E-Paper
Advertisement

ఒక వ్యక్తికి కష్టం వస్తే నిందించడం సరికాదు.. రేణు దేశాయ్ పోస్ట్ పవన్ గురించేనా?

ఒక వ్యక్తికి కష్టం వస్తే నిందించడం సరికాదు.. రేణు దేశాయ్ పోస్ట్ పవన్ గురించేనా?
Advertisement

Renu Desai:  సినీనటి రేణు దేశాయ్ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలతో పాటు సామాజిక అంశాల గురించి కూడా మాట్లాడుతూ పోస్టులు చేస్తున్నారు. ఇకపోతే దీపావళి పండుగ సందర్భంగా అర్ధరాత్రి వరకు కూడా క్రాకర్స్ కాల్చడం పట్ల ఈమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇకపోతే తాజాగా రేణు దేశాయ్(Renu Desai) మరొక పోస్ట్ చేశారు. ఇక రేణు దేశాయ్ తన ఇంస్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ…

అద్దాలమేడలో ఉండి రాళ్లు వేయొద్దు..

ఒక వ్యక్తి కష్టాలలో ఉన్నప్పుడు వారిని నిందించడం సరికాదు. ఇప్పటికే కింద పడిపోయిన వారిని తొక్కడం చాలా అమానుషం. వాళ్లు ఏ స్థాయిలో ఉన్నా కూడా వాళ్లు కూడా మనుషులే అనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి. వాళ్లు కూడా ఒక తల్లికి బిడ్డలే.. మరొక బిడ్డకు తల్లిదండ్రులు, మరి కొంతమందికి తోబుట్టువులు. మనం లోపాలు ఉన్న అద్దాలమేడలో ఉంటూ ఇతరుల ఇంటిపై రాళ్లు విసరకూడదని రేణు దేశాయ్ తెలిపారు. మనం అందరం కూడా మనుషులమే అయితే మనం మనుషులమని గుర్తించడానికి మనలో దయ, జాలి,గుణం అనే లక్షణాలు ఇతరుల పట్ల సానుభూతి ఉండాలని ఈమె తెలియజేశారు.

నాకెవరు డబ్బులు ఇవ్వలేదు..

Advertisement

ఇలా రేణు దేశాయ్ ఇతరుల గురించి ఈ విధమైనటువంటి పోస్ట్ చేయడంతో కచ్చితంగా ఈమె పవన్ కళ్యాణ్(Pawan Kalyan), అన్నా లెజినోవా (Anna Lezhneva) విడాకుల వార్తలు గురించి ఈ పోస్ట్ చేశారని ప్రతి ఒక్కరూ భావిస్తారు అందుకే ఈమె ఈ పోస్ట్ కింద నేను ఈ మాటలు చెప్పినంత మాత్రాన మీరు మీ స్టుపిడ్ ఊహగానాలు మొదలు పెట్టకండి. ఒక సమాజంగా మనం అంతకంటే మెరుగ్గా ప్రవర్తించగలమని నేను నిజాయితీగా, మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. చివరిగా అందరికీ ఒక విషయం చెబుతున్నాను ఇతరుల పట్ల ఎల్లప్పుడు దయతో విచక్షణతో ఉండాలని చెప్పడానికి నాకు ఎవరూ కూడా పేటియం ద్వారా డబ్బులు చెల్లించలేదని.. నాకు ఇంకా ఆలోచన శక్తి సరిగా పనిచేస్తుందని.. మనిషిగా ఇలా ఆలోచించడం సర్వసాధారణం అంటూ రేణు దేశాయ్ పోస్ట్ చేశారు.

Advertisement

ఇలా పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజినోవా విడాకులు తీసుకొని విడిపోయిన నేపథ్యంలో రేణు దేశాయ్ ఈ విధమైనటువంటి పోస్ట్ చేయడం పట్ల కచ్చితంగా ఈమె పోస్ట్ పవన్ గురించేనని అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సంచలనంగా మారింది. ఇక రేణు దేశాయ్ సైతం పవన్ కళ్యాణ్ నుంచి 2012 వ సంవత్సరంలో విడాకులు తీసుకొని విడిపోయిన సంగతి తెలిసిందే. ఇలా ఈమె నుంచి విడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవాను వివాహం చేసుకున్నారు. 13 సంవత్సరాల వైవాహిక బంధం తర్వాత వీరిద్దరూ కూడా విడాకులు తీసుకొని విడిపోయారు.

Also Read: పవన్ అన్నా బాటలోనే మరో టాలీవుడ్ స్టార్ కపుల్స్? డివోర్స్ ఫార్మాలిటీస్ పూర్తి?

Related News

వందల కోట్లు కుమ్మరిస్తున్న మైత్రి మేకర్స్.. రికవరీ సాధ్యమేనా?

వేలకోట్ల ఆస్తులు..అన్నా బిజినెస్ సామ్రాజ్యం చూశారా?

పవన్ అన్నా బాటలోనే మరో టాలీవుడ్ స్టార్ కపుల్స్? డివోర్స్ ఫార్మాలిటీస్ పూర్తి?

పవన్ తో డివోర్స్ ముందే హింట్ ఇచ్చిన అన్నా.. చివరి పోస్ట్ ఇదేనా?

ఇరుముడి బ్యూటీ ఇంట పెళ్లి సందడి షురూ..ప్రియుడితో పెళ్లికి ఓకే చెప్పేసిందా?

సాటి మనుషుల పట్ల దయతో ఉండండి.. రేణు దేశాయ్ సంచలన పోస్ట్!

పవన్ కళ్యాణ్ – అన్నా విడాకుల వెనుక అసలు కారణం ఇదేనా?

Big Stories

Advertisement
×