AP Local Elections: దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనుకున్నారో ఏమో తెలియదు కానీ.. ఉత్తరాంధ్రలో కీలక నేతల భార్యలు లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీకి సై అన్నారు. దీంతో ఆ ఏరియాల్లో అందరి దృష్టి వారిపైనే పడింది. పోటీలో ఉన్నవారి భర్తలు ఎమ్మెల్యేలే కావొచ్చు. కానీ, వారి కుటుంబ సభ్యులు మరింత కీలక పదవుల్లో ఉన్నారు.
స్పీకర్ భార్య ..
ఎమ్మెల్యే, స్పీకర్ అయ్యన్న పాత్రుడి భార్య పద్మావతి నర్సీపట్నం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పోటీ చేసి గెలిచారు. 40 వార్డులకు కూటమి ఏకంగా 39 వార్డులను గెలుచుకోవడంతో ఆమె చైర్‌పర్సన్ పీఠం దక్కించుకున్నారు. పద్మావతి భర్త ఎమ్మెల్యే మాత్రమే కాదు. ఆమె కొడుకు రాజ్యసభ సభ్యుడు కూడా.
కేంద్రమంత్రి అత్త..
నెక్స్ట్ బండారు మాధవీలత. ఈమె మాడుగుల ఎమ్మెల్యే, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి సతీమణి. వెన్నెలపాలెం సర్పంచ్ అభ్యర్థిగా ఆమె నామినేషన్ వేశారు. కూటమి నేతలు, మహిళలు, యువతతో మాధవీలత నిర్వహించిన నామినేషన్ ర్యాలీ ఆమె గెలుపు దాదాపు ఖాయం చేసిందని ప్రచారాన్ని పెంచింది. మాధవీలత కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడికి పిల్లనిచ్చిన అత్త కావడంతో ఆమె పోటీ టాక్ ఆఫ్ ఏపీగా మారింది.
ప్రజా తీర్పుకే పట్టా?
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మున్సిపల్ చైర్‌పర్సన్ పదవికి కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రమీల.. ఎమ్మెల్యే కూన రవి భార్య. ఆమె గెలుపు కూడా తథ్యం అంటున్నారు నియోజకవర్గ టీడీపీ శ్రేణులు. మహిళలకు నాయకత్వం పేరుతో ఎమ్మెల్యేలు వారి సతీమణులకే అవకాశం కల్పిస్తున్నారనే విమర్శ ఉంది. అయితే, ఫైనల్‌గా గెలిపించేది మాత్రం ప్రజలే కదా? అనే వెర్షన్ కూడా వినిపిస్తోంది.
Also Read: చర్యకు ప్రతిచర్య తప్పదు.. టీడీపీ నేతలు, పోలీసులకు కేతిరెడ్డి వార్నింగ్