుచిని మరింత పెంచుతాయి. చూడటానికి ఎంత అందంగా ఉంటుందో.. తినడానికి కూడా అంతే రుచిగా ఉంటుంది. పండుగల సమయంలో, ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉన్నప్పుడు లేదా అతిథులు వచ్చినప్పుడు ఈ స్వీట్ తయారుచేసి పెడితే అందరూ ఇష్టంగా తింటారు. బయట స్వీట్ షాపుల్లో కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చు.

కావాల్సిన పదార్థాలు:

పనీర్ తయారీకి పాలు – ఒక లీటరు, నిమ్మరసం – రెండు టేబుల్ స్పూన్లు, నీరు – రెండు టేబుల్ స్పూన్లు, పంచదార – ఒక కప్పు, నీరు – నాలుగు కప్పులు, యాలకుల పొడి – అర టీస్పూన్, కుంకుమపువ్వు – కొన్ని రేకులు, బాదం పలుకులు – రెండు టేబుల్ స్పూన్లు, పిస్తా పలుకులు – రెండు టేబుల్ స్పూన్లు.

Advertisement

Also Read: పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తినే పుట్టగొడుగుల పాస్తా.. తయారీ విధానం మీ కోసం!

తయారీ విధానం:

ముందుగా ఒక గిన్నెలో పాలు పోసి బాగా మరిగించాలి. పాలు పొంగకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. పాలు మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, నిమ్మరసంలో కొద్దిగా నీళ్లు కలిపి పాలలో కొద్దికొద్దిగా వేయాలి. పాలు విరిగి, పన్నీర్ వేరుపడిన తర్వాత పలుచటి వస్త్రంలో వడకట్టాలి. చల్లటి నీటితో ఒకసారి కడిగి నిమ్మరసం వాసన పోయేలా చేయాలి. అనంతరం వస్త్రాన్ని కట్టి నీరు పూర్తిగా పోయే వరకు పక్కన ఉంచాలి.

Advertisement

ఇప్పుడు పన్నీర్‌ను ఒక ప్లేట్‌లోకి తీసుకుని చేతులతో మెత్తగా కలుపుతూ ముద్దలా చేయాలి. ఎలాంటి గడ్డలు లేకుండా మెత్తగా అయ్యాక చిన్న చిన్న ద్రాక్ష పండ్ల ఆకారంలో ఉండలు చుట్టుకోవాలి.

మరోవైపు ఒక గిన్నెలో పంచదార, నాలుగు కప్పుల నీళ్లు పోసి మరిగించాలి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత తయారుచేసుకున్న పనీర్ ఉండలను అందులో వేయాలి. మూత పెట్టి సుమారు 12 నుంచి 15 నిమిషాలు ఉడికించాలి. ఉండలు పరిమాణంలో పెద్దవిగా మారి మెత్తగా అవుతాయి.

ఇప్పుడు మరో గిన్నెలో పాలను చిక్కబడే వరకు మరిగించాలి. అందులో యాలకుల పొడి, కుంకుమపువ్వు, బాదం, పిస్తా పలుకులు వేసి కలపాలి. ఉడికించిన పనీర్ ఉండలను పంచదార పాకం నుంచి తీసి కొద్దిగా ఒత్తి అదనపు పాకాన్ని తొలగించి ఈ పాలలో వేయాలి.

చివరగా ఈ రసమలైని చల్లార్చి ఫ్రిజ్‌లో రెండు గంటలు ఉంచాలి. అంతే.. ఎంతో రుచికరమైన అంగూరి రసమలై సిద్ధం. చల్లచల్లగా సర్వ్ చేస్తే ఒక్కటి తింటే మరొకటి తినాలనిపించేలా ఉంటుంది.

Also Read: ఈసారి మసాలాతో కాదు, కొరియన్ సాస్‌తో చికెన్ ఫ్రై చేయండి.. క్రిస్పీ క్రిస్పీగా భలే ఉంటుంది!

Tags

Related News

పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తినే పుట్టగొడుగుల పాస్తా.. తయారీ విధానం మీ కోసం!

ఈసారి మసాలాతో కాదు, కొరియన్ సాస్‌తో చికెన్ ఫ్రై చేయండి.. క్రిస్పీ క్రిస్పీగా భలే ఉంటుంది!

గాలి కాలుష్యంతో రక్తంలో షుగర్ పెరిగే ప్రమాదం.. బెడ్ రూంలో ఇలా చేయండి చాలు

డేటింగ్ యాప్ ఉపయోగించండి.. పెళ్లి కుదరకపోతే డబ్బులు రీఫండ్

అందగాళ్లు, శ్రీమంతులు కాదు.. ఈ 6 గుణాలున్న అబ్బాయిలంటేనే అమ్మాయిలకు పిచ్చి!

సోషల్ మీడియా ఇష్టంలేని బాయ్‌ఫ్రెండ్.. రీల్స్ అంటే పడిచచ్చే గర్ల్‌ఫ్రెండ్.. ప్రేమ నిలుస్తుందా?

పిల్లలు అన్ని రంగాల్లో రాణించాలని తపనపడుతున్నారా? తల్లిదండ్రులు చేసే తప్పులు ఇవే

Big Stories

Advertisement
×