E-Paper
Advertisement

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం పై.. బీజేపీ సీనియర్ నేతలు ఫైర్!

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం పై.. బీజేపీ సీనియర్ నేతలు ఫైర్!
Advertisement

Sonia Memoir: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పుస్తకం విడుదలైన వెంటనే ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ పుస్తకంలో సోనియా గాంధీ ఎమర్జెన్సీతో పాటు పలు అంశాలను వివరించారు. అయితే ఆమె పుస్తకంపై బిజెపి విమర్శలు మొదలు పెట్టేసింది. ఎమర్జెన్సీ విషయంలో సోనియా చేసిన వ్యాఖ్యలను బిజెపి నేతలు తప్పుబట్టారు.

సోనియా గాంధీ ఆత్మ కథ..

బిలాంగింగ్ -ఏ జర్నీ ఆఫ్ లవ్ పేరిట సోనియా గాంధీ ఆత్మకథను రాసిన సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన ఆ పుస్తకంలోని కొన్ని అంశాలను సోనియా గాంధీ మీడియాతో మాట్లాడుతూ వివరించారు. అందులో ముఖ్యంగా తన అత్తగారు అయిన ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ గురించి కూడా ఉంది. తన మరిది సంజయ్ గాంధీ ఒత్తిడితో పాటు పార్టీలోని కొందరు సీనియర్ నేతల కారణంగానే ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ నిర్ణయం తీసుకున్నారన్నారు సోనియా. అయితే అది కచ్చితంగా తప్పుడు నిర్ణయమే అన్నారు. కాకపోతే ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇందిరాగాంధీ కూడా బాధపడ్డారని మానసికంగా బాగా ఇబ్బంది పడ్డారని సోనియా వివరించారు.

బిజెపి ఎటాక్..

Advertisement

బాబ్రీ మసీదు విధ్వంసానంతరం తాను ఏడ్చానని సోనియా అన్నారు. వీటిపైనే బిజెపి ఎటాక్ చేసింది. ప్రజల ప్రాధమిక హక్కులను అణచివేసి రాజ్యాంగ విరుద్ధంగా అమలు చేసిన ఎమర్జెన్సీని సోనియా సమర్ధిస్తున్నారంటూ బిజెపి నేతలు ఆరోపించారు. ఆమె పుస్తకానికి బిలాంగింగ్ కు బదులు తప్పులను కప్పిపుచ్చడం అనే పేరు పెడితే సరిగ్గా ఉండేదని వారు సెటైర్ విసిరారు. బాబరీ మసీదు గురించి ఏడ్చానన్న సోనియా 1984 లో సిక్కులపై చేసిన దాడుల గురించి ఏడవలేదెందుకని బిజెపి నిలదీసింది. ఈ పుస్తకంలో మన్మోహన్ సింగ్ ప్రధాని అయిన నేపథ్యం.. తాను ప్రధాని పదవి ఎందుకు వద్దనుకున్నదీ కూడా సోనియా వివరించారు.

Also read: ఈసారి మసాలాతో కాదు, కొరియన్ సాస్‌తో చికెన్ ఫ్రై చేయండి.. క్రిస్పీ క్రిస్పీగా భలే ఉంటుంది!

Tags

Related News

హోసూర్ ఐఫోన్ ప్లాంట్‌లో ఘోరం.. ఒకరిని కాపాడబోయి ముగ్గురు మృతి.. అసలేం జరిగింది?

కాళ్ల పారాణి ఆరకముందే.. పెళ్లైన నాలుగు రోజులకే, వధువు ఏం చేసిందంటే..

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దారుణహత్య.. ప్రియురాలు హంతకురాలు, పదునైన ఆయుధంతో పలుమార్లు

యూపీలో తీవ్ర విషాదం.. రీల్స్ చేసే ఇద్దరు మైనర్ బాలికలు ఒకే చెట్టుకు ఉరి! అసలేం జరిగింది?

పెళ్లైన 9 నెలలకే, వధువు ఆత్మహత్య వెనుక షాకింగ్ విషయాలు, కాన్పూర్‌లో దారుణం

మధ్యప్రదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవదహనం!

విద్యుత్తు స్తంభాన్ని ఢీ కొట్టిన కారు, ఆరుగురు సజీవ దహనం, యూపీలో షాకింగ్ ఘటన

Big Stories

Advertisement
×