Disha Patani:దిశా పటానీ..తెలుగు వారికి లోఫర్ సినిమాతో పరిచయమైన ఈ బ్యూటీ ఇపుడు తన గ్లామర్ విందుతో సోషల్ మీడియాలో మంటలు పెట్టేస్తుంది.ముఖ్యంగా ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్స్, ఫ్యాషన్ లుక్స్, గ్లామరస్ ఫోటోలను అభిమానులతో పంచుకునే ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు ఫాలోవర్స్ ని ఫిదా చేస్తున్నాయనడంలో సందేహం లేదు.
ముఖ్యంగా తెల్లటి డిజైనర్ కాస్ట్యూమ్స్ లో ఈ భామ ఇచ్చిన ఫోజులు అభిమానులకి నిద్ర లేకుండా చేస్తుంది.తాజాగా షేర్ చేసిన ఫోటోల్లో దిశా పటానీ వైట్ కలర్ డిజైనర్ అవుట్‌ఫిట్‌లో కనిపించి మురిపించింది.ఇక ఈ కాస్ట్యూమ్ కి తగ్గట్టుగా పెట్టుకున్న చెవి పోగులు. లాంగ్ హెయిర్ స్టైల్, సింపుల్ మేకప్ పిక్స్ మరింత అందాన్ని యాడ్ చేసేశాయి.
మాములుగానే దిశా పటానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెల్సిందే. ముఖ్యంగా తన సినిమా అప్‌డేట్స్‌తో పాటు ఫోటోషూట్స్, ఫ్యాషన్ ఫోటోస్, పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలని షేర్ చేసుకుంటూ సందడి చేస్తుంది.ఇక ఈ భామ పెట్టే పోస్ట్ లకి మంచి అప్లాజ్ వస్తూ ఉంటుంది కూడా .మరీ ముఖ్యంగా ఫ్యాషన్ విషయంలో దిశాకు స్పెషల్ ఫ్యాన్ పాలోయింగ్ ఉందనే చెప్పాలి. వెస్ట్రన్ వేర్ అయినా, ట్రెడిషనల్ అవుట్‌ఫిట్ అయినా తనదైన స్టైల్‌తో మెస్మరైజ్ చేసేస్తుంది ఈ బీటౌన్ బ్యూటీ.
ఇక సినిమాల విషయానికి వస్తే.. దిశా పటానీ తెలుగు లో వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘లోఫర్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెల్సిందే. ఇక ఆ తర్వాత బాలీవుడ్‌లో ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ సినిమాతో నేషనల్ వైడ్ గా క్రేజ్ కొట్టేసింది.ఒక రకంగా ఈ సినిమాతోనే దిశా బాలీవుడ్ లో పాగా వేసిందని చెప్పాలి.
ఇక ఆ తర్వాత బాఘీ 2, భారత్, మలంగ్, రాధే, ఏక్ విలన్ రిటర్న్స్ వంటి సినిమాలతో బాలీవుడ్‌లో పాతుకుపోయిన ఈ అమ్మడు అటు గ్లామర్ రోల్స్ తో పాటు తగ్గేదేలే అంటూ యాక్షన్ సీన్స్ లోనూ సత్తా చాటడం మెచ్చుకోతగ్గ విషయం .ముఖ్యంగా టైగర్ ష్రాఫ్‌తో కలిసి నటించిన బాఘీ 2లో చేసిన పాత్ర మంచి పేరే తెచ్చింది.ఇక ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘కల్కి 2898 ఏడీ’లో రాక్సీ పాత్రలో మురిపించింది.మొత్తానికి సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో అభిమానులకు ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలతో ట్రీట్ ఇస్తుంటుందని తాజా పోస్ట్ తో మరోసారి ప్రూవ్ చేసింది !