E-Paper
Advertisement

గాలి కాలుష్యంతో రక్తంలో షుగర్ పెరిగే ప్రమాదం.. బెడ్ రూంలో ఇలా చేయండి చాలు

గాలి కాలుష్యంతో రక్తంలో షుగర్ పెరిగే ప్రమాదం.. బెడ్ రూంలో ఇలా చేయండి చాలు
Advertisement

Air pollution and diabetes risk| మంచి ఆహారం, వ్యాయామం మాత్రమే ఆరోగ్యానికి సరిపోవు. మనం ప్రతిరోజూ పీల్చే గాలి కూడా రక్తంలో షుగర్ లెవెల్స్‌పై ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనం సూచిస్తోంది. ముఖ్యంగా ప్రీడయాబెటిస్ ఉన్నవారు నిద్రపోయే సమయంలో ఎయిర్ ప్యూరిఫైయర్లను ఉపయోగిస్తే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉండవచ్చని పరిశోధకులు గుర్తించారు. పడకగదిలో గాలిని శుభ్రంగా ఉంచడం వల్ల ఉదయం రక్తంలో బ్లడ్ షుగర్ ఒక్కసారిగా పెరగకుండా సహాయపడవచ్చని అధ్యయనం వెల్లడించింది.

గాలి కాలుష్యంతో రక్తంలో షుగర్ పెరిగే ప్రమాదం

అమెరికాలోని న్యూయార్క్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఇందులో ప్రీడయాబెటిస్ ఉన్న 150 మందికి పైగా మహిళలు, పురుషులు పాల్గొన్నారు. వీరిలో ఎవరికీ ధమనుల్లో కొవ్వు పేరుకుపోయే అథెరోస్క్లెరోసిస్ సమస్య ఉన్నట్లు గుర్తించలేదు. ప్రీడయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర సాధారణ స్థాయికంటే ఎక్కువగా ఉంటుంది. అయితే, ఈ లెవెల్స్ మధుమేహం నిర్ధారణకు అవసరమైన పరిమితిని చేరుకోవు.
ప్రీడయాబెటిస్ ఉన్నవారికి భవిష్యత్తులో టైప్ 2 మధుమేహం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. రోజంతా రక్తంలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా మారడం కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.

ఎయిర్ ప్యూరిఫైయర్లు ఎలా పనిచేశాయి?

Advertisement

పరిశోధకులు పడకగదుల్లో ఉపయోగించే పోర్టబుల్ ఎయిర్ ప్యూరిఫైయర్ల ప్రభావాన్ని పరిశీలించారు. వీటిలో హై ఎఫిషియెన్సీ పార్టిక్యులేట్ ఎయిర్ (HEPA) ఫిల్టర్లను ఉపయోగించారు. ఈ ఫిల్టర్లు 0.3 మైక్రాన్ల పరిమాణంలో ఉండే గాలిలోని 99 శాతానికి పైగా కణాలను తొలగించగలవు.
పరిశోధకులు పాల్గొన్నవారిని రెండు బృందాలుగా విభజించారు. మొదటి బృందం 4 వారాలపాటు నిద్రించే సమయంలో నిజమైన ఎయిర్ ప్యూరిఫైయర్లను ఉపయోగించింది. రెండో బృందం గాలిని శుభ్రం చేయని నకిలీ పరికరాలను ఉపయోగించింది. నిజమైన ఎయిర్ ప్యూరిఫైయర్లు గాలిలోని హానికరమైన సూక్ష్మ కణాలను 36 శాతం తగ్గించాయి.

బ్లడ్ షుగర్ లెవెల్స్‌లో మెరుగుదల

పాల్గొన్నవారు కంటిన్యూయస్ గ్లూకోజ్ మానిటర్లను ధరించారు. ఈ చిన్న సెన్సర్లు ప్రతి కొన్ని నిమిషాలకు రక్తంలో షుగర్ లెవెల్స్ నమోదు చేశాయి. ఫిల్టర్ల వినియోగానికి ముందు ఒక వారం పాటు పరిశోధకులు రీడింగ్స్ సేకరించారు. నాలుగు వారాల తర్వాత మరోసారి పరీక్షలు నిర్వహించారు.
శుభ్రమైన గాలిని పీల్చినవారిలో రక్తంలో చక్కెర హెచ్చుతగ్గులు తగ్గినట్లు గుర్తించారు. ముఖ్యంగా ఉదయం అల్పాహారం తర్వాత చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగడం తగ్గింది.
అల్పాహారం తర్వాత రక్తంలో చేరే అదనపు గ్లూకోజ్ పరిమాణం కూడా సగటున తగ్గింది. గరిష్ఠ రక్తంలో షుగర్ లెవెల్స్‌లోనూ తగ్గుదల కనిపించింది.

గుండె ఆరోగ్యానికి కూడా ఉపయోగకరం

Advertisement

ఈ అధ్యయనానికి నాయకత్వం వహించిన కార్డియాలజిస్ట్ షరీన్ ఎల్. విట్‌కాప్ పడకగదిలో గాలి నాణ్యత ప్రాముఖ్యతను వివరించారు. శుభ్రమైన గాలి ప్రీడయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచేందుకు సహాయపడవచ్చని ఆమె తెలిపారు.
అధ్యయంనలో సీనియర్ పరిశోధకుడు జోనాథన్ న్యూమన్ కూడా గాలి కాలుష్యం ఊపిరితిత్తులకే కాకుండా గుండె, జీవక్రియ ఆరోగ్యానికి కూడా హానికరమని పేర్కొన్నారు.

Also Read: స్వీట్స్ తినడం కంటే ఇది డేంజర్.. షుగర్ సమస్య పెరగడానికి అతిపెద్ద కారణం ఇదే

ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు శుభ్రమైన గాలి అవసరం

HEPA ఫిల్టర్లు గాలిలోని కాలుష్య కణాలను తగ్గించేందుకు ఉపయోగపడవచ్చు. అయితే, ఇవి మధుమేహానికి చికిత్సగా పనిచేయవు. సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, వైద్యులు సూచించిన మందులు కొనసాగించాలి. ఎయిర్ ప్యూరిఫైయర్లను అదనపు జాగ్రత్తగా మాత్రమే పరిగణించాలి.
ఈ అధ్యయనం అమెరికన్ హార్ట్ జర్నల్లో ప్రచురితమైంది. అయితే, ఈ ఫలితాలను నిర్ధారించడానికి మరిన్ని పరిశోధనలు అవసరం.

Related News

డేటింగ్ యాప్ ఉపయోగించండి.. పెళ్లి కుదరకపోతే డబ్బులు రీఫండ్

అందగాళ్లు, శ్రీమంతులు కాదు.. ఈ 6 గుణాలున్న అబ్బాయిలంటేనే అమ్మాయిలకు పిచ్చి!

సోషల్ మీడియా ఇష్టంలేని బాయ్‌ఫ్రెండ్.. రీల్స్ అంటే పడిచచ్చే గర్ల్‌ఫ్రెండ్.. ప్రేమ నిలుస్తుందా?

పిల్లలు అన్ని రంగాల్లో రాణించాలని తపనపడుతున్నారా? తల్లిదండ్రులు చేసే తప్పులు ఇవే

మనసులో ఒకటి, మెదడులో మరొకటి.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎప్పుడూ నిర్ణయాల్లో తడబడుతుంటారు

డ్రాగన్ ఫ్రూట్ తింటే చర్మానికి ఇన్ని ప్రయోజనాలా? రోజూ ఇలా తినండి

వాయు కాలుష్యం నుంచి రక్షణకు ఏ మాస్క్ ధరించాలి.. N95, N99, KN95 మధ్య తేడాలివే

Big Stories

Advertisement
×