E-Paper
Advertisement

ఈసారి మసాలాతో కాదు, కొరియన్ సాస్‌తో చికెన్ ఫ్రై చేయండి.. క్రిస్పీ క్రిస్పీగా భలే ఉంటుంది!

ఈసారి మసాలాతో కాదు, కొరియన్ సాస్‌తో చికెన్ ఫ్రై చేయండి.. క్రిస్పీ క్రిస్పీగా భలే ఉంటుంది!
Advertisement

Korean Fried Chicken: కొత్త కొత్త రుచులను ఆస్వాదించాలనుకునే వారికి కొరియన్ ఫ్రైడ్ చికెన్ ఒక మంచి ఎంపిక. బయట ఎంతో క్రిస్పీగా, లోపల చికెన్ ముక్కలు మెత్తగా, జ్యూసీగా ఉండే ఈ వంటకం కొరియాలో చాలా పాపులర్. ముఖ్యంగా దీనిపై వేసే స్పెషల్ సాస్ ఈ చికెన్‌కు అదిరిపోయే రుచిని అందిస్తుంది. కొంచెం తీపి, కొంచెం కారం, కొద్దిగా పులుపు కలిసిన ఈ సాస్ చికెన్‌కు చక్కగా పట్టి ప్రతి ముక్కను మరింత రుచికరంగా మారుస్తుంది. సాధారణంగా ఇంట్లో చేసుకునే చికెన్ ఫ్రైకి భిన్నంగా ఏదైనా కొత్తగా ప్రయత్నించాలనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఈ కొరియన్ స్టైల్ చికెన్‌ను సాయంత్రం స్నాక్‌గా లేదా వీకెండ్ స్పెషల్‌గా తయారు చేసుకోవచ్చు.

కావాల్సిన పదార్థాలు:

బోన్‌లెస్ చికెన్ – 500 గ్రాములు, మైదా – అర కప్పు, కార్న్ ఫ్లోర్ – అర కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, మిరియాల పొడి – అర టీస్పూన్, ఉప్పు – తగినంత, గుడ్డు – ఒకటి, చల్లటి నీళ్లు – తగినన్ని, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా, వెల్లుల్లి తరుగు – ఒక టేబుల్ స్పూన్, గోచుజాంగ్ సాస్ – రెండు టేబుల్ స్పూన్లు, టమోటా కెచప్ – రెండు టేబుల్ స్పూన్లు, సోయా సాస్ – ఒక టేబుల్ స్పూన్, తేనె – రెండు టేబుల్ స్పూన్లు, చిల్లీ ఫ్లేక్స్ – ఒక టీస్పూన్, నువ్వులు – ఒక టీస్పూన్.

Advertisement

Also Read: బ్రెడ్‌తో ఇంత రుచికరమైన స్వీటా? పండగల స్పెషల్ ‘షాహీ టుక్డా’ను మీరు ట్రై చేసేయండి!

తయారు చేయడం ఎలాగంటే?

చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి నీళ్లు లేని గిన్నెలో వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. వీటిని కనీసం 20 నిమిషాల పాటు పక్కన పెట్టి మ్యారినేట్ చేయాలి.

Advertisement

ఇప్పుడు మరో గిన్నెలో మైదా, కార్న్ ఫ్లోర్, గుడ్డు వేసి కొద్దికొద్దిగా చల్లటి నీళ్లు పోస్తూ చిక్కటి పిండిలా కలుపుకోవాలి. ఇందులో మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలను వేసి బాగా పట్టించాలి. కడాయిలో నూనె వేడి చేసి చికెన్ ముక్కలను వేసి మీడియం మంటపై బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. మరింత క్రిస్పీగా రావాలంటే ఒకసారి వేయించిన చికెన్‌ను రెండు నిమిషాలు పక్కన పెట్టి, మరోసారి కొద్దిసేపు వేయించాలి.

ఒక పాన్‌లో కొద్దిగా నూనె వేసి వెల్లుల్లి తరుగు వేయించాలి. అందులో గోచుజాంగ్ సాస్, టమోటా కెచప్, సోయా సాస్, తేనె, చిల్లీ ఫ్లేక్స్ వేసి కలపాలి. సాస్ కొద్దిగా చిక్కబడే వరకు తక్కువ మంటపై ఉడికించాలి. చివరగా వేయించిన చికెన్ ముక్కలను ఈ సాస్‌లో వేసి ప్రతి ముక్కకు సాస్ పట్టేలా కలపాలి. పైన నువ్వులు చల్లి వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కొరియన్ ఫ్రైడ్ చికెన్ సిద్ధమైనట్టే.

Also Read: చికెన్ కంటే పవర్‌ఫుల్.. పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే 5 సూపర్ వెజిటేరియన్ ప్రోటీన్ ఫుడ్స్ ఇవే!

Tags

Related News

పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తినే పుట్టగొడుగుల పాస్తా.. తయారీ విధానం మీ కోసం!

గాలి కాలుష్యంతో రక్తంలో షుగర్ పెరిగే ప్రమాదం.. బెడ్ రూంలో ఇలా చేయండి చాలు

డేటింగ్ యాప్ ఉపయోగించండి.. పెళ్లి కుదరకపోతే డబ్బులు రీఫండ్

అందగాళ్లు, శ్రీమంతులు కాదు.. ఈ 6 గుణాలున్న అబ్బాయిలంటేనే అమ్మాయిలకు పిచ్చి!

సోషల్ మీడియా ఇష్టంలేని బాయ్‌ఫ్రెండ్.. రీల్స్ అంటే పడిచచ్చే గర్ల్‌ఫ్రెండ్.. ప్రేమ నిలుస్తుందా?

పిల్లలు అన్ని రంగాల్లో రాణించాలని తపనపడుతున్నారా? తల్లిదండ్రులు చేసే తప్పులు ఇవే

మనసులో ఒకటి, మెదడులో మరొకటి.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎప్పుడూ నిర్ణయాల్లో తడబడుతుంటారు

Big Stories

Advertisement
×