OBC Census: రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనను బీజేపీ నేతలు అడ్డుకోవాలని చూస్తే, ఢిల్లీ నుంచి వచ్చే బీజేపీ నాయకులను తెలంగాణలో అడుగు పెట్టనివ్వమని వి హనుమంత రావు హెచ్చరించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న జనగణనలో ఓబీసీ (బీసీ గణన వివరాలను ఎందుకు చేర్చలేదో కేంద్ర బీజేపీ ప్రభుత్వం జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.
వెనుకబడిన వర్గాల (బీసీ) హక్కుల విషయంలో బీజేపీకి ఉన్న నిజ స్వరూపం ఓబీసీ జనగణన చేయకపోవడం ద్వారా బయటపడిందని విమర్శించారు. గ్రామాలకు వచ్చే బీజేపీ నాయకులను ఓబీసీ గణన విషయంపై గ్రామాల్లో నిలదీయాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణకు వచ్చినప్పుడు మేము ఎప్పుడైనా అడ్డుకున్నామా అని బీజేపీ నాయకులను ప్రశ్నించారు. రాజకీయాల్లో హుందాతనం ఉండాలని, బీజేపీ నేతల బెదిరింపులకు కాంగ్రెస్ ఏమాత్రం భయపడదని స్పష్టంగా చెప్పారు.
రాష్ట్రంలో అప్పుల భారం ఉన్నప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఆపకుండా నడుపుతోందని చెప్పారు. అగ్రనాయకత్వం పై ప్రతిపక్షాలు చేస్తున్న అనుచిత దాడులను నేరుగా తిప్పికొడుతూ నాయకత్వానికి పూర్తి మద్దతు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ప్రజల సమస్యలను & బీసీ వర్గాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. వ్యక్తిగత & దాడి చేసే వ్యాఖ్యలను ఆపి, ప్రజా సమస్యలు మరియు అభివృద్ధిపై మాట్లాడాలని ప్రతిపక్ష పార్టీలకు సూచించారు.
Also Read: లాయర్ స్థానంలో నిందితుడిగా నిలబడితే… తన కేసులో తానే నిందితుడు… క్రేజీ కోర్ట్‌రూమ్ థ్రిల్లర్